![CM Jagan Memantha Siddham BusYatra 17th Day Schedule - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/18/ysjaganbusyatra10.jpg.webp?itok=tje3UPJc)
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు.
మేమంతా సిద్ధం 18వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 19) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఎస్‌టీ రాజపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment