అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది: సీఎం జగన్‌ | YSRCP Regional coordinators Meeting In Presence Of CM Jagan | Sakshi
Sakshi News home page

అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది.. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్‌

Published Mon, Mar 18 2024 5:25 PM | Last Updated on Mon, Mar 18 2024 9:10 PM

YSRCP Regional coordinators Meeting In Presence Of CM Jagan - Sakshi

అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది

ఎన్నికల షెడ్యూల్‌ వల్ల ఈ వెసులుబాటు వచ్చింది.

ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి.

సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్రకూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

రీజినల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్.

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్టీ రీజనల్‌ కో ఆర్డీనేటర్ల సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సాగిన ఈ  సమావేశంలో వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర, రూట్‌ మ్యాప్‌, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. మూడు పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యచరణపై పార్టీ నేతలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

రీజనల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన ఎన్నికల షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని తెలిపారు. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్నీ సదర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. ఈ మేరకు అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. దీనిపై పార్టీకి చెందిన రీజినల్ కో-ఆర్డినేటర్లు వారికి మార్గనిర్దేశం చేయాలన్నారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్లమెంటు నియోజకవర్గాల్లో మార్పులు చేశామని, అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులును, నాయకత్వాన్ని సంఘటితపరిచి, వారిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకునడవాలని చెప్పారు.
చదవండి: పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం.. ఎందుకు కలిశారో చెప్పాలి: సజ్జల

పార్టీ లక్ష్యం సాధించే దిశలో కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని , ఘనవిజయాలు నమోదు చేయాలన్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిలవాలన్నారు. అలాగే బస్సు యాత్ర ప్రారంభమవుతున్నందున దీనికి అన్నిరకాలుగా సిద్ధంకావాలని, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ సభలు చరిత్రాత్మకం కావాలని   పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

కాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ ప్రచారంపై దృష్టి పెట్టింది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్‌ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్‌.. మధ్యాహ్నం/సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర.. ఆ తర్వాత ఎన్నిలక ప్రచార సభలు ఉండనున్నాయి. ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.
చదవండి: Bus Yatra: జనంలోకి సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement