తాడిపత్రి: ‘జేసీ ప్రభాకరరెడ్డి నీకు సిగ్గుందా? అసలు మున్సిపాలిటీలో డీజిల్ కుంభకోణం జరిగింది నీ హయాంలో కాదా? ఈ విషయాన్ని కప్పిపెట్టి అధికారులపై నిందలు మోపుతావా?’ అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. స్థానిక తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో ప్రాభవాన్ని కోల్పోయిన జేసీ సోదరులు... రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో అధికారులు, పోలీసులను బెదిరించి గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయ త్నిస్తున్నారని మండిపడ్డారు.
తన మాట వినని అధికారులకు అవినీతి మరక అంటించడం జేసీ ప్రభాకర్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఒక్కసారి జేసీ ప్రభాకరరెడ్డి గత చరిత్రను పరిశీలిస్తే అక్రమాలు వెల్లువలా వెలుగులోకి వస్తాయన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా జేసీ ప్రభాకరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ వాడకం ఎంత మేరకు ఉందో... ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎంత మేరకు తగ్గిందో ఒక్కసారి గుర్తించాలన్నారు. అప్పట్లో మున్సిపల్ ఏఈ జయభారత్‌రెడ్డిని దొడ్డిదారిన కమిషనర్‌గా ఏర్పాటు చేయించుకుని మున్సిపాలిటీని నిలువునా దోచేశాడన్నారు.
ఈ విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. గతంలో తాను సవాల్ చేసిన ప్రతిసారీ జేసీ ప్రభాకరరెడ్డి తోక ముడుస్తూ వచ్చాడన్నారు. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో అలజడులు సృష్టించేందుకు అధికారులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతుండడం సిగ్గుచేటన్నారు. కాలం చెల్లిన రాజకీయ నేత జేసీ ప్రభాకరరెడ్డి బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. తన అక్రమాలు వెలుగులోకి రాకుండా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకుండా రెండు నెలలుగా జాప్యం చేస్తున్నాడన్నారు. ఇప్పటికై నా నీచ రాజకీయాలకు స్వస్తి పలకకపోతే పుట్టగతుల్లేకుండా పోతావని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment