
సాక్షి,అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రి జేసీ పార్క్‌లో అర్ధరాత్రి దాకా డిస్కో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌కు మహిళలకు మాత్రమే ప్రవేశమంటూ ప్రకటించారు. తాడిపత్రి మహిళలంతా ఎంజాయ్ చేయాలంటూ జేసీ సలహా ఇచ్చారు.
అయితే,జేసీ తీరుపై బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలత మండిపడ్డారు. సున్నిత ప్రాంతమైన తాడిపత్రిలో ఇలాంటి ఈవెంట్ నిర్వహించడం సరికాదని హెచ్చరించారు. మహిళలకు భద్రత ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment