
సాక్షి, అనంతపురం: సీఐ ఆనందరావు ఆత్మహత్య అంశంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైరయ్యారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య ను రాజకీయం చేయడం దురదృష్టకరమని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
ఆత్మహత్యకు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. టీడీపీ పాలనలో పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసని అన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించాలని కోరారు.
తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లాక తలుపులు బిగించుకొని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు... తాడిపత్రి సీఐ ఆనందరావు మృతికి కుటుంబ కలహాలే కారణమని తెలిపారు.
ఇదీ చదవండి: ఆత్మహత్యకు పాల్పడ తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు