సాక్షి, తాడిపత్రి : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం తీవ్రంగా ఖండించారు. జేసీ ప్రభాకర్రెడ్డి ఓ గూండాలాగా ప్రవర్తించారు. పోలీసులపై జేసీ అనుచిత ప్రవర్తన సరికాదు.. పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన అంటూ ప్రశ్నించారు. ఒక ప్రజాపతినిధిగా పనిచేసిన వ్యక్తి పోలీసులను హిజ్రాలతో పోల్చడం దారుణమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బహింరంగంగానే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారన్నారు. జేసీ బ్రదర్స్ ఆగడాలపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించాలని కోరారు. దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీలపై లోతుగా విచారించి జేసీ బ్రదర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దారెడ్డి వెల్లడించారు.(జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు)
Comments
Please login to add a commentAdd a comment