
అనంతపురం, సాక్షి: టీడీపీ సీనియర్లు.. ఇప్పుడు తమ అసలు రూపం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. రవాణా శాఖ అధికారులను ఉద్దేశించి.. నరికేస్తానంటూ వ్యాఖ్యానించారు.
అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ జేసీ ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. జేసీ ట్రావెల్స్ బస్సులు, లారీలను సీజ్ చేసిన వాళ్లందరిపై ప్రతీకారం తీర్చుకుంటా అంటూ ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. ఈ క్రమంలో రవాణా శాఖ జేటీసీ శివరాం ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అత్తికానాజ్ లను వదలను అంటూ నేరుగా బెదిరించారాయన.
‘‘నా బస్సులు సీజ్ చేయడంపై పదిరోజుల్లో ఎంక్వైరీ జరగాలి. నేను ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబుని ఏం అనను. చంద్రబాబును నేనేం వ్యతిరేకం కాను. కానీ, నా బస్సుల సీజ్‌ల విషయంలో ఎవరినీ వదలను. బ్రేక్ ఇన్‌స్పెక్టర్లకు చెబుతున్నా.. నేను ఎంత దూరమైనా వెళ్తా. బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు నా కాళ్లు పట్టుకుని నా బస్సులు రిపేర్లు చేయాల్సిందే!’’ అని అన్నారాయన.
కొసమెరుపు: ఇంతలా రెచ్చిపోయిన జేసీ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని, తనను.. తన కుటుంబ సభ్యుల్ని దొంగోళ్లుగా చూశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Comments
Please login to add a commentAdd a comment