madhavi latha
-
నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత
హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత (Madhavi Latha) బోరున ఏడ్చేసింది. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఎంతో ప్రయత్నించా.. కానీ, నేనూ మనిషినే! నా ఆత్మగౌరవంపై జరిగిన దాడి.. నేను పడ్డ బాధను వర్ణించే పదాలు లేవు. ఎవరో వస్తారని ఎదురుచూడలేదు!ప్రతి క్షణం వేదన అనుభవిస్తున్నాను. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం.. అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు, పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరో వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్నా.. నా పార్టీ (ప్రజల) కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. ఎవరి దగ్గరా రూపాయి తీసుకున్నది లేదు.. ఎవరికీ ద్రోహం చేసిందీ లేదు.. మోసం చేసిందీ లేదు.చదవండి: హీరో విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు?నాపై కక్షతో..కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. ఆడపిల్లగా ఎప్పుడూ సింపతీ గేమ్ ఆడలేదు. మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించలేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమించండి. మీ ప్రేమాభిమానం, ఆశీర్వాదాలు నాకు శక్తినిస్తాయి అని రాసుకొచ్చారు.ఏం జరిగింది?డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. జేసీ పార్కులో వేడుకలకు మహిళలు వెళ్లొద్దని సూచించారు. తిరుగుప్రయాణంలో అర్ధరాత్రివేళ ఏదైనా జరగడకూడనిది జరిగితే ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ మాధవీలతపై అసభ్య కామెంట్లు చేశారు. ఆమెను వ్యభిచారి అని వ్యాఖ్యానించారు. తెరపై కనిపించేవాళ్లంతా వ్యభిచారులే అనడం నీ కుసంస్కారానికి అద్దం పడుతోందని మాధవీలత ఫైర్ అయ్యారు. తర్వాత నోరు జారినందుకు జేసీ సారీ చెప్పారు. అయినా సరే మాధవీలతపై విమర్శల దాడి జరుగుతూనే ఉండటంతో తట్టుకోలేక ఇలా ఏడ్చేశారు.సినిమా..కాగా మాధవీలత.. నచ్చావులే సినిమాతో హీరోయిన్గా తెలుగుతెరకు పరిచయమైంది. తర్వాత ష్, స్నేహితుడా, ఉసురు, చూడాలని చెప్పాలని, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ఆంబాల అనే మూవీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. చివరగా మధురై మణికురవర్ (2021) అనే తమిళ మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Runs NGO ll (@actressmaadhavi) చదవండి: సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా -
నేను కూడా మనిషినే.. వెక్కి వెక్కి ఏడ్చిన మాధవీలత
-
మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
మాధవీలతకు ‘జేసీ’ బహిరంగ క్షమాపణ
సాక్షి,అనంతపురం:తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. మాధవీలతపై జేసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జేసీ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో మాధవీలతను ఆయన క్షమాపణలు కోరారు.‘ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ’అని జేసీ అన్నారు. అయితే బీజేపీ నేతలపై మాత్రం జేసీ విమర్శలు కొనసాగించారు.బీజేపీ నేతలంతా ఫ్లెక్సీ గాళ్లు అంటూ మరోసారి ఫైరయ్యారు జేసీ. పవర్ ఉందని మంత్రి సత్యకుమార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తాను మీరకున్నంత నీచున్ని కాదన్నారు.పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. నేను జోలి పడితే కోట్ల రూపాయలు ఇచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీడియా ఎదుట నోట్ల కట్టలు విసురుతూ జేసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: తుస్సుమన్న బాబు,పవన్ హామీ -
జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలపై మాధవీలత రియాక్షన్
-
ఆమెతోనా మాకు నీతులు చెప్పించేది
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం టవర్ క్లాక్ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా.. ఆయన సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె పెద్ద వ్యభి చారి అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లొద్దన్నందుకు..నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆయనతో పాటు టీడీపీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున కూడా పరుష పదజాలంతో మాట్లాడారు. మాధవీలతకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ అశ్లీలంగా నటించిందంటూ వ్యాఖ్యానించారు.మీరు థర్డ్ జెండర్ కంటే అధ్వానం..జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీని, దాని అనుబంధ సంస్థలనూ వదల్లేదు. ‘మాధవీలత బతుకుదెరువు కోసం ఏదో పాట్లు పడుతోంది, పడనివ్వండి. ఆమె మాకు నీతులు చెప్పకూ డదు. భజరంగదళ్, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్.. ఇలాంటి వాళ్లా నన్ను బెదిరించేది? వాళ్లకంటే థర్డ్‌జెండర్ (ట్రాన్స్‌జెండర్)లు మేలు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక్కోలేరు.. సిగ్గులేని నా కొ...కల్లారా అంటూ ఫైర్ అయ్యారు. తన బస్సును కాల్చిన తర్వాత ఆ వేడికి కరెంటు వైర్లు పడ్డాయని.. కానీ, షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారని, అలాగే రాసుకోండని జేసీ అన్నారు. తన వర్గం మహిళలతో మాధవీలత పైనే తాడిపత్రి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు.జేసీకి మతిపోయిందేమో..ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డికి వయసు రీత్యా మతి ఏమైనా పోయిందేమోనని, ఒకసారి చూపించుకోవాలని బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు సూచించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ మహిళా నేతలపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమిలో ఉండి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఇది సరైంది కాదని హితవు పలికారు.కేసులకు భయపడను : మాధవీలతజేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఇలాగైతే తాడిపత్రి నుంచి తెర మీదకు ఎవరూ రాకూడదన్నట్లు ఉందన్నారు. తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు. -
జేసీ వ్యాఖ్యలపై మాధవీలత రియాక్షన్
సాక్షి, అనంతపురం: సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒక వ్యభిచారి అని.. తనను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలపై మాధవీలత స్పందిస్తూ.. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.సినిమాల్లో నటించే వారంతా వ్యభిచారులు అనుకోవడం జేసీ మూర్ఖత్వం. తండ్రి జేసీ అనుచిత వ్యాఖ్యలను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఎందుకు ఖండించరు. జేసీ ప్రభాకర్ రెడ్డి వయస్సుకు గౌరవం ఇస్తా.. అసభ్య భాషకు కాదు. నేను ఎవరికీ భయపడను. నన్ను కిడ్నాప్ చేసి.. హత్య చేస్తారా?. రాజ్యాంగ బద్ధంగా.. మహిళల రక్షణ కోసం మాట్లాడితే తప్పా?. జేసీ ప్రభాకర్ రెడ్డి కుసంస్కారి.. ఒళ్లంతా విష నాలుకలు కలిగిన వ్యక్తి’’ అంటూ మాధవీలత వ్యాఖ్యానించారు.కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదీ చదవండి: పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!ఇక, అంతకుముందు ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు
భారత రాజకీయాల్లో మహిళల పాత్ర అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర మంత్రివర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు అన్ని రాజకీయ పార్టీలలో మహిళా భాగస్వామ్యం మరింతగా పెరుగుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో మహిళల భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2024లో రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలువురు మహిళా నేతలు తామేమటన్నదీ రుజువుచేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములను పక్కన పెడితే పలువురు మహిళా నేతలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.కంగనా రనౌత్నటి కంగనా రనౌత్ ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై గెలుపొంది, పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈ విజయంతో కంగనా రనౌత్ తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా 2024లో వార్తల్లో నిలిచారు.మహువా మోయిత్రాపశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మోయిత్రా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ముఖ్యాంశాలలో నిలిచారు. మహువా మోయిత్రా జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.స్వాతి మలివాల్సామాజిక కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలైన స్వాతి మలివాల్ 2024లో వార్తల్లో నిలిచారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెక్రటరీపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దరిమిలా స్వాతి మలివాల్ పేరు హెడ్ లైన్స్ లో నిలిచింది.కొంపెల్ల మాధవీ లతహైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కొంపెల్ల మాధవీ లతకు బీజేపీ టికెట్ ఇచ్చింది. నాలుగుసార్లు హైదరాబాద్ ఎంపీగా ఎన్నికైన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై మాధవీ లత పోటీ చేశారు. ఆమె ఎన్నికల్లో ఓటమిపాలైనా ప్రజల దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో తరచూ కనిపించారు.వసుంధర రాజేరాజస్థాన్లో బీజేపీ విజయం సాధించిన దరిమిలా మహిళా నేత వసుంధరా రాజే సీఎం అవుతారనే వార్తలు వినిపించాయి. అయితే దీనికి భిన్నంగా బీజేపీ నేత భజన్‌లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాలకు కలతచెందిన వసుంధరా రాజే రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. వసుంధర రాజే తన ప్రసంగాలు, వ్యాఖ్యల కారణంగా ఈ ఏడాది వార్తల్లో నిలిచారు.ప్రియాంకా గాంధీరెండు దశాబ్దాల కిందట గాంధీ - నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయమైన ప్రియాంక గాంధీ 2024లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి రికార్డుస్థాయి విజయం అందుకున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ప్రచార సమయంలో ఆమె ప్రజలతో మమేకమవుతూ ‘తానొక ఫైటర్’ని అంటూ చేసిన చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే.. -
సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు
అవనిగడ్డ: తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఏడో వార్డుకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ అవనిగడ్డ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమది హిందూ కుటుంబమని, తరచూ తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తామని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఆరోపించడం తగదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగించారని, హోంమంత్రి వంగలపూడి అనిత, తెలంగాణ బీజేపీ నేత మాధవీలత లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మీడియో ముందు మాట్లాడారని, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లడ్డూలో కల్తీ జరిగిందని దేవాలయాల్లో పూజలు చేయించారని చెప్పారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో పాటు చట్టవ్యతిరేక విధానాలు అవలంబించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు గౌతమ్ చెప్పారు. -
హోంమంత్రి అనిత మాటలు పచ్చి అబద్ధం: హీరోయిన్ మాధవీలత
ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత వినాయక విగ్రహాల చలాన్లపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కేవలం మండపాలకే మాత్రమే రుసుములు ఉండేవని తెలిపారు. విగ్రహాల అడుగుల ఎత్తు, ఎకో గణేశా పేరిట ప్రత్యేకంగా ఎలాంటి చలాన్లు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అని వెల్లడించారు. అయితే పది రోజుల క్రితం హోంమంత్రి అనిత ప్రెస్మీట్లో ఈ రూల్స్ ప్రకటించడం అక్షర సత్యమన్నారు. కొత్తగా తెచ్చిన రూల్స్ గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీదే కదా? అని మాధవీలత ప్రశ్నించారు. మేము కాషాయ కండువాలు మోసే వాళ్లమని..డబ్బులతో నన్ను ఎవరూ కొనలేరని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్)మాధవీలతపై నెటిజన్ల ప్రశంసలు..ఆమె వీడియో చూసిన నెటిజన్స్ మాధవీలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పును ధైర్యంగా ప్రశ్నించారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు నిజాయితీగా ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపారని.. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలంటూ మాధవీలతను ప్రశంసిస్తున్నారు. కాగా.. అంతకుముందు వినాయక విగ్రహాలకు ఇష్టారీతిన చలాన్లు విధించండంపై హీరోయిన్ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక చవితి సందర్భంగా చలాన్లపై ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని ఆమె మండిపడ్డారు. డబ్బులు కావాలంటే దానం చేస్తాం.. అంతే కానీ ఇలా మండపాల దగ్గర చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ హోంమంత్రిని ప్రశ్నించారు. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని హోంమంత్రిని మాధవీలత నిలదీశారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi) -
అనితపై మాధవీ లత ఫైర్
-
అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్
ఏపీ హోమంత్రి వంగలపూడి అనితపై హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత మండిపడ్డారు. వినాయక చవితి సందర్భంగా చలాన్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని హోమంత్రిని నిలదీశారు. అన్ని మతాలు, పండుగలు సమానమని.. కానీ హిందూ పండగలపైనే ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ.. మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అనితక్కా?.. ఏంది మీ తిక్కా?.. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర ఈ చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ మరింత ఘాటుగా ఇచ్చిపడేశారు. మాధవీలత తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు అడుక్కుంటే భిక్షం వేయడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. అసలే మా గణేశుడికి ఆకలి ఎక్కువ. ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు చిల్లర డబ్బులు మీ ముఖాన వేస్తారు. అందరికీ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సమాన న్యాయం, సమాన ధర్మం పెట్టండి. అన్ని మతాలు , పండగలు సమానం, అందరూ సమానమని చెప్పి.. మరి మా మైక్ సెట్‌కి, మా గణేశ మంటపాలకి, మా గమేష్ ఎత్తుకి డబ్బులెందుకో? అనితక్కా?.. ఏంది మీ తిక్కా? ఔనక్కా మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు ఏమైంది ఆ కేసు ?? ముసలోడు ఉయ్యాల్లో ఉన్న బిడ్డని మానభంగం చేశాడు. ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా? ఓహో ఇపుడు మేమిచ్చే చిల్లర భిక్షతో లాయర్‌ను పెడతారా?' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: తీరికలేనప్పుడు ఎందుకొచ్చారు? )కాగా.. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవీలత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi) -
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణపై ఢిల్లీ పెద్దలు పెట్టిన ఫోకస్ మొత్తానికి ఫలించింది. 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలుపొంది తన విజయం శాతాన్ని మెరుగుపర్చుకుంది. అయితే గెలుపు సంగతి పక్కనపెడితే హాట్ టాపిక్‌గా మారిన హైదరాబాద్ ఎంపీ సీటులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది.ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే చేసింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెళ్ల మాధవీలతను ఎంచుకుంది. తద్వారా ఎంఐఎం అడ్డాలో నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. కానీ, ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారరి బెడిసి కొట్టింది. విరించి హాస్పిటల్స్ ఛైర్ పర్సన్‌గా ఉన్న మాధవీలత.. హిందుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలిగే మాధవీలత.. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. పాతబస్తీలో కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో మాధవీలతను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది.ఇక అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవీలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆమె చిత్రవిచిత్రమైన చేష్టలకు దిగారు. ఆ విన్యాసాలతో సోషల్ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను భాగం చేయకపోవడమూ పెద్ద మైనస్‌గా మారింది. మరోవైపు పోలింగ్ టైంలో హిజాబ్‌లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాకు ఎక్కి.. వివాదాస్పదంగా మారింది కూడా.కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏమాత్రం సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థి హోదాతో నవ్వుల పాలు అయ్యిందనేది విశ్లేషకుల మాట.హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీ 3.35 లక్షల భారీ మెజారిటీతో మాధవీలతపై ఘనవిజయం సాధించారు. -
గెలిచేది మేమే.. ‘హైదరాబాద్’కు న్యాయం చేస్తాం : మాధవీలత
ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చలో నిలిచిన పార్లమెంట్ స్థానం హైదరాబాద్. ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ బలంగా ఉన్న పార్లమెంట్ స్థానం అది. దశాబ్దాలుగా అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రతిసారి అక్కడ ఇతర పార్టీలు నామమాత్రంగా తమ అభ్యర్థులను బరిలో నిలిపేవారు. కానీ ఈ సారి ఈ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత చాలా సీరియస్‌గా ప్రచారం చేసింది. పాతబస్తీలోని హిందూవులనంతా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. బీజేపీ అధిష్టానం కూడా మాధవీలతకు చాలా సపోర్ట్‌గా నిలిచింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆమె గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా అసదుద్దీన్ ఓవైసి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినా.. మాధవీలత మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగరబోతుందని బలంగా చెబుతోంది. ఎన్నికల కౌంటింగ్‌కి కొద్ది గంటల ముందు ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ..‘ఫలితాల కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. బీజేపీ సానుభూతిపరులతో పాటు దేశం మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఫలితంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మేము(బీజేపీ) గెలిచి హైదరాబాద్‌కు న్యాయం చేస్తాం. రెండు పర్యాయాలు గెలిచిన నరేంద్రమోదీ దేశ అభివృద్ధి కోసం ఎంత కృషి చేశారో అందరికి తెలుసు. దేశం మొత్తం మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ సారి హైదారాబాద్‌తో పాటు 400 స్థానాల్లో బీజేపీ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటుంది. అదే జరగబోతుంది’అని మాధవీలత అన్నారు. -
ఇప్పటికి బాణాలు చాలు.. అవసరమైతే త్రిశూలం తీస్తా: మాధవీ లత
దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి మాధవీ లత ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి తరపున దేశ రాజధానిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ నేత మాధవీ లత ఢిల్లీలోని బహిరంగ సభ వేదికపైకి రాగానే అక్కడున్న పార్టీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్, జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనోజ్ తివారీపై పోటీ చేస్తున్న వ్యక్తి పేరు కన్హయ్య అని, అయితే అతని దోపిడీలు చాలా క్రూరమైనవని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడిని ప్రస్తావించిన ఆమె.. వేధించిన వ్యక్తిని రక్షించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రోడ్డుపైకి వచ్చారని ఆరోపించారు. బీహార్ యువత ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మారి దేశానికి సేవ చేస్తుంటారని, అయితే ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఇలాంటి వారిని మోసం చేశారని మాధవీ లత ఆరోపించారు.ఢిల్లీలో నరకయాతన అనుభవిస్తున్న ప్రజల మధ్య, కేజ్రీవాల్ రెండు రోజులు తిరగాలని, అప్పుడే అతనికి ఇక్కడి పరిస్థితులు తెలుస్తాయని ఆమె అన్నారు. బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పనులకు కేజ్రీవాల్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఫలితంగా బురారీ ప్రజలు బురద, చెత్త మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆమె ఆరోపించారు. అయితే ఇలాంటి బురదలో నుంచి వికసించిన కమలాన్నే దేవుని పాదాల చెంత ఉంచుతారన్నారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడేందుకు మద్దతునివ్వాలని ఆమె ఓటర్లను కోరారు.తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శల బాణాలు సంధించిన ఆమె.. ప్రస్తుతానికి ఈ బాణాలు చాలని, అవసరమైతే వారిపై త్రిశూలాన్ని కూడా ప్రయోగించడానికి వెనుకాడనని హెచ్చరించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి మద్దతుగా మాధవీ లత బురారీలోని వెస్ట్ కమల్ విహార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. -
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు. -
బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్ బూత్‌లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.#WATCH | Telangana: BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha visits a polling booth in the constituency. Voting for the fourth phase of #LokSabhaElections2024 is underway. pic.twitter.com/BlsQXRn80C— ANI (@ANI) May 13, 2024 దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్‌పేట్ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. -
పాతబస్తీలో పతంగేనా?
హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో ప్రధాన రాజకీయపక్షాల మేనిఫెస్టోలు, ప్రలోభాలు, అభ్యర్థిత్వం, ప్రచార అంశాలేవీ పనిచేయవు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బలాలు, బలగాల కంటే బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలు ఇక్కడి రాజకీయాలను శాసించి ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ సెగ్మెంట్లో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గానికి చెందినవారే. దీంతో నాలుగున్నర దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ తిరుగులేని విజయాలను సాధిస్తూ వస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు కూడా మొక్కుబడిగా స్నేహపూర్వక పోటీకి పరిమితమవుతాయి. బీజేపీ హిందుత్వ ఎజెండాతో మూడు దశాబ్దాలుగా పాతబస్తీపై పాగావేసేందుకు శక్తియుక్తులు ఒడ్డుతున్నా, రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సివస్తోంది. ఎప్పటి మాదిరిగా ఈసారి కూడా ముస్లిం–హిందుత్వ వాదం మధ్య పోరు నెలకొన్నా.. సామాజిక మాధ్యమాలు ప్రతి చిన్నఅంశాన్ని భూతద్దంలో చూపిస్తుండటంతో హైదరాబాద్ లోక్‌సభపై అందరి దృష్టి పడింది. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి దూకుడు సైతం పాలపొంగే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్హిందూ ఓటర్లను ఆకర్షిస్తూ..దేశంలోనే ముస్లిం సామాజికవర్గ పక్షాన గళంవిప్పే ఆల్ ఇండియా–మజ్లిస్–ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఐదోసారి ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు వార్ వన్‌సైడ్‌గా సాగగా, ఈసారి మాత్రం గట్టిపోటీ నెలకొంది. ప్రచారంలో ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా ‘మా పనితీరు.. మా గుర్తింపు’ అంటూ ఉదయం పాదయాత్రతో డోర్ టూ డోర్ ప్రచారం, సాయంత్రం సభల ద్వారా ఓటర్లను ఆకర్షించే అసదుద్దీన్ ఒవైసీ ఈసారి సామాజిక మాధ్యమాలతోపాటు బ్యానర్లు, కటౌట్లు, వాల్‌పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. హిందూ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తొలిసారిగా నల్లగొండ గద్దర్ గళంతో ‘భగ..భగ మండే నిప్పుల దండై....ఏఐఎంఐఎం పార్టీ జెండా గుండెకు అండై’’వీడియా, ఆడియోలను విడుదల చేశారు.పూజారుల మద్దతు సైతం కూడగట్టుకుంటున్నారు. కమలం దూకుడును కళ్లెం వేసేందుకు ఏకంగా ప్రచార సభల్లో ‘ముస్లింలను టార్గెట్ చేస్తున్న బీజేపీకి ఓటు హక్కుతో జవాబు చెప్పాలని’ప్ర«దానాంశంగా ప్రస్తావిస్తూ పోలింగ్ శాతం పెంపునకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎంబీటీ ఈసారి ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి చేకూరకుండా ఉండేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ మజ్లిస్ పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావంతోనే మజ్లిస్ శకం ప్రారంభమైంది. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్లో తొలిసారిగా 1984లో మజ్లిస్ బోణీ కొట్టింది. అప్పటి నుంచి సుల్తాన్సలావుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికవ్వగా, ఆయన తదనంతరం అసదుద్దీ¯Œ ఒవైసీ ఎన్నికల బరిలోకి దిగి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అనుకూల అంశాలు » అత్యధికంగా ముస్లిం సామాజికవర్గ ఓటర్లు » అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం » బలమైన ముస్లిం సామాజిక ఎజెండా » హిందూ సామాజిక వర్గంలో సైతం గట్టి పట్టు » నాలుగు దశాబ్దాలుగా గట్టి పట్టు, బలమైన కేడర్ » లోక్‌సభ పరిధిలోని ఏడింటిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రాతినిధ్యం » ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలకుండా ఎంబీటీ పోటీ నుంచి వైదొలగడం ప్రతికూల అంశాలు» బీజేపీ అభ్యర్థి మాధవీలతప్రచారంలో దూకుడు » పాతబస్తీ వెనుకబాటుతనం » తక్కువగా నమోదయ్యే పోలింగ్ శాతం మాధవీలత దూకుడు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిత్వం ఖరారుతో రాజకీయ ఆరంగ్రేటం చేసిన కొంపల్లి మాధవీలత బలమైన హిందుత్వ ఎజెండాతో ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. హిందూ భావజాలం పుణికిపుచ్చుకొని సామాజిక, సేవా కార్యక్రమాలకు పరిమితమై బయట పెద్దగా పరిచయం లేని మాధవీలతకు బీజేపీ సీటు దక్కడంతో అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మాధవీలత తన అభ్యర్థిత్వం ఖరారుతోనే తన ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీ¯Œ ఒవైసీపై మాటలతూటాలు పేల్చి జాతీయమీడియా దృష్టిలో పడ్డారు. ఒక నేషనల్ టీవీ చానల్ నిర్వహించిన ‘ఆప్‌కి అదాలత్’కార్యక్రమంలో పాల్గొన్న మాధవీలత మాట్లాడే తీరుకు ప్రధాని మోదీ కితాబు ఇవ్వడంతో దేశ రాజకీయాలను ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. పాతబస్తీలో శ్రీరామనవమి ఊరేగింపులో బాణం ఎక్కుపెట్టి వదిలినట్టు హావభావాలతో బలమైన హిందుత్వవాదాన్ని ప్రదర్శించి ఆ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించారు. సిట్టింగ్ ఎంపీ టార్గెట్‌గా పాతబస్తీ వెనుకబాటు, ఇతరాత్ర అంశాలపై విమర్శనా్రస్తాలు సందిస్తూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూ మజ్లిస్ వ్యతిరేక ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా బీజేపీ పాతబస్తీలో పాగా వేసేందుకు ఎన్నికల్లో హేమాహేమీలను రంగంలోకి దింపి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. బీజేపీ పక్షాన బరిలో దిగిన బద్దం బాల్‌రెడ్డి, ముప్పారపు వెంకయ్యనాయుడు, సుభాష్ చందర్జీలు కొంతమేరకు గట్టి పోటీ ఇచ్చినా, విజయాన్ని అందుకోలేకపోయారు. గత రెండు పర్యాయాలుగా వరుసగా పోటీ చేసిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ బాధ్యుడు భగవంతరావు కూడా రెండో స్థానానికి పరిమితమయ్యారు. అనుకూల అంశాలు » బలమైన హిందుత్వ ఎజెండా » ప్రచారంలో దూకుడు ప్రదర్శించడం » పాతబస్తీలో సామాజిక, సేవా కార్యక్రమాలు » ఆర్థిక బలం, అంగబలం, అధిష్టానం అండదండలు » మజ్లిస్ పార్టీపై వ్యతిరేకత..ముస్లిం ఓట్లు చీలడం » ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ప్రతికూల అంశాలు» మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గం వారు కావడం » ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను కేవలం ఒక సెగ్మెంట్లోనే ప్రాతినిధ్యం » స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు లేక పోవడం, ప్రచారానికి రాకపోవడం » బలమైన పార్టీ కేడర్ లేకపోవడం » స్థానిక పార్టీ శ్రేణుల నుంచి సహాయ నిరాకరణ ఫ్రెండ్లీగానే... కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధులు ఎన్నికల బరిలోదిగినా...మజ్లిస్ ఉన్న దోస్తానాతోఫ్రెండ్లీగానే పోటీ పడుతున్నారు. మజ్లిస్‌తో పదేళ్ల తర్వాత చిగురించిన స్నేçహ్నబంధం దెబ్బతినకుండా ఉండేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీ ఉల్లా ను బరిలో దింపింది. బీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్తోగల మిత్రత్వాన్ని దష్టిలో పెట్టుకొని గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోటీలో పెట్టింది. అధిష్టానాల తీరుతో విజయ అవకాశాలపై కనీస ఆశలు లేక ఇరువురు అభ్యర్దులు సైతం మొక్కుబడిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. లోకసభ నియోజకవర్గం ఏర్పాటు అనంతరం ఆదిలోనే కాంగ్రెస్ పార్టీ విజయపరంపర కొనసాగించినా... మజ్లిస్ శకం ప్రారంభం అనంతరం డిపాజిట్ దక్కడం కష్టంగా తయారైంది. బీఆర్ఎస్ పార్టీ కూడా పాతికేళ్లలో కనీసం డిపాజిట్ దక్కలేదు. మొక్కుబడిగా పోటీ చేస్తూ వస్తోంది. -
400 సీట్లలో బీజేపీ గెలవాలి.. అందులో హైదరాబాద్ ఉండాలి
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లోనూ విజయపథంలో తీసుకువెళ్తున్న నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత గెలుపు కోసం బుధవారం రాత్రి పాతబస్తీలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా 400 సీట్లలో గెలవాలని, అందులో హైదరాబాద్ సీటు తప్పనిసరిగా ఉండాలని ఆకాంక్షించారు. 40 ఏళ్లుగా రజా కార్లు హైదరాబాద్‌ను ఏలుతున్నారనీ, ఈ సారి బీజేపీకి మంచి అవకాశం ఉందని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలుపుతో ఈ రజాకార్ల పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న అమిత్‌షా తాము అందరికీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. హిందువులతో పాటు ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేయా లని పిలుపునిచ్చారు. అప్పుడే హైదరాబాద్ ప్రజలను ఎవ్వరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు. అప్పటికే సమయం రాత్రి పదిగంటలవడంతో అమిత్‌షా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ముందుగా మాధవీలత మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయ, ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆశీస్సులతో ఈసారి తప్పకుండా పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఇక్కడ అణిచివేతకు గురవుతున్న ప్రజలందరిలోని ఆవేశం ఓటు కింద మారాలని పిలుపునిచ్చారు. మహంకాళీ అమ్మవారికి అమిత్ షా పూజలు బుధవారం రాత్రి 9.24 గంటలకు అమిత్‌షా లాల్‌దర్వాజా మహంకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో కలిసి ఐదు నిమిషాల పాటు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివాదం చేస్తూ..విజయ సంకేతం చూపుతూ.. పూజల అనంతరం అమిత్ షా 9.31 గంటలకు ప్రచార ర థం ఎక్కి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ..లాల్ దర్వాజా నుంచి వెంకట్రావ్ స్కూల్, లాల్ దర్వాజ్ మోడ్, సుధా టాకీస్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో కమలనాధులు కదం తొక్కారు. వందేమాతరం...భారత్ మాతాకీ జై..జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా పార్టీ శ్రేణులు అమిత్‌షాపై పూల వర్షం కురిపించారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఆయన ఒక చేత్తో విజయ సంకేతం, మరో చేత్తో కమలం పువ్వును చూపిస్తూ ముందుకు సాగారు. సుమారు 25 నిమిషాల పాటు ఓపెన్‌టాప్ జీప్‌పై నిలబడి రోడ్ షో నిర్వహించారు. యాకుత్‌పుర, చాంద్రా యణగుట్ట, చార్మినార్, బహదుర్‌పుర, మలక్‌పేట్, ఘోషామహల్, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఈ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాజ్‌పేయి తర్వాత.. షానేపాతబస్తీలో బీజేపీ అభ్యర్థుల తరపున గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రచారం చేయగా, ఆ తర్వాత దేశ హోంశాఖామంత్రి హోదాలో అమిత్‌షా ఇక్కడికి రావడం విశేషం. ఎంఐఎంకు కంచుకోటలా ఉన్న పాతబస్తీలో అమిత్‌షా రోడ్ షో నిర్వహించడం ఆ పార్టీ శ్రేణులోŠల్ జోష్ నింపింది. కాగా, అమిత్‌షాకు పలువురు ముస్లింలు మర్ఫా వాయిద్యాలతో ఘన స్వాగతం పలకడం విశేషం. ఇక నిన్న మొన్నటి వరకు ఎడమొఖం.. పెడముఖంగా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంపీ అభ్యర్థి మాధవిలతతో కలిసి ప్రచారం నిర్వహించడం గమనార్హం. -
ఒవైసీ లాపతా.. జబ్సే ఆయీ మాధవీ లతా..
చార్మినార్ (హైదరాబాద్): ఒవైసీ లాపతా.. జబ్ సే ఆయీ మాధవీ లతా.. (మాధవీ లత వచ్చి నప్పటి నుంచి ఒవైసీ కనిపించడం లేదు) అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించా రు. మాధవీ లత హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అనగానే సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. బుధవారం మాధవీ లత చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించి తన నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బీజేపీ నేతలతో కలిసి చార్మినార్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమెతోపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా హైదరాబాద్‌లో అధికారం చెలాయిస్తున్న మజ్లిస్ పార్టీ పాతబస్తీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్‌గాంధీలు ఔరంగజేబు యూనివర్సిటీలో చదివారని.. వారిద్దరి ఆలోచనలు ఒకేతీరుగా ఉంటాయన్నారు. మజ్లిస్‌తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నందునే ఇప్పటివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించ లేదని దుయ్యబట్టారు. పాతబస్తీలో మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్న మజ్లిస్‌కు ఈసారి ఓటమి తప్పదన్నారు. చార్మినార్ నుంచి బయలుదేరిన ప్రచార ర్యాలీ మదీనా, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, మోజంజాహీ మార్కెట్, నాంపల్లి ద్వారా లక్డీకాపూల్ వరకు సాగింది. -
Hyderabad: మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
సైదాబాద్: హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు... మాధవీలత భద్రత, బందోబస్తు బాధ్యతలను ఏఎస్సై ఉమాదేవికి అధికారులు కేటాయించారు. మాధవీలత తన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఐఎస్‌సదన్ డివిజన్లోని సుబ్రమణ్యనగర్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ఉమాదేవిని మాధవీలత పేరు పెట్టి బాగున్నావా? అని పలకరించారు. దీనికి స్పందించిన ఆమె మాధవీలతకు షేక్ ఇవ్వడంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతర్గత విచారణ చేపట్టి ఉమాదేవి చర్య ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని గుర్తించారు. ఈ మేరకు ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ కొత్వాల్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
రజాకార్ మూలాలు చిత్తూ చేసి 40 ఏళ్ల చరిత్ర తిరగరాస్తాము
-
Madhavi Latha: ఆమె నదిని దాటించింది
కింద గాఢంగా పారే చీనాబ్ నది. పైన 359 మీటర్ల ఎత్తులో రైలు బ్రిడ్జి. కశ్మీర్ లోయలో ఉధమ్‌పూర్ నుంచి బారాముల్లా వరకు వేయదలచిన భారీ రైలు మార్గంలో చీనాబ్‌ను దాటడం ఒక సవాలు. దాని కోసం సాగిన ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణంలో మన తెలుగు ఇంజినీర్ మాధవీ లత కృషి కీలకం. ‘వరల్డ్ హైయ్యస్ట్ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణంలో పాల్గొన్న మాధవీ లత పరిచయం. ఒక సుదీర్ఘకల నెరవేరబోతోంది. సుదీర్ఘ నిర్మాణం ఫలవంతం కాబోతూ ఉంది. దేశ అభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో ఎన్ని ఘన నిర్మాణాలు సాగితే అంత ముందుకు పోతాము. అటువంటి ఘన నిర్మాణం జాతికి అందుబాటులో రానుంది. జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేవంతెన ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే ఈ క్లిష్టమైన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజినీర్ కీలకపాత్ర పోషించడం ఘనంగా చెప్పుకోవాల్సిన సంగతి. తెనాలికి చెందిన ప్రొఫెసర్ గాలి మాధవీలతదే ఈ ఘనత. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ భారతీయ రైల్వే 2004లో జమ్ము–కశ్మీర్లో భారీ రైలు ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసింది. జమ్ము సమీపంలోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గంలో రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చీనాబ్ నదిపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు వంతెన అవుతుంది. అయినప్పటికీ మన ఇంజినీర్లు దశల వారీగా నిర్మాణం పూర్తి చేయగలిగారు. జూలైలో దీని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రొఫెసర్‌గా పని చేస్తూ... ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత కాకినాడలో ఇంజినీరింగ్ చేశారు. ఐ.ఐ.టి. మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ‘రాక్ మెకానిక్స్’లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను కొనసాగించారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న మాధవీలత అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా కూడా ఉంటూ సైన్స్ ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ‘రాక్ మెకానిక్స్’లో మాధవీలతకు ఉన్న అనుభవమే ఆమెను చీనాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొనేలా చేసింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి రూ.1400 కోట్లు వ్యయం చేస్తే 300 మంది సివిల్ ఇంజినీర్లు, 1300 మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేశారు. బ్రిడ్జ్‌ను రెండు కొండల మధ్య నిర్మించాల్సి ఉన్నందున ఇంజినీరింగ్ డిజైన్ చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేసిన మాధవీలత, పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆమె విశ్లేషణ, సాంకేతిక సూచనలను దేశంతోపాటు విదేశాల్లోని పలువురు నిపుణులు తనిఖీ చేసి ఆమోదించడంతో వంతెన నిర్మాణం ముందుకు సాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల నిర్మాణంలోనూ మాధవీలత పాల్గొన్నారు. అవకాశం ఇలా... ఉధంపూర్ – బారాముల్లా కొత్త రైలుమార్గంలో చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్ ’ సంస్థకు ఇచ్చింది. ఆఫ్కాన్స్ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా ఉన్న మాధవీలతకు అలా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. ‘ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చీనాబ్ నదిపై రెండు ఎత్తయిన వాలుకొండలను కలుపుతూ సాగిన ఈ వంతెన నిర్మాణంలో వాలు స్థిరత్వం కీలకమైంది. రాక్ మెకానిక్స్ సాంకేతికత, స్థిరత్వ అంశాలను అర్థం చేసుకోవటం, కొండ వాలుల స్థిరత్వాన్ని పొందటానికి నేను పరిష్కారాలను అందించటంతో ఇప్పుడో ఇంజినీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. జోన్ భూకంపాలను, గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను, తీవ్రమైన పేలుళ్లను తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది’ అన్నారు మాధవీలత. ‘నేల పటిష్టతపై ఐ.ఐ.టి మద్రాస్‌లో నా పీహెచ్డీ పరిశోధనల్లో భాగంగా పాలిమర్లను ఉపయోగించి పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించాను. ఆ దిశగా మూడు దశాబ్దాలపాటు చేసిన పరిశోధనల ఫలితంగా నేడు భూకంప నిరోధక శక్తి కలిగిన నిర్మాణాల్లో పాలిమర్‌లని, రబ్బర్ టైర్ల వంటి వ్యర్థపదార్థాలని వినియోగించగలుగుతున్నాం’ అన్నారు. చీనాబ్ వంతెన నిర్మాణానికి రేయింబవళ్లు శ్రమించిన మాధవీలత, ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబ ప్రాధాన్యతలను పక్కనపెట్టి, సైట్‌ను సందర్శించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ‘నా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా వాళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. నా భర్త హరిప్రసాద్‌రెడ్డి, పిల్లలు అభిజ్ఞ, శౌర్యల సహనం, సహకారాలతో ఇది సాధ్యమైంది. చీనాబ్ వంతెన నా సొంత ప్రాజెక్టులా మారిపోయింది’ అన్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు 'ప్రధాని ప్రశంసలు'
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్ని కల్లో హైదరాబాద్ బీజేపీ అభ్య ర్థిగా పోటీ చేస్తున్న మాధవీల తకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తాజాగా ఓ టీవీలో నిర్వహించే ఆప్కీ అదాలత్ కార్యక్రమంలో మాధవీలత పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత రజత్శర్మ ప్రశ్నలకు మాధవీలత ఇచ్చిన సమాధానాలు అసాధరణమైనవని, చాలా దృఢమైన అంశాలు ప్రస్తావించారని, తర్కంతో మాట్లాడారని ప్రధాని ప్రశంసించారు. ఈ కార్య క్రమాన్ని అందరూ వీక్షించాలంటూ ప్రధాని మోదీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మొదలు.. ఒకప్పుడు సంతోష్‌నగర్‌లో తన ఇల్లు వర్షపు నీటిలో మునిగిపోయిన ఘటన వరకు పలు అంశాలను మాధవీలత గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో హైదరాబా ద్లో మత ఘర్షణలు ఎంత భయానక వాతావ రణం సృష్టించేవో తెలిపారు. మత ఘర్షణలకు, రాజకీయ కక్షలకు పెద్దగా తేడాలేదన్నారు. హైదరా బాద్ నగరం లక్షలాది మందికి ఐటీలో ఉపాధి కల్పిస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజల భాగస్వా మ్యం ఒకశాతం కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
మాధవి లతపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎపిసోడ్ చూడండి అంటూ ట్వీట్
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒకప్పటి నుంచి అసదుద్దీన్ ఒవైసీ సొంతం చేసుకున్న హదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని కూడా బీజేపీ హస్తగతం చేసుకోవడానికి 'మాధవి లత'ను రంగంలోకి దింపారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవి లత బలమైన ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆమె క్యాంపెయిన్ బలంగా సాగుతోంది. తాజాగా ఈమె 'ఆప్ కి అదాలత్' అనే షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె వ్యక్తపరిచిన ఆలోచనలనలకు ప్రధాని మోదీ సైత ఫిదా అయ్యారు. మాధవి లతను ప్రశంసిస్తూ మోదీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో.. ''మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీకు నా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ రిపీట్ టెలికాస్ట్‌ను చూడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను'' అంటూ ట్వీట్ చేశారు. Madhavi Latha Ji, your ‘Aap Ki Adalat’ episode is exceptional. You’ve made very solid points and also done so with logic and passion. My best wishes to you. I also urge everyone to watch the repeat telecast of this programme at 10 AM or 10 PM today. You all will find it very… — Narendra Modi (@narendramodi) April 7, 2024 ఎవరీ మాధవి లత? కొంపెల్ల మాధవి లత హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన 'విరించి'కి చైర్మన్. అంతే కాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకుని, నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ.. ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవి లత.. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె NCC క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ఇకపొతే బీజేపీ, హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందటానికి నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రం అయితే రాబోయే ఎన్నికల్లో ఎమ్ఐఎమ్, ఒవైసీల అధిపత్యానికి చెక్ పెట్టనుందా.. లేదా?, లేక మళ్ళీ ఒవైసీల పార్టీ గెలుపొందుతుందా.. అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా ఉంది. ఈ ప్రశ్నకు రాబోయే రోజుల్లో జవాబు దొరుకుతుంది.