విజయ్ 60వ చిత్రానికి దర్శకుడి ఖరారు | Vijay's 60th film director finalized | Sakshi
Sakshi News home page

విజయ్ 60వ చిత్రానికి దర్శకుడి ఖరారు

Published Fri, Nov 20 2015 2:14 AM | Last Updated on Sun, Jul 14 2019 4:41 PM

విజయ్ 60వ చిత్రానికి దర్శకుడి ఖరారు - Sakshi

విజయ్ 60వ చిత్రానికి దర్శకుడి ఖరారు

తమిళసినిమా : ఇళయదళపతి విజయ్ 59వ చిత్రాన్ని చేస్తున్నారు. దీనికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీలు సమంత, ఎమీజాక్సన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.ధాను నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఇంతకు ముందు కాక్కీ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నా తాజాగా తారుమారు అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. విజయ్ తదుపరి చిత్రం ఏమిటి? దర్శకుడెవరు అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది. విజయ్ 60వ చిత్రం కావడంతో దీనికి దర్శకుడెవరన్న విషయంలోనూ పలువురి పేర్లు ప్రచారంలో ఉండటమే ఆసక్తి నెలకొనడానికి కారణం. దర్శకులు మోహన్‌రాజా, కార్తీక్ సుబ్బరాజ్, ఎస్‌జే.సూర్య, భరతన్, హరి విజయ్ కోసం కథలు తయారు చేసినట్లు తెలిసింది.
 
 చివరిగా తెలిసిందేమిటంటే వారిలో భరతన్ సిద్ధం చేసిన కథ ఇళయదళపతికి బాగా నచ్చిందని. దీంతో విజయ్ 60వ చిత్రానికి భరతన్ దర్శకత్వం వహించనున్నారన్నది తాజా సమాచారం. విషయం ఏమిటంటే విజయ్ భరతన్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు అళగీయ తమిళ్‌మగన్ అనే చిత్రం రూపొందింది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రంలో శ్రీయ, నమిత నాయికలుగా నటించారు. ఈ తాజా చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ వారంలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు మొదలెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో షూటింగ్‌కు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement