తెరి సీక్వెల్ కథ రెడీ | Theri 2: Vijay's film to have a sequel? | Sakshi
Sakshi News home page

తెరి సీక్వెల్ కథ రెడీ

Published Thu, Apr 14 2016 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

తెరి సీక్వెల్ కథ రెడీ

తెరి సీక్వెల్ కథ రెడీ

తెరి చిత్రం రెండో భాగానికి కథ రెడీ అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు అట్లీ. ఇళయదళపతి విజయ్ నటించిన 59వ చిత్రం తెరి. సమంత,ఎమీజాక్సన్ కథానాయికలుగా నటించిన ఆ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ మహిళల రక్షణ, చిన్నారులను బిచ్చకారుల్ని చేస్తున్న అంశాల ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం తెరి అని తెలిపారు. ఇందులో విజయ్ పోలీసు అధికారిగా ఒక పాత్రను పోషించారన్నారు.

దానితో పాటు ఇంకొన్ని పాత్రల్లో ఆయన్ని చూస్తారని, అయితే అ వి ఏమిటన్నది చిత్రం చూస్తే తెలుస్తుందని అన్నా రు. ఒక కుటుంబంలో అన్నయ్యగానీ తమ్ముడుగా నీ పోలీసు అధికారిగా ఉంటే వారు ఎలా భావి స్తారు, ఆ పోలీసు అధికారి ఇతరులను అ న్నయ్యలానో, తమ్ముడిలానో భావి స్తే ఆ భావన ఎలా ఉంటుందన్నది తెరి చిత్రం అన్నా రు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా నీట్‌గా కథకు ఎంత వరకు అవసరమో అంతే ఉంటాయన్నారు. అయితే ఆ యా క్షన్ సన్నివేశాల్లో విజయ్ చాలా రిస్క్ తీసుకుని న టించడం విశేషం అని పేర్కొన్నారు.

తెరి చిత్రంలో ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ అడగ్గానే అంగీకరించి నటించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. చిత్రంలోని మాటలను బాగున్నాయ ని మెచ్చుకుని తన చిత్రానికి సంభాషణలు రాయమని కోరారని, అది జరిగినా, లేకపోయినా ఆయ న ప్రశంసలను మర్చిపోలేనని అన్నారు. ఈ విషయంలో తనకు శంకర్ తరువాత మణిరత్నం, కే. భాగ్యరాజ్, హిందీ దర్శకుడు రాజ్‌కుమార్ హీర్వాణి గురువులని పేర్కొన్నారు. ఇక తెరి చిత్రంలో సమంత, ఎమీజాక్సన్ ఇద్దరు చాలా బాగా నటించారని చెప్పారు.

వీరితో పాటు నటి మీనా కూరుతు నైనిక కీలక పాత్రను పోషిం చిందని చెప్పారు. ఇందులో విజయ్ కూతురు ది వ్య కూడా నటించిందని, ఆయన కొడుకు సంజ య్ నటించారా? అని అడుగుతున్నారని అది మా త్రం సస్పెన్స్ అని అన్నారు. అదే విధంగా తెరి చి త్రానికి సీక్వెల్ ఉంటుందా? అని అడుగుతున్నారనీ అందుకు కథ సిద్ధంగా ఉందనీ అన్నారు. అయితే తెరి చిత్రానికి ప్రేక్షకాదరణను బట్టి సీక్వెల్ చేయా లా? వద్దా అన్న నిర్ణయం ఉంటుందని తెలిపారు. తన తదుపరి చిత్రం గురించి అడుగుతున్నారని ప్ర స్తుతం తెరి చిత్ర సక్సెస్‌ను ఆస్వాదించాలని, అలాగే ఇటీవలే పెళ్లి చేసుకున్న తాను ఇంత వరకూ భార్యతో బయట ప్రపంచం చూడలేదన్నారు.

ఈ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేయాలని అన్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌తో చిత్రం చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి అడగ్గా అ వన్నీ చర్చల్లో ఉన్నాయని బదులి చ్చారు. తెరి చిత్రంలో నటించడం మంచి అనుభవం అని చిత్ర విడుద ల కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాననీ నటి ఎమీజాక్సన్ అన్నారు. హీరోయిన్ అయితే సంతోషమే తెరి చిత్రంలో కీలక పాత్ర ద్వారా బాల నటిగా పరిచయం అవుతున్న నటి మీనా కూతురు నైనిక అం దరికి థ్యాంక్స్ అంటూ ముచ్చటగా చెప్పింది.

మీనా మాట్లాడుతూ తెరి చిత్రం ద్వారా తన కూతురు బాల నటిగా పరిచయం అవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో నైనిక హీరోయిన్ అవుతుందా? అన్న ప్రశ్నకు అది ఇప్పుడు చెప్పలేనని, అలా కథానాయకి అయితే తనకు సంతోషమేనపి మీనా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement