Sequel Story
-
ఇండియన్ ఇండస్ట్రీకి పాఠాలు నేర్పుతున్న టాలీవుడ్...
-
సైంధవ్ మూవీ టీజర్
-
గుడ్ న్యూస్.. త్వరలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' 9వ సీజన్ !
గేమ్ ఆఫ్ థ్రోన్స్.. వరల్డ్‌వైడ్‌గా అత్యధిక పాపులారిటీ పొందిన టీవీ షో. ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ షోకు అభిమానులు అనేకం. ఇందులోని నటినటుల యాక్టింగ్, పోరాట ఘట్టాలు, ఎమోషన్స్, రిలేషన్స్, విజువల్స్, డ్రాగెన్స్, వైట్ వాకర్స్ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అద్భుతమే. హెచ్‌బీవో నిర్మించిన ఈ టీవీ షో 8 సీజన్లతో ముగించడంతో అభిమానులందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. అందులోను సూపర్బ్‌గా అలరించిన 7 సీజన్లతో పోల్చుకుంటే 8వ సీజన్ ఫ్యాన్స్‌ను అసంతృప్తికి గురిచేసింది. దీంతో చాలా మంది హర్ట్ అయి.. తమకు సీక్వెల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్‌కు హెచ్‌బీవో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. డేనెరియస్ టార్గారియస్ (ఎమిలీ క్లార్క్)ను హీరో జాన్ స్నో (కిట్ హరింగ్టన్) హత్య చేసిన తర్వాత వెస్టెరోస్ను వదిలి నార్త్ ఆఫ్ ది వాల్‌కు ప్రయాణంచడంతో 8వ సీజన్ ముగుస్తుంది. ఈ ముగింపు ప్రేక్షకులకు ఎవరికీ అంతగా రుచించలేదు. దీంతో తన అసలు పేరు ఏగాన్ చటార్గారియస్ అని తెలుసుకున్న జాన్ స్నో పాత్రతో సీక్వెల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సిరీస్‌కు కొనసాగింపుగా కిట్ హరింగ్టన్ను హెచ్‌బీవో సంస్థ సంపద్రించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై హెచ్‌బీవో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు ఇదంతా నిజమై వచ్చే 9వ సీజన్లో డేనెరియస్ టార్గారియస్/మదర్ ఆఫ్ డ్రాగెన్ ప్రాణాలతో తిరిగి వస్తుందా? లేదా చూడాలి. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌కు ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ డ్రాగెన్ తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో టార్గారియన్లోని అంతర్యుద్ధం చుట్టూ కథ ఉంటుందట. సుమారు 200 ఏళ్ల కిందట సింహాసనం కోసం జరిగిన యుద్ధాలను, వైట్ వాకర్స్ ఆవిర్భావం తదితర అంశాలకను చూపించే అవకాశం ఉందని సమాచారం. -
తెరి సీక్వెల్ కథ రెడీ
తెరి చిత్రం రెండో భాగానికి కథ రెడీ అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు అట్లీ. ఇళయదళపతి విజయ్ నటించిన 59వ చిత్రం తెరి. సమంత,ఎమీజాక్సన్ కథానాయికలుగా నటించిన ఆ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ మహిళల రక్షణ, చిన్నారులను బిచ్చకారుల్ని చేస్తున్న అంశాల ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం తెరి అని తెలిపారు. ఇందులో విజయ్ పోలీసు అధికారిగా ఒక పాత్రను పోషించారన్నారు. దానితో పాటు ఇంకొన్ని పాత్రల్లో ఆయన్ని చూస్తారని, అయితే అ వి ఏమిటన్నది చిత్రం చూస్తే తెలుస్తుందని అన్నా రు. ఒక కుటుంబంలో అన్నయ్యగానీ తమ్ముడుగా నీ పోలీసు అధికారిగా ఉంటే వారు ఎలా భావి స్తారు, ఆ పోలీసు అధికారి ఇతరులను అ న్నయ్యలానో, తమ్ముడిలానో భావి స్తే ఆ భావన ఎలా ఉంటుందన్నది తెరి చిత్రం అన్నా రు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా నీట్‌గా కథకు ఎంత వరకు అవసరమో అంతే ఉంటాయన్నారు. అయితే ఆ యా క్షన్ సన్నివేశాల్లో విజయ్ చాలా రిస్క్ తీసుకుని న టించడం విశేషం అని పేర్కొన్నారు. తెరి చిత్రంలో ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ అడగ్గానే అంగీకరించి నటించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. చిత్రంలోని మాటలను బాగున్నాయ ని మెచ్చుకుని తన చిత్రానికి సంభాషణలు రాయమని కోరారని, అది జరిగినా, లేకపోయినా ఆయ న ప్రశంసలను మర్చిపోలేనని అన్నారు. ఈ విషయంలో తనకు శంకర్ తరువాత మణిరత్నం, కే. భాగ్యరాజ్, హిందీ దర్శకుడు రాజ్‌కుమార్ హీర్వాణి గురువులని పేర్కొన్నారు. ఇక తెరి చిత్రంలో సమంత, ఎమీజాక్సన్ ఇద్దరు చాలా బాగా నటించారని చెప్పారు. వీరితో పాటు నటి మీనా కూరుతు నైనిక కీలక పాత్రను పోషిం చిందని చెప్పారు. ఇందులో విజయ్ కూతురు ది వ్య కూడా నటించిందని, ఆయన కొడుకు సంజ య్ నటించారా? అని అడుగుతున్నారని అది మా త్రం సస్పెన్స్ అని అన్నారు. అదే విధంగా తెరి చి త్రానికి సీక్వెల్ ఉంటుందా? అని అడుగుతున్నారనీ అందుకు కథ సిద్ధంగా ఉందనీ అన్నారు. అయితే తెరి చిత్రానికి ప్రేక్షకాదరణను బట్టి సీక్వెల్ చేయా లా? వద్దా అన్న నిర్ణయం ఉంటుందని తెలిపారు. తన తదుపరి చిత్రం గురించి అడుగుతున్నారని ప్ర స్తుతం తెరి చిత్ర సక్సెస్‌ను ఆస్వాదించాలని, అలాగే ఇటీవలే పెళ్లి చేసుకున్న తాను ఇంత వరకూ భార్యతో బయట ప్రపంచం చూడలేదన్నారు. ఈ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేయాలని అన్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌తో చిత్రం చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి అడగ్గా అ వన్నీ చర్చల్లో ఉన్నాయని బదులి చ్చారు. తెరి చిత్రంలో నటించడం మంచి అనుభవం అని చిత్ర విడుద ల కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాననీ నటి ఎమీజాక్సన్ అన్నారు. హీరోయిన్ అయితే సంతోషమే తెరి చిత్రంలో కీలక పాత్ర ద్వారా బాల నటిగా పరిచయం అవుతున్న నటి మీనా కూతురు నైనిక అం దరికి థ్యాంక్స్ అంటూ ముచ్చటగా చెప్పింది. మీనా మాట్లాడుతూ తెరి చిత్రం ద్వారా తన కూతురు బాల నటిగా పరిచయం అవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో నైనిక హీరోయిన్ అవుతుందా? అన్న ప్రశ్నకు అది ఇప్పుడు చెప్పలేనని, అలా కథానాయకి అయితే తనకు సంతోషమేనపి మీనా అన్నారు. -
సాంబార్‌మాశ్చర్యాల సీక్వెల్!
హ్యూమర్ సంబరానికి మరో మాట సాంబార్. దాన్ని రుచి చూసినప్పుడల్లా అందరూ సంభ్రమానికి గురయ్యేవాళ్లట. అలా సాంబారనే పేరు వచ్చింది. మా రాంబాబుగాడు సందు చివర నుంచి వస్తూ కనిపించడం చూసి తప్పించుకు పోదామనే ప్రయత్నంలోనే వాడికి పట్టుబడిపోయాను. ‘‘ఏంట్రా చూసి కూడా చూడనట్లు వెళ్లిపోతున్నావు’’ అడిగాడు నిష్టూరంగా. ‘‘మొన్నంతా ఇడ్లీ గురించి మాట్లా డావు కదా. మళ్లీ ఇప్పుడు సాంబార్ గురించి సీక్వెల్ స్టోరీ ఏదైనా చెబుతావని భయమేసి...’’ అంటూ ఏదో నసుగు తుండగానే మధ్యలో తుంచేశాడు. ‘‘సాంబార్ గొప్ప గురించి వేరే చెప్పే దేముందిరా. సంబరానికి మరో మాట సాంబార్. దాన్ని రుచి చూసినప్పుడల్లా అందరూ సంభ్రమానికి గురయ్యేవాళ్లట. అలా సాంబారనే పేరు వచ్చింది. నాకు మొన్న చేతి ఎముక విరిగితే ప్లేట్లు వేస్తా నన్నారు కదా డాక్టర్లు! ఇడ్లీ, అన్నం తినే టైమ్‌లో దాంట్లోనూ ఎక్స్ట్రా సాంబార్ పోయించుకోవచ్చుకదా అని ఆశపడ్డాను. కానీ ఆ ప్లేట్స్ ఒంటి లోపల ఉంటాయట. సాంబార్ పోసుకోడానికి వీలు కాదని డాక్టర్ చెప్తే కాస్త డిజప్పాయింటయ్యా.’’ ‘‘నువ్వు మరీ టూమచ్రా’’ అన్నాను నవ్వాలో ఏడవాలో అర్థం కాక. ‘‘ఇందులో టూమచ్ ఏముంది! మొదట్లో దాన్ని అందరూ ‘చాంపార్’ అని పిలిచేవారట. వంటింట్లోంచి చాంపార్ వాసన వస్తుంటే, అప్పటి వరకూ పరుషంగా ఉన్నవాళ్లు కూడా సరళంగా మారిపోయేవారట. దీన్ని గుర్తించిన తమిళ సోదరులు సాంబార్ అని పిలవడం మొదలు పెట్టారట.’’ ‘‘నువ్వు కనిపించగానే అనుకున్నా నేను సూప్‌లో పడిపోయానని’’ అన్నాను బిక్కమొగమేసి. ‘‘నువ్వు చెప్పే ‘సూప్’ కూడా మన సంస్కృత పదమైన సూపమ్ నుంచి వచ్చింది. ‘భోజనం దేహి రాజేంద్రా... ఘృత సూప సమన్వితం’ అంటూ భోజ రాజు దగ్గర భోజనంతో పాటు పప్పును అడిగి తీసుకునేవారట పండితులు. మన సూప మహత్యాన్ని కనిపెట్టిన మ్లేచ్ఛులు మన పప్పుచారు ఫార్ములాను దొంగి లించి, దాన్ని కాస్త మార్చి సూప్ అని పేరు పెట్టుకున్నారు తెలుసా? అన్నట్టు సాంబార్ కుతకుత ఉడికినట్లుగానే పౌరు లందరిలోనూ నెత్తురు మండించి, శక్తులు నిండేలా చేయాలనే సోషలిస్టు భావనతోనే పప్పుచారు తయారు చేశారు.’’ ‘‘పప్పుచారుకూ సోషలిస్టు భావాలకూ సంబంధమేముందిరా?’’ ‘‘ఇప్పుడున్న ప్రభుత్వాల అసమర్థత వల్ల పప్పుల ధర భవిష్యత్తులో బాగా పెరుగుతుందని బ్రహ్మంగారు కాల జ్ఞానంలో ఎప్పుడో చెప్పేశారు. దాంతో పప్పును అందరికీ అందుబాటులోకి తేవా లనే సోషలిస్టు భావనతో పప్పుచారును కనిపెట్టారు మనవాళ్లు. అలా పప్పుకు అడ్వాన్స్డ్ రూపమైన మన సాంబారు ఆవిర్భవించింది.’’ ‘‘పప్పుకు అడ్వాన్స్డ్ రూపమా సాంబారు!?’’ అయోమయంగా అడిగా. ‘‘కాదా మరి. కర్రీ పాయింట్లలో కాస్త ఆలస్యంగా పప్పు కోసం అడిగావనుకో. దొరకదు. కానీ సాంబారు మాత్రం లేటైనా దొరుకుతుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్‌లో పప్పుకంటే సాంబారు ఎక్కువ ఫిట్టెస్టు అని తెలిసిపోయింది కదా? పరిణామ క్రమంలో పప్పు తర్వాత వచ్చినా సాంబారు సర్వైవల్ విషయంలో మరింత సమర్థమైనదని తేలిపోయింది. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్న సూక్తిని గుర్తుం చుకున్నారు డార్విన్. అందుకే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్టు అన్న విషయాన్ని తన కిచెన్లోనే ముందుగా కనిపెట్టినా... ఆరిజిన్ ఆఫ్ పప్పూస్ అండ్ పల్సెస్ నుంచే ‘ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్’ అన్న విషయాన్ని ఆ తర్వాత విశ్వవ్యాప్తం చేశాడట’’ అన్నాడు. ‘‘కొయ్... కొయ్’’ అన్నాను. ‘‘పప్పును కొయ్యడం కుదరదు. పప్పు గింజను ఎంతసేపు చప్పరించినా దాని చవి తెలియదు. అదే పంటి కింద నలగ్గొట్టావనుకో, దాని టేస్టు పెరుగుతుంది. రుచి తెలుస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న మన పూర్వీ కులు పప్పును నలగ్గొట్టడానికి పప్పుగుత్తిని కనిపెట్టారు. అలా పప్పు నుంచి పప్పుచారును ఆవిర్భవింప జేశారు. ఆ తర్వాత డార్విను, ఇతర పాశ్చాత్యులు ఆ పరిజ్ఞానాన్ని పరిగ్రహించి మరింత పరిపక్వం చేశారంతే’’ అన్నాడు పక్వం అనే మాటను ఒత్తిపలుకుతూ. ‘‘నా పప్పులు ఉడికాయ్. ఇక నన్ను విడిచిపెట్టు’’ అంటూ ఇల్లు చేరీ చేరగానే తలుపులు బార్లా తెరచి, సాంబార్లా జారిపోయాను. - యాసీన్