ఇళయదళపతి 60వ చిత్రం భైరవా! | Bairavaa: First look of Ilayathalapathy Vijay's 60th film out! | Sakshi
Sakshi News home page

ఇళయదళపతి 60వ చిత్రం భైరవా!

Published Mon, Sep 5 2016 12:58 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

ఇళయదళపతి 60వ చిత్రం భైరవా! - Sakshi

ఇళయదళపతి 60వ చిత్రం భైరవా!

ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ఏమిటన్నది ఇటు పరిశ్రమలోనూ అటు ఆయన అభిమానుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. 59 చిత్రాలను పూర్తి చేసిన విజయ్ 60వ చిత్రం ఇది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై దివంగత ప్రఖ్యాత నిర్మాత బి.నాగిరెడ్డి ఆశీస్సులతో బి.వెంకటరాఘవరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
 
 ఇంతకు ముందు విజయ్‌తో అళగీయతమిళ్‌మగన్ చిత్రాన్ని తెరకెక్కించిన భరతన్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికి 70 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ చాలా గ్యాప్ తరువాత ద్విపాత్రాభినం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించకపోవడంతో రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
 
 దీంతో చిత్ర చిత్ర వర్గాలు వినాయకచవితి నాడు చిత్రం పేరును వెల్లడించనున్నట్లు ప్రకటించారు. అయితే ఒక్క రోజు ముందే చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్, విడుదల తేదీ లీక్ అయ్యి చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. విజయ్ జమిందారుల నాటి కోటు దుస్తులు ధరించి రిక్షాలో నిలబడిన ఫొటోతో కూడిన ఫస్ట్‌లుక్ మాత్రం ఆయన అభిమానుల్ని అలరిస్తోంది. ఇంతకూ ఈ చిత్రం పేరు ఏమిటన్నది చెప్పనేలేదు కదూ భైరవా. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండగ సందర్భంగా జనవరిలో విడుదల చేయనున్నట్లు ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement