విజయ్‌తో రొమాన్స్‌కు కీర్తీ రెడీ | Keerthy Suresh To Romance Ilayathalapathy in 'Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌తో రొమాన్స్‌కు కీర్తీ రెడీ

Published Sun, Jul 10 2016 4:17 AM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

విజయ్‌తో రొమాన్స్‌కు కీర్తీ రెడీ - Sakshi

విజయ్‌తో రొమాన్స్‌కు కీర్తీ రెడీ

కాలేజ్ కుర్రాడిలా నటి కీర్తీసురేశ్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారట ఇళయదళపతి విజయ్. ఈయన నటిస్తున్న తాజా చిత్రాన్ని ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయాప్రొడక్షన్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ 60వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరతన్ దర్శకుడు. ఇందులో విజయ్ ద్విపాత్రాభియనం చేస్తున్నారు. ఇంతకు ముందు ఇదే దర్శకుడి చిత్రం అళగీయ తమిళ్ మగన్ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారన్నది గమనార్హం. తాజా చిత్రం ఇంతకు ముందు ఎమ్జీఆర్ నటించిన ఎంగవీటి పిళ్లై చిత్రాన్ని మోడరేట్ చేసి రీమేక్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

ఇటీవల హైదరాబాద్‌లో చిత్రం షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ పేరు నిర్ణయించని చిత్రం తదుపరి షూటింగ్‌కు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ విజయ్ నటించే ఒక పాత్ర సన్నివేశాలనే చిత్రీకరించిన చిత్ర యూనిట్ ఇప్పుడు రెండో పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనుందట. ఈ పాత్రలో విజయ్ కళాశాల విద్యార్థిగా కనిపించనున్నారని తెలిసింది.

ఈ పాత్ర కోసం తన శారీరక భాషను పూర్తిగా మార్చనున్నారట. అంతే కాదు 10 కిలోల బరువును తగ్గి చాలా యంగ్‌గా కొత్త గెటప్‌కు సిద్ధమవుతున్నారట. ఇంతకు ముందు తన చిత్రాల్లో గెటప్ కోసం పెద్దమార్పులు చేయని విజయ్ తాజా చిత్రం కోసం చాలా శ్రద్ధతీసుకుని నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్రలో నటి కీర్తీసురేశ్‌తో రొమాన్స్ చేసే సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు చిత్ర వర్గాలు. ఇందులో టాలీవుడ్ స్టార్ నటుడు జగపతిబాబు, సతీష్, డేనియల్ బాలాజీ, సుదన్సు పాండే  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement