మరోసారి లాఠీ పట్టనున్న విజయ్ | Ilayathalapathy Turns Police Officer | Sakshi
Sakshi News home page

మరోసారి లాఠీ పట్టనున్న విజయ్

Published Fri, May 29 2015 3:54 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

మరోసారి లాఠీ పట్టనున్న విజయ్ - Sakshi

మరోసారి లాఠీ పట్టనున్న విజయ్

ఇళయ దళపతి విజయ్ మరోసారి లాఠీ చేత పట్టనున్నారు. ఇంతకుముందు ఆయన పోకిరి, జిల్లా చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించారు. ఆ రెండు చిత్రాలు విజయం సాధించాయి. ముచ్చటగా మూడవసారి ఖాకీ దుస్తులు ధరించనున్నారు. విజయ్ ప్రస్తుతం పులి చిత్రంలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అతిలోకసుందరి శ్రీదేవి మహారాణిగా నటిస్తున్నారు. జానపదం మిళితమైన సాంఘిక చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. దీంతో విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. కలైపులి ఎస్.థామను నిర్మించనున్న ఈ భారీ చిత్రంలో నటి సమంత హీరోయిన్‌గా నటించనున్నారు.

రాజారాణి చిత్రం ఫేమ్ అట్లి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో విజయ్ పోలీసు అధికారిగా నటించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. పోకిరి, జిల్లా చిత్రాల్లో విజయ్ పోలీసు అధికారిగా నటించిన సన్నివేశాలు తక్కువే. అయితే అట్లి దర్శకత్వం వహించనున్న చిత్రంలో పూర్తిగా పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే లవ్, రొమాంటిక్ సన్నివేశాలు ప్రాముఖ్యత ఉంటుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement