‘రాఘవేంద్రరావు నుంచి ప్రాణ హాని ఉంది’ | our son is innocent, says ravindra parents | Sakshi
Sakshi News home page

‘రాఘవేంద్రరావు నుంచి ప్రాణ హాని ఉంది’

Published Mon, Jun 13 2016 10:33 PM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

‘రాఘవేంద్రరావు నుంచి ప్రాణ హాని ఉంది’ - Sakshi

‘రాఘవేంద్రరావు నుంచి ప్రాణ హాని ఉంది’

నల్లమాడ: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి తమ కుమారుడికి ప్రాణహాని ఉందని అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎద్దులవాండ్లపల్లికి చెందిన రవీంద్ర తల్లిదండ్రులు వలపి అంజనమ్మ, వెంకటప్ప ఆరోపించారు. సోమవారం వారు 'సాక్షి'తో తమ గోడు వెల్లబోసుకున్నారు. 'మా కుమారుడు బీఈడీ పూర్తి చేశాడు. సినిమాలపై వ్యామోహంతో 2009లో శ్రీరామదాసు కథను రాసి దర్శకుడు రాఘవేంద్రరావుకు అందజేశాడు. ఆ కథను మెచ్చుకున్న ఆయన రూ.15 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నారు. అయితే చెప్పినట్టుగా డబ్బులు ఇవ్వకుండా మా కొడుకును హైదరాబాద్ చుట్టూ తిప్పుకుంటూ కాలం గడిపారు. ఈ నెల 9న హైదరాబాద్‌ కు రమ్మని పిలిపించి డబ్బు ఇవ్వకపోవడంతో సహనం నశించి రవీంద్ర వారిపై దాడి చేశాడేమో! మా వాడు అమాయకుడు. వాడికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం' అని తల్లిదండ్రులు వేడుకున్నారు.

సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావుపై వలపి రవీంద్ర(28) గత గురువారం దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఫిలింనగర్ సైట్-2లో నివసించే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట్లో రవీంద్ర బీభత్సం సృష్టించాడు. ఆయన ఇంట్లో ఉన్న ఆడి కారు, బెంజి కారు, పక్కనే సాంత్రో కార్లను ధ్వంసం చేశాడు. ఇంటి అద్దాలు పగలగొట్టాడు. అడ్డువచ్చిన వాచ్‌మెన్‌పై దాడి చేశాడు. దీంతో రవీంద్రను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై ఐపీసీ సెక్షన్ 452, 427కింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.


దీంతో కారు అద్దాలు దించిన రాఘవేంద్రరావు 'ఎవరు నువ్వు.. ప్రాబ్లం ఏంటి' అంటూ ప్రశ్నించాడు. 2006లో తెరకెక్కించిన 'శ్రీరామదాసు' సినిమా కథ తనదేనని, ఆ కథను 2003లోనే రూపొందించి మీకు పంపించానని,  అయితే సినిమాలో మాత్రం కథ రచయితగా తన పేరు పెట్టకుండా మోసంచేశారంటూ రాఘవేంద్రరావును నిలదీశాడు రవీంద్ర. ఆ సినిమా కథ జేజే భారవిదని నీది కాదని రాఘవేంద్రరావు చెప్తుండగానే రవీంద్ర ఆయనను దూషిస్తూ సినిమా కథ తనదైతే ఆయన పేరు ఎలా పెడతావని ప్రశ్నించారు. ఈ విషయంలో తనకు తీవ్ర అన్యాయం చేశావని ఆరోపిస్తుండగానే రాఘవేంద్రరావు కారులో వెళ్లిపోయారు.

2006లో తెరకెక్కించిన 'శ్రీరామదాసు' సినిమా కథ తనదేనని, ఆ కథను 2003లోనే రూపొందించి రాఘవేంద్రరావుకు పంపించానని, అయితే సినిమాలో మాత్రం కథ రచయితగా తన పేరు పెట్టకుండా ఆయన మోసంచేశారంటూ  రవీంద్ర ఈ దాడికి పాల్పడ్డాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement