రాష్ట్ర ఫ్యాక్టరీల శాఖ డైరెక్టర్ కిషన్
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు పెంపొందించేందుకు ప్రభుత్వం బాగా కృషి చేస్తోందని రాష్ట్ర ఫ్యాక్టరీల శాఖ డైరెక్టర్ సీహెచ్ కిషన్ అన్నారు. రాష్ట్ర ఫ్యాక్టరీల శాఖ, జాతీయ భద్రతా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘భారీ ఔషధ తయారీ పరిశ్రమల్లో అభివృద్ధి చెందుతున్న సుస్థిర భద్రతా నిర్వహణ’ అనే అంశంపై వర్క్‌షాప్ గురువారం ప్రారంభమైంది. ఇందులో కిషన్ కీలకోపన్యాసం చేస్తూ భద్రతా చర్యలు పెంచడంలో పలు పరిశ్రమల యాజమా న్యాలు, కార్మికులు భాగస్వాములవడం శుభ పరిణామ మని అన్నారు.
రెండు రోజులపాటు జరగనున్న ఈ వర్క్‌షాప్‌ను సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ జాస్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల్లో భద్రతపై స్పృహ కలిగించడం, వారిని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫ్యాక్టరీల శాఖ జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ పీఎం చంద్రమోహన్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ బి.రాజగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు వర్క్‌షాప్‌లో భద్రతా నిర్వహణ, రిస్క్ మేనేజ్‌మెంట్, రసాయనాల నిర్వహణ, వృత్తిపరమైన ప్రమాదాలు తదితర అంశాలపై చర్చించారు.
పరిశ్రమల్లో భద్రతా చర్యల పెంపునకు కృషి
Published Fri, Jun 9 2017 12:39 AM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM
Advertisement