‘నవ’ తరం తారలతో... | New stars move plan with Director N Shankar | Sakshi
Sakshi News home page

‘నవ’ తరం తారలతో...

Published Tue, Apr 26 2016 10:55 PM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

‘నవ’ తరం తారలతో... - Sakshi

‘నవ’ తరం తారలతో...

‘ఎన్‌కౌంటర్’, ‘శ్రీరాములయ్య’, ‘జయం మనదేరా’, ‘భద్రాచలం’, ‘యమజాతకుడు’, ‘ఆయుధం’, ‘రామ్’, ‘జై బోలో తెలంగాణ’ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు ఎన్. శంకర్. ఇప్పటివరకూ తెలుగులో ఎనిమిది సినిమాలు డెరైక్ట్ చేసిన ఎన్.శంకర్ తన నవమ చిత్రాన్ని అంతా నవ తారలతో చేయడానికి సిద్ధమయ్యారు. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది.

 ఇందులో హీరో, హీరోయిన్‌తో పాటు, ఎనభై శాతం పాత్రలకు 18 నుంచి 25 సంవత్సరాలలోపు వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర పాత్రలకు 5 నుంచి ఎనభై ఏళ్ల వయస్సు ఉన్నవారికి కూడా అవకాశం ఉంటుందన్నారు. నటనపై ఆసక్తి ఉన్నవారు mahalakshmiarts@gmail.com ఈ-మెయిల్ ఐడీకి తమ ఫొటోలు, పోర్ట్‌ఫోలియోలు మే 31లోగా పంపించాలని కోరారు. ఎంపికైన వారికి నటనలో వర్క్‌షాప్ నిర్వహించి అవకాశం ఇస్తామని ఎన్.శంకర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement