20న తెరి గీతావిష్కరణ | Audio Of Vijay's 'Theri' To Be Launched On March 20 | Sakshi
Sakshi News home page

20న తెరి గీతావిష్కరణ

Published Tue, Mar 15 2016 5:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

20న తెరి గీతావిష్కరణ

20న తెరి గీతావిష్కరణ

తెరి చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం ఈ నెల 20న జరగనుందన్నది తాజా సమాచారం. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం తెరి. ఇది ఆయన 59వ చిత్రం. విజయ్‌కు జంటగా అందాల భామలు సమంత, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. ప్రభు, రాధిక శరత్‌కుమార్, దర్శకుడు మహేంద్రన్, ముట్టై రాజేంద్రన్, విజయ్ కూతురు దివ్య, నటి మీనా కూతురు నైనిక తదితరులు ముఖ్య పాత్రలు ధరిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడిగా 50వ చిత్రం కావడం మరో విశేషం.

వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అట్లీ దర్శకుడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను ముమ్మరంగా జరుపుకుంటోంది. తెరి చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలోని రెండు సాంగ్స్ పల్లవులు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తూ విజయ్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మాత ఈ నెల 20న భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. తెరి చిత్రాన్ని తమిళ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 14న అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాత కలైపులి ఎస్.థాను సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

తెరి సరికొత్త రికార్డులు:సాధారణంగా భారీ చిత్రాల విడుదలకు రెండు రోజులు లేదా వారం రోజుల ముందు థియేటర్లలో అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తారు. అలాంటిది తెరి చిత్రానికి ఏకంగా నెల రోజుల ముందే ప్రీ బుకింగ్ ఆరంభం కావడం రికార్డే అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement