ఇళయ దళపతి @40 | Happy Birthday Ilayathalapathy Vijay! | Sakshi
Sakshi News home page

ఇళయ దళపతి @40

Published Mon, Jun 23 2014 8:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

ఇళయ దళపతి @40

ఇళయ దళపతి @40

ఇళయ దళపతి విజయ్ ఆదివారం 40వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆయన అభిమానులు సంబరాల్లో మునిగారు. ఆదివారం పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరాలను తొడిగారు. దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ వారసుడిగా, ఒకప్పుడు బాలనటుడిగా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన విజయ్ ప్రస్తుతం ఇళయదళపతిగా అవతరించారు. రాష్ర్ట వ్యాప్తంగా అశేషాభిమాన లోకాన్ని కలిగి ఉన్నారు. ఈయన్ను కూడా రాజాకీయాల్లోకి దించేందుకు ఆయన అభిమానులు కుస్తీలు పడుతున్నారు. అయితే, రాజకీయాలకు దూరమన్న విజయ్ ఓ సేవా సంస్థతో ప్రజల్లోకి దూసుకెళ్తోన్నారు. పుట్టినరోజుకు ముందుగానే ఓరోజు సేవా కార్యక్రమాల్లో విజయ్ నిమగ్నం అవుతారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆయన 40వ వసంతంలోకి అడుగు పెట్టారు.
 
విజయ్ బర్త్‌డేను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. విజయ్ ఇచ్చిన పిలుపుతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. 40 కిలోల కేక్‌లను కత్తిరించారు. పేదలకు సంక్షేమ పథకాల్ని పంపిణీ చేశారు. ఆలయాల్లో ఉదయాన్నే విజయ్ పేరిట పూజలు నిర్వహించారు. ఉత్తర చెన్నైకు చెందిన విజయ్ అభిమాన సంఘం నాయకుడు అబ్బులు నేతృత్వంలో కోడంబాక్కం, ట్రిప్లికేన్ ప్రసూతి ఆస్పత్రుల్లో జన్మించిన పిల్లలకు బంగారు ఉంగరాలు తొడిగారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరో నాయకుడు కట్ పీస్ విజయ్ నేతృత్వంలో రాయపురంలో రక్తదాన శిబిరం, పేదలకు సంక్షేమాలు, వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. తిరువళ్లూరు ఉత్తర జిల్లా అభిమాన సంఘం నేతృత్వంలో అంబత్తూరులో భారీ వేడుకను ఏర్పాటు చేశారు. దక్షిణ చెన్నై సంఘం నేతృత్వంలో తిరువాన్మియూర్‌లో, కాంచీపురంలో ఈసీఆర్ శరణన్ నేతృత్వంలో రక్తదానం, అన్నదాతనం చేశారు.
 
కత్తి ఫస్ట్‌లుక్ విడుదల

తన బర్త్‌డేను పురస్కరించుకుని కత్తి సినిమా పోమోను విజయ్ విడుదల చేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమంత జంటగా కత్తి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విజయ్ ఆదివారం విడుదల చేశారు. చెన్నైలోని నేప్పియర్ వంతెన, వళ్లువర్ కోట్టం, కత్తి పారా జంక్షన్, సెంట్రల్ రైల్వే స్టేషన్, ఎల్‌ఐసీ భవనం, మౌంట్ రోడ్డును పేపర్ ప్రింట్ తరహాలో చూపిస్తూ, చివరకు వాటన్నీంటినీ ఏకం చేసి, అందులో నుంచి సీరియస్‌గా చూస్తున్న విజయ్ ముఖచిత్రం కన్పించేలా ఈ ప్రోమోను సిద్ధం చేశారు. భిన్నంగా రూపొందించిన ప్రోమోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. 40వ వసంతంలోకి అడుగు పెట్టిన విజయ్‌కు పలువురు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. నటుడు జీవా, ఉదయనిధి స్టాలిన్ తదితరులు ఇందులో ఉన్నారు. విజయ్ బర్త్‌డే సందర్భంగా తాను తీసుకున్న ఫొటోను ఉదయనిధి స్టాలిన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement