తెరి కాంబినేషన్‌లో మరో చిత్రం | Hit Combination For Theri Again | Sakshi
Sakshi News home page

తెరి కాంబినేషన్‌లో మరో చిత్రం

Published Sun, Sep 11 2016 2:39 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

తెరి కాంబినేషన్‌లో మరో చిత్రం

తెరి కాంబినేషన్‌లో మరో చిత్రం

కబాలి చిత్రం ముందు వరకూ అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డుకెక్కిన చిత్రం తెరి. ఇళయదళపతి విజయ్ కాథానాయకుడిగా నటించిన ఆ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఆయన రెండో చిత్రం ఇది. సమంత, ఎమీజాక్సన్ నాయకిలుగా నటించిన తెరి చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు దర్శకుడు అట్లీ త్వరలోనే వెల్లడిస్తానని చెప్పి చాలా కాలమైంది. అప్పటి నుంచి నిరాధార ప్రచారాలు చాలానే జరిగాయి.
 
 తాజాగా అట్లీ  కొత్త చిత్రం ఖరారయిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇదటుంచితే విజయ్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో సంఘమిత్ర అనే ఓ భారీ చారిత్రాత్మక కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ సన్నాహాలు చేసింది. ఆ చిత్ర కథ విజయ్‌కు నచ్చినా ఆ చిత్రంలో నటించడానికి కావలసిన కాల్‌షీట్స్ కేటాయించలేనని నిరాకరించినట్లు ప్రచారం జరిగింది. కాగా అదే సంస్థకు చిత్రం చేయడానికి విజయ్ సమ్మతించారన్నది తాజా సమాచారం. అయితే దీనికి సుందర్.సీ దర్శకుడు కాదు అట్లీ.
 
 అవును అట్లీ దర్శకత్వంలో మరోసారి నటించడానికి విజయ్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం విజయా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న భైరవా చిత్రంలో నటిస్తున్న విజయ్ ఈ చిత్రాన్ని అక్టోబర్‌లోపు పూర్తి చేయాలని దర్శక నిర్మాతకు గడువు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది విజయ్‌కు 60వ చిత్రం అన్న విషయం తెలిసిందే. అయితే అట్లీ విజయ్ 61వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారా? లేక ఆ తరువాత చిత్రం చేయనున్నారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సస్పెన్స్ వీడాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement