మళ్లీ ఆయనకు ఇద్దరు | 'Vijay 59': After Samantha and Amy Jackson, Another | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆయనకు ఇద్దరు

Published Tue, Oct 6 2015 3:43 AM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

మళ్లీ ఆయనకు ఇద్దరు

మళ్లీ ఆయనకు ఇద్దరు

సినిమాకు కథ ప్రధానం అన్నది ఎవరూ కాదనలేని అంశం. అయితే దానికి కథానాయకుడు ఎంత ముఖ్యమో కథానాయిక అంతే ముఖ్యం. కానీ కొంచెం తక్కువ అన్న సందాన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అలాంటిది ఒక హీరో ఒకటికంటే ఎక్కువ హీరోయిన్లు ట్రెండు మరో పక్క నడుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఇళయదళపతి విజయ్ తుపాకీ, జిల్లా, కత్తి లాంటి చిత్రాల్లో సింగిల్ హీరోయిన్లతోనే సూపర్ సక్సెస్‌లను సాధించారు.
 
 అలాంటిది ఇటీవల విడుదలయిన పులి చిత్రంలో హన్సిక, శ్రుతీహాసన్ మొదలగు ఇద్దరు ముద్దుగుమ్మలతో డ్యూయెట్లు పాడారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం విజయ్ వీ.క్రియోషన్స్ పతాకంపై కలైపులి ఎస్.ధాను నిర్మిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయనకు 59వ చిత్రం అన్నది గమనార్హం. రాజారాణి చిత్రం ఫేమ్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోనూ ఇద్దరు బ్యూటీస్ హీరోయిన్లుగా నటించనున్నారన్నది తాజా సమాచారం. ఇప్పటికే చెన్నై చిన్నది సమంత విజయ్‌తో రెండు డ్యూయెట్లు పాడేశారు.
 
  కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఒక ఫైట్ సీక్వెన్సీ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా ఎమీజాక్సన్ ఎంటర్ అవుతున్నారన్నది తాజా సమాచారం. నటుడు ధనుష్, ఉదయనిధిస్టాలిన్ చిత్రాలలో నటిస్తున్న ఎమీ త్వరలో ఇళయద ళపతితో రోమాన్స్‌కు రెడీ అవుతున్నారు. అదే విధంగా ఈ చిత్ర యూనిట్ త్వరలో అబ్రాడ్‌కు బయలదేరనుందని సమాచారం. అన్నట్లు ఇందులో విజయ్ మరోసారి పోలీస్ అధికారిగా దుమ్మురేపనున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement