ఆ హీరోయిన్కి నేను బిగ్ ఫ్యాన్... | I am a big fan of Samantha, says Amy Jackson | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్కి నేను బిగ్ ఫ్యాన్...

Published Fri, Jun 26 2015 10:22 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

ఆ హీరోయిన్కి నేను బిగ్ ఫ్యాన్...

ఆ హీరోయిన్కి నేను బిగ్ ఫ్యాన్...

హైదరాబాద్ : చిత్ర పరిశ్రమ అంటేనే పోటీ ప్రపంచం. ఇక హీరోయిన్ల మధ్య పోటీ సహజమే. ఇద్దరు హీరోయిన్లు కలిసి నటిస్తున్నారంటే వారి మధ్య సయోధ్య ఉండదని అంటుంటారు అయితే కోలీవుడ్, టాలీవుడ్లో తన అందంతో పాటు నటనా కౌశలంతో దూసుకువెళ్తున్న ఓ నటిని మరో నటి తన పోగడ్తలతో ఆకాశానికి ఎత్తేసింది.  ఇంతకీ ఎవరా ఆ ఇద్దరు హీరోయిన్లు అనేగా డౌట్....  

ఏం మాయ చేశావే అంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలా ప్రవేశించి అలా అగ్రహీరోల సరసన నటించి ప్రేక్షకుల మనస్సు దోచేసిన నటి సమంత. అలాంటి నటిని ప్రశంసల జల్లులతో ముంచెత్తుతోంది మరో హీరోయిన్ అమీ జాక్సన్. సమంతతో పరిచయమై కొద్ది సంవత్సరాలే అయినా ఆమెతో స్నేహబంధం మరింత దృఢమైందని.... సమంతకు తాను పెద్ద అభిమాని అని పేర్కొంది. అలాగే ఆమె అంటే తనకు చాలా చాలా గౌరవం అని చెప్పింది. బ్రిలియంట్ యాక్టరస్ అంటూ కితాబు ఇచ్చింది. ఏ మాయ చేశావే చిత్రం హిందీ రీమేక్లో సమంత పాత్రను తాను పోషించానని అమీ జాక్సన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.

సమంతతో కలిసి నటించడమంటే భలే ఇష్టమని తెగ పొంగిపోతూ చెప్పింది. అన్నట్లు మరిచాను అంటూ ఈ ఏడాది సమంతతో కలసి తాను రెండు చిత్రాల్లో నటిస్తున్నానని సంబరపడిపోతూ తెలిపింది. ఆ రెండు చిత్రాలలో ఓ సినిమాలో ధనుష్ హీరో కాగా... మరో దానిలో విజయ్ హీరోగా నటిస్తున్నట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement