విజయ్ 60వ చిత్రానికి దర్శకుడెవరు? | Who will direct Vijay`s 60th film? | Sakshi
Sakshi News home page

విజయ్ 60వ చిత్రానికి దర్శకుడెవరు?

Published Mon, Nov 2 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

విజయ్ 60వ చిత్రానికి దర్శకుడెవరు?

విజయ్ 60వ చిత్రానికి దర్శకుడెవరు?

ఇళయదళపతి విజయ్ 60వ చిత్రానికి దర్శకుడెవరనే చర్చ కోలీవుడ్‌లో చాలా కాలంగానే సాగుతోంది. చాలామంది ప్రముఖ దర్శకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి కూడా. విజయ్ 58వ చిత్రం పులి తన అభిమానుల్ని సంతృప్తి పరచలేకపోయింది. 59వ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో వి క్రియోషన్స్ పతాకంపై కలైపులి ఎస్.ధాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒళయదళపతి మరోసారి పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రానికి కాక్కి అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఆయన 60వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కమర్శియల్ దర్శకుడిగా పేరొందిన హరి హ్యాండిల్ చేయనున్నారన్నది తాజా సమాచారం. ప్రశాంత్ మొదలు విక్రమ్, విశాల్, సూర్య, శింబు, భరత్ వరకూ పలువురు హీరోలతో చిత్రాలు చేసి కమర్శియల్ విజయాలను సాధించిన దర్శకుడు హరి ఒక్క సూర్యతోనే నాలుగు చిత్రాలు చేశారు. ఐదో చిత్రంగా సింగం-3ని త్వరలో సెట్ పైకి తీసుకెళ్లనున్నారు. కాగా తొలి సారిగా ఇళయదళపతితో ఆయన 60వ చిత్రానికి చేతులు కలపనున్నారన్నది గమనార్హం.

ఈ బారీ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయ వాహిని నిర్మించనుందని సమాచారం. ఇక్కడో విషయం చెప్పాలి. ప్రశాంత్ హీరోగా హరి దర్శకత్వం వహించిన తమిళ్ చిత్రం విజయ్ నటించిన తమిళన్ చిత్రం అప్పట్లో ఒకే రోజు విడుదలయ్యి పోటీ పడ్డాయన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement