Ganderbal
-
ఢిల్లీ నేతలకు నేనంటే ద్వేషం : ఒమర్
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లో ఎన్నికల వేళ బీజేపీ అగ్రనాయకత్వంపై నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పరోక్ష విమర్శలు చేశారు. శుక్రవారం గాందర్బల్ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారంలో ఒమర్ మాట్లాడారు. ‘‘ ఢిల్లీలో ఉన్న నేతలకు నేనంటే ద్వేషం. ఎన్నికల్లో ఓడించి నా నోరు మూయించాలని చూస్తున్నారు. పని గట్టుకుని స్వతంత్య అభ్యర్థులను నాపై పోటీకి నిలుపుతున్నారు. నన్ను ఓడించి చట్టసభల్లో నా గొంతు వినపడకుండా చేయాలని కుట్ర పన్నారు. ఢిల్లీ నేతలపై నేను పోరాడుతున్నది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు. జమ్మూకశ్మీర్ పౌరుల కోసం. నేనేం మాట్లాడిన ప్రజల గొంతుక వినిపిస్తా’’ అని ఒమర్ అన్నారు. -
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ.. భక్తులకు ఈసారి కొత్త రూల్..!
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ ట్రాక్‌లకు ఇవాళే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ ద్వారా భక్తులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే అధికారులు ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌లో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే భక్తులు కచ్చితంగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు.. ► 13-70 ఏళ్ల భక్తులే ఈ యాత్రలో పాల్గొనేందుకు అర్హులు ► అందరూ కచ్చితంగా ఆరోగ్య ధ్రువపత్రాన్ని పొందుపర్చాలి ► ఆరు వారాలకు పైబడిన గర్భిణీలు యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: సీఎం మమత మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. సీబీఐ, ఈడీ విచారణపై స్టే.. -
బుద్గాం, గండేర్బాల్ల్లో 144 సెక్షన్
శ్రీనగర్: కశ్మీర్‌లోయలోని శ్రీనగర్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘర్షణలు జరిగిన బుద్గాం, గండేర్బాల్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జిల్లాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. ఉప ఎన్నికల ఘర్షణలో 8 మంది యువకులు చనిపోవటాన్ని నిరసిస్తూ వేర్పాటువాదులు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. చాలాచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. దుకాణాలు, పెట్రోల్ స్టేషన్లు, ఇతర వ్యాపార సముదాయాలు తెరవలేదు. అటు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ రద్దీ కనిపించలేదు. కశ్మీర్ యూనివర్సిటీతోపాటు ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. -
'అన్ని ప్రాంతాల ప్రజలు నాకు సమానమే'
శ్రీనగర్: అబ్దుల్లా కుటుంబానికి పెట్టని కోటగా మారిన గండెర్ బాల్ నియోజకవర్గానికి జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు తనకు సమానమే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల ప్రజలంతా తనకు సమానమేనని ఆయన అన్నారు. సోనావార్, బీర్వా నియోజకవర్గాల కార్యకర్తలతో జరిగిన భేటిలో ఓమర్ మాట్లాడుతూ... అంకితభావంతో ప్రజలకు చేయడమే తన లక్ష్యం అని అన్నారు. సొంత నియోజకవర్గాన్ని వదులుకుని శ్రీనగర్ లోని సోనావార్, బుద్గమ్ జిల్లాలోని బీర్ వా నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.