'అన్ని ప్రాంతాల ప్రజలు నాకు సమానమే'
'అన్ని ప్రాంతాల ప్రజలు నాకు సమానమే'
Published Sat, Nov 1 2014 6:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
శ్రీనగర్: అబ్దుల్లా కుటుంబానికి పెట్టని కోటగా మారిన గండెర్ బాల్ నియోజకవర్గానికి జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు తనకు సమానమే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల ప్రజలంతా తనకు సమానమేనని ఆయన అన్నారు.
సోనావార్, బీర్వా నియోజకవర్గాల కార్యకర్తలతో జరిగిన భేటిలో ఓమర్ మాట్లాడుతూ... అంకితభావంతో ప్రజలకు చేయడమే తన లక్ష్యం అని అన్నారు. సొంత నియోజకవర్గాన్ని వదులుకుని శ్రీనగర్ లోని సోనావార్, బుద్గమ్ జిల్లాలోని బీర్ వా నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
Advertisement
Advertisement