కశ్మీర్ లోని బుద్గాం, గండేర్‌బాల్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
శ్రీనగర్: కశ్మీర్‌లోయలోని శ్రీనగర్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘర్షణలు జరిగిన బుద్గాం, గండేర్‌బాల్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జిల్లాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. ఉప ఎన్నికల ఘర్షణలో 8 మంది యువకులు చనిపోవటాన్ని నిరసిస్తూ వేర్పాటువాదులు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. చాలాచోట్ల జనజీవనం స్తంభించిపోయింది.
దుకాణాలు, పెట్రోల్ స్టేషన్లు, ఇతర వ్యాపార సముదాయాలు తెరవలేదు. అటు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ రద్దీ కనిపించలేదు. కశ్మీర్ యూనివర్సిటీతోపాటు ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి.