అమరనాథ్ యాత్రలో హింస
శ్రీనగర్: హింస చెలరేగడంతో అమరనాథ్ యాత్ర అర్ధాంతరంగంగా ఆగిపోయింది. సామూహిక వంటశాలలు నిర్వహించే యజమానులకు, గుర్రాలపై భక్తులను తరలించే యజమానుల మధ్య ఘర్షణ తలెత్తడంతో హింస చెలరేగింది. అన్నదానం టెంట్లకు గుర్రపు యజమానులు నిప్పుపెట్టారు. దీంతో గ్యాస్ సిలెండర్లు పేలిపోయాయి. భయంతో భక్తులు పరుగులు తీశారు. ఆగ్నేయ శ్రీనగర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బాల్టాల్ ప్రాంతానికి సమీపంలోని దుమాయిల్ బేస్ క్యాంప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ సంఘటనలో 25 మంది వరకు గాయపడ్డారని తెలిపారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని సమీక్షించారు. సంఘటనా స్థలానికి వెళ్లాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ లో ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు. పరిస్థితిని అదుపుచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.