
సాక్షి, బెంగళూరు : "ఊరందరిదీ ఓ దారైతే ఉలిపికట్టది ఓ దారి" అనే సామెత ఇప్పుడు చెప్పుకునే వ్యక్తికి సరిగ్గా సూటవుతుంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దు, చీటికీమాటికీ వాహనాలు బయటకు తీయొద్దు అంటూ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వమే తనది అనుకున్నాడో లేక తననెవరూ ఏమీ చేయలేరనుకున్నాడో ఏమో కానీ ఓ ఎమ్మెల్యే కుమారుడు అధికారుల మాటలను పెడచెవిన పెట్టాడు. ఈ నిబంధనలన్నీ సాధారణ జనాలకే కానీ, నాబోటి వాళ్లకు కాదని నిరూపిస్తూ నడిరోడ్డుపై గుర్రం స్వారీ చేశాడు. (నిఖిల్ పెళ్లిపై నివేదిక ఇవ్వండి)
వివరాల్లోకి వెళితే కర్ణాటక అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమార్ కొడుకు భువన్ కుమార్ అటు కరోనాను, ఇటు లాక్‌డౌన్‌ను ఏమాత్రం లెక్క చేయకుండా మైసూర్ ఊటీ జాతీయ రహదారిపై గుర్రం స్వారీ చేస్తూ కనిపించాడు. స్వారీ చేస్తున్న సమయంలో ముఖానికి కనీసం మాస్కు కూడా ధరించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యే తనయుడి హంగామా చూసిన జనాలు మండిపడుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కిన అతడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. (నోట్లో బాటిల్ మెడలో పాము)
Comments
Please login to add a commentAdd a comment