ఓ వైపు వృత్తి.. మరోవైపు హాబీ.. చాలా మంది ఈ రెంటిలో ఏదో ఒక్కదానికే ప్రాధాన్యం ఇస్తారు. అతికొద్దిమంది మాత్రమే ఈ రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతారు.. అలా రెంటిలోనూ గుర్తింపు తెచ్చుకోడం అంత సులువేం కాదు.. అందునా ఓ మహిళ ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం చెప్పుగోదగ్గ విషయం.. పైగా అతి కష్టతరమైన గుర్రపు స్వారీలో రాణించడమంటే ఎంతో గుండె ధైర్యం కూడా ఉండాలి.. అలా గుర్రపు స్వారీలో రాణిస్తూనే.. ఎనీ్టపీసీలో మేనేజర్‌గా బిజీగా ఉంటూ.. మరోవైపు రచయిత్రిగానూ రాణిస్తున్నారు.. నగరానికి చెందిన ప్రియాంక భుయాన్. పలువురికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్న ఆమె అనుభవాలు సాక్షితో పంచుకున్నారు... ఆ వివరాలు మీకోసం..
మహిళలంటే వంటింటికే పరిమితం అనే అపోహలను చెరిపేస్తూ.. అన్నింటిలోనూ పోటీకి సిద్ధమని నిరూపిస్తున్నారు నేటి మహిళలు.. కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఆటల్లోనూ ముందడుగేస్తున్నారు. ఎంత కష్టమైనా.. ఎదురు నిలిచి.. గెలిచి చూపిస్తున్నారు.. అంతటితో ఆగకుండా మరోవైపు కుటుంబ బాధ్యతలను భారంగా కాకుండా ఎంతో నిబద్ధతతో చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు ఎనీ్టపీసీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రియాంక భుయాన్. గుర్రపు స్వారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ.. నలుగురికీ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు.
చిన్నన్నాటి కల..
అస్సాంలోని గువహటిలో జన్మించాను. అక్కడే నా బాల్యం గడిచింది. మూడేళ్లు వయసప్పుడు అమ్మ ఇచ్చిన ఓ గ్రీటింగ్ కార్డులో తొలిసారిగా గుర్రం బొమ్మ చూశాను. అప్పటి నుంచి గుర్రాలంటే పిచ్చి. కాస్త పెరిగాక గుర్రపు స్వారీపై ఆసక్తి పెరిగింది. కానీ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. గుర్రాన్ని దగ్గరి నుంచి చూడటమే విశేషం. కానీ ఇప్పుడు గుర్రం స్వారీ చేస్తూ పోటీల్లో పాల్గొనడం, పతకాలు సాధించడం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఎన్నో ఆటంకాలు...
వృత్తిలో భాగంగా 2020లో రాయ్‌పూర్ బదిలీ అయ్యాను. కుటుంబం నుంచి దూరంగా ఉండటంతో ఒంటరిగా ఫీలయ్యేదాన్ని. అప్పుడే హార్స్ రైడింగ్ కలకు చేరువవ్వాలని నిర్ణయించుకున్నా.. అయితే మొదట్లో ఎవరేం అనుకుంటారో అని కాస్త భయపడ్డా. పైగా మహిళలకు ఈ రంగంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినా ధైర్యం చేసి∙ట్రైనింగ్‌సెంటర్‌లో చేరాను. ట్రైనింగ్‌సెంటర్‌కు వెళ్లి గుర్రాలను చూడగానే ఎగిరి గంతేశాను. అయితే ప్రాక్టీస్ సమయంలో కింద పడి గాయాలయ్యాయి. వాటన్నింటినీ దాటుకుని ముందుకెళ్లాను. ఢిల్లీలో జరిగిన పోటీలో కాంస్య పతకం గెలుచుకున్నా.
ఆ బాండింగ్ ప్రత్యేకం..
హార్స్ రైడింగ్ నేర్చుకోవడమే కాదు.. గుర్రంతో మంచి అనుబంధం ఉండాలి. ఎంత బాండింగ్ ఉంటే అంత అద్భుతంగా రాణించగలుగు తాం. ఒక్కోసారి గుర్రాలు మనకు సహకరించవు. దీనివల్ల గాయాలు కావొచ్చు. ప్రాణాలు కూడా పోవచ్చు. ముందస్తు జాగ్రత్తలతో పాటు గుర్రంతో స్నేహం చేయాలి. కుదిరితే సొంత గుర్రం కొనుక్కోవడం మంచిది.
ధర ఎక్కువే..
గుర్రాల్లో చాలారకాలుంటాయి. స్వారీలకు వేడి రక్తం ఉన్న విదేశీ గుర్రాలను వాడుతుంటారు. వాటిని దిగుమతి చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కోదాని ఖరీదు రూ.30 నుంచి రూ. 40 లక్షలు ఉంటుంది. దీనికి పన్ను అదనం. దేశవాళీ గుర్రాలు అయితే కాస్త తక్కువ ధరకు దొరుకుతాయి. కానీ అనుకున్నన్ని సాహసాలు, మిరాకిల్స్ కష్టం. నేనూ ఓ గుర్రాన్ని కొనుక్కున్నా. కాకపోతే దురదృష్టవశాత్తు కొన్ని నెలలకే క్యాన్సర్‌తో మరణించింది. గుర్రాన్ని పెంచడమూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.
రాయడమూ ఇష్టమే..
గుర్రపు స్వారీతో పాటు పుస్తకాలు రాయడమూ హాబీ. ఇప్పటివరకూ మూడు పుస్తకాలు రాశాను. వాటికి పాఠకుల నుంచి స్పందన వచి్చంది. కురుక్షేత్రంలో మహిళల గురించి ప్రపంచానికి పరిచయం చేయాలని నా తపన. అందుకే వీలు చిక్కినప్పుడల్లా పుస్తకాలు రాస్తుంటాను.
Comments
Please login to add a commentAdd a comment