
పాయల్ రాజ్‌పుత్
‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారు మనసులు దోచుకున్న పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకుంటున్నారు. ఇదంతా ఆమె లీడ్‌రోల్‌లో రూపొందనున్న ‘అరుంధతి 2’ సినిమా కోసం. శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై కోటి తూముల ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా కోటి తూముల మాట్లాడుతూ– ‘‘చారిత్రాత్మక, యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. పెద్ద బడ్జెట్‌తో, భారీ గ్రాఫికల్ చిత్రంగా రూపొందనుంది.
పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ పనులు హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇందులో పాయల్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ తారలు నటిస్తారు. కథాంశంలో భాగంగా పాయల్ గుర్రపుస్వారీ, కత్తిసాము శిక్షణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద తీసుకుంటోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment