Arundhati
-
Divya Arundati : అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అరుంధతికి జరిమానా
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అరుంధతి రెడ్డి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. సోమవారం యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్ బ్యాటర్ పూనమ్ వికెట్ తీసిన సంబరంలో అరంధతి అతిగా స్పందించింది. ఆ బ్యాటర్‌ను గేలి చేసేలా అనుచితంగా ప్రవర్తించింది. దీనిపై సమీక్షించిన మ్యాచ్ రిఫరీ వర్ష నాగ్రే డబ్ల్యూపీఎల్ నియమావళి ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాగా విధించింది. ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి లీగ్‌లో బోణీ కొట్టింది. -
కథలకు ప్రాణం పోసిన టాప్ హీరోయిన్స్.. ఓటీటీలో ఈ చిత్రాలు ఎవర్గ్రీన్
సౌత్ సినిమా పరిశ్రమలో హీరోలుకు ఏ మాత్రం తగ్గకుండా ఇప్పుడు హీరోయిన్లు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. సింగిల్‌గానే వచ్చి బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నారు. తమ స్టార్డమ్తో సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. వారి సత్తా ఎంటో బాక్సాఫీస్ ముందు చూపిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల జోరు కొనసాగుతుంది. అయితే ఇదీ నిన్నమొన్న మొదలైన ప్రస్థానం కాదు. సుమారు కొన్నేళ్ల క్రితమే ఈ ట్రెండ్ మొదలైంది. సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్లు ముందు వరుసలో ఉన్నారు. అనుష్క సినీ కెరియర్లో అరుంధితి సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ముందు ఆమె సుమారు 15 చిత్రాల్లో నటించింది. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలే పోషించిన అనుష్కను లేడీ సూపర్ స్టార్ చేసింది కూడా 'అరుంధతి' సినిమానే. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుష్క కెరీర్లో మైలు రాయిగా నిలిచింది. 2009 జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరుంధతి వచ్చి ఇప్పటికి 15ఏళ్లు కావస్తోంది. ఈ సినిమాతో సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా అనుష్క చేరిపోయింది. అలా అరుంధతి చిత్రం సినీ ప్రేమికుల మస్ట్ వాచబుల్ లిస్ట్‌లో చేరిపోయింది. డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో అరుంధతి స్ట్రీమింగ్ అవుతుంది. కిర్తీ సురేష్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో సత్తా చాటుతుంది. ఓ వైపు కమర్షియల్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను కట్టి పడేయగలదు. ఈతరం 'మహానటి'గా కీర్తి సురేష్ గుర్తింపు పొందింది. అలనాటి తార సావిత్రిని వెండితెరపై మరోనటి ఆవిష్కరించడం సాధ్యమయ్యే పనేనా..? అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ పాత్రకు జీవం పోసి ప్రశంసలు పొందింది. 2018లో మహానటి చిత్రంతో ఆమె కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. అంతర్జాతీయంగా విజయం అందుకున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కిర్తీ సురేష్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెజాన్ ప్రైమ్‌లో మహానటి చిత్రాన్ని చూడవచ్చు. మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్గా ఇండస్ట్రీలో సమంత ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి సూపర్ హిట్స్‌ను అందుకుంది. కానీ లేడీ ఓరియేంటేడ్ చిత్రం అయిన 'యశోద' చిత్రం ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయి. అన్నీ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. తన చెల్లిని కనిపెట్టడం కోసం హీరోయిన్ కృత్రిమ గర్భాన్ని ధరించి వెళ్లడం అనే సాహసవంతమైన పాయింట్‌తో దీనిని తెరకెక్కించారు.ఇందులో సమంత నటనకు 100 మార్కులకు మించి వేయవచ్చు. అంతలా తన రోల్లో ఆమె మెప్పిస్తుంది. హరి-హరీష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్.. దాదాపు రూ.50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వెండితెరపై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కోసం సమంత తొలిసారిగా గర్భవతిగా కనిపించడమే కాక.. డూప్ లేకుండా ఫైట్స్ సీన్స్ చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాలో అసలైన లేడీ సూపర్ స్టార్ అంటే నయనతారనే అని చెప్పవచ్చు. సినిమా కెరియర్ నుంచే ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. అలా కాకుండా నాలుగు పాటలు, రెండు రొమాన్స్ సీన్స్‌కు మాత్రమే పరిమితం చేస్తే వెంటనే నో చెబుతుంది. సీనియర్ నటి విజయశాంతి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటించింది కూడా నయనతారనే అని చెప్పవచ్చు. ఆమె సినిమాలో మాత్రమే నటిస్తుంది నో ప్రమోషన్స్, నో ప్రెస్మీట్స్, నో స్పెషల్ ఇంటర్వ్యూస్… సినిమా చేశామా, చేతులు దులిపేసుకున్నామా అంతే అనేలా ఉంటుంది. ఒక్కో సినిమాకు రూ.10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్‌లో ఉంది. నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరమ్'. ఈ చిత్రం 'కర్తవ్యం' పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ఈ సినిమాలో కలెక్టర్‌గా నయన్ మెప్పిస్తుంది. బోరుబావిలో పడిపోయిన ఒక చిన్నారిని కాపాడే క్రమంలో ఒక కలెక్టర్‌గా ఆమె వ్యవహరించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు ముప్పయ్యేళ్ల క్రితమే పాన్ ఇండియా హీరోయిన్గా మధుబాల సత్తా చాటింది. మణిరత్నం దృశ్యకావ్యం అయిన 'రోజా'లో ఆమె నటన యావద్దేశాన్నీ కట్టిపడేసింది. మనసును దోచుకునే చిరునవ్వుతో అందానికి చిరునామా అనిపించుకున్న మధుబాల... కొన్నేళ్లకే వెండితెరకు దూరమైంది. 'రోజా' విడుదలయ్యాక దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగింది. ఎక్కడికెళ్లినా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ రోజా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఇప్పటికీ ఆమెను రోజా మధుబాల అనే పిలుస్తుంటారు. 30 ఏళ్లు అయినా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటింది. సినిమా అవకాశాలు వస్తున్నా పెళ్లి తర్వాత సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌తో మళ్లీ తెరమీదకొచ్చిన ఆమె ‘శాకుంతలం’లో మేనకగా కనిపించింది. రోజా సినిమా అమెజాన్ ప్రైమ్,జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. -
'అరుంధతి' ఛాన్స్ ముందు ఏ హీరోయిన్‌కు వచ్చిందంటే?
అనుష్కను స్టార్ హీరోయిన్గా నిలబెట్టిన చిత్రాల్లో అరుంధతి సినిమాది అగ్రస్థానం. అప్పటివరకు అందాల ప్రదర్శనకే ప్రాధాన్యమిచ్చిన ఈ హీరోయిన్ అరుంధతిలో నటవిశ్వరూపం చూపించింది. సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. అరుంధతి అంటే అనుష్క.. అనుష్క అంటే అరుంధతి అని ప్రేక్షకుల మనసులో బలంగా ముద్రపడిపోయింది. టాప్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2009లో సంక్రాంతి కానుకగా జనవరి 16న విడుదలై సెన్సేషనల్ హిట్ అందుకుంది. మల్లెమాల ఎంంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలీజై నేటికి పదమూడేళ్లు పూర్తైంది. నిజానికి ఈ సినిమా ఛాన్స్ మొదట అనుష్కకు రాలేదట! మలయాళ కుట్టి మమతా మోహన్‌దాస్‌ను అరుంధతి సినిమా కోసం సంప్రదించారట. కానీ అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమెకు ఎలాంటి కథలు ఎంచుకోవాలో పెద్దగా తెలిసేది కాదని, దానివల్లే అరుంధతిని వదులుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అప్పటికే ఇతర ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండటంతో విముఖత వ్యక్తం చేసిందట. ఈ ఆఫర్ వచ్చిన రెండు నెలలకే క్యాన్సర్ ఉన్నట్లు తేలడంతో అరుంధతి కంటే బతికి ఉంటే చాలన్న భావనతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని పేర్కొంది. అలా ఈ సినిమా అనుష్క దగ్గరకు రావడం, ఆమె ఓకే చెప్పేయడంతో చకచకా షూటింగ్ జరిపేశారు. సినిమా రిలీజయ్యాక జేజమ్మగా అనుష్కకు జనాలు నీరాజనాలు పట్టారు. -
వన్డేల్లోనూ సత్తా చాటుతా పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అరుంధతి రెడ్డి... భారత మహిళల టి20 టీమ్‌లో సత్తా చాటి తన స్థానం పదిలం చేసుకున్న పేస్ బౌలర్. గత మూడేళ్లుగా టి20 ఫార్మాట్లో కీలక ప్లేయర్‌గా ఎదిగిన అరుంధతి తొలిసారి వన్డే, టెస్టు జట్టులోకి ఎంపికైంది. రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొనే టీమ్‌లో ఆమెకు అవకాశం లభించింది.ఇకపై వన్డేల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమంటున్న 23 ఏళ్ల పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కావడంపై... చాలా సంతోషంగా ఉంది. భారత జట్టుకు ఇప్పటికే ప్రాతినిధ్యం వహించినా... మరో ఫార్మాట్లో నాకు కొత్తగా అవకాశం దక్కుతోంది. టి20ల్లో నిలకడగా రాణించడం వల్లే నాకు ఈ చాన్స్ వచ్చిందని నమ్ముతున్నా. వన్డేల్లోనూ రాణించి జట్టు విజయంలో నేనూ పాత్ర పోషించగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఇంగ్లండ్‌లో ఆడాలనేది నా కల. ఇప్పుడు అక్కడికే భారత జట్టు తరఫున వెళుతుండటం గర్వకారణం. టి20ల్లో ప్రదర్శనపై... హైదరాబాద్ టీమ్‌నుంచి మొదలు పెట్టి ఇండియా ‘ఎ’ వరకు మెరుగైన ప్రదర్శన ఇచ్చిన తర్వాతే నాకు జాతీయ జట్టులో అవకాశం లభించింది. మూడేళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌నుంచి చూస్తే ఇప్పుడు నా ఆట ఎంతో మెరుగైంది. నా తొలి సిరీస్‌లో శ్రీలంకతో ఆడిన మూడో మ్యాచ్‌తోనే నాకు మంచి గుర్తింపు దక్కింది. కొత్త బంతితో ఇన్నింగ్స్ ప్రారంభించిన నేను రెండు కీలక వికెట్లతో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాను. అయితే ఇంకా నేను ఆశించిన ‘అత్యుత్తమ మ్యాచ్’ ఇంకా రాలేదనేది నా అభిప్రాయం. కొన్ని సార్లు మనం ఎంతగా శ్రమించినా చివరకు ఫలితం లభించదు. అయితే నా ఆటను సెలక్టర్లు గుర్తించారు కాబట్టే టి20ల్లో రెగ్యులర్‌గా మారడంతో పాటు ఇప్పుడు వన్డేల్లోనూ పిలుపు లభించింది. ఇక తక్కువ సమయంలోనే రెండు ప్రపంచకప్‌లలో ఆడే అవకాశం రావడం నా అదృష్టం. పేస్ బౌలింగ్ పదునుపై... అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన తర్వాత నా బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వం పెంచేందుకు ఎంతో శ్రమించా. కెరీర్ ఆరంభ రోజులతో పోలిస్తే ఇప్పుడు నా బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు సాధనతో లోపాలు సరిదిద్దుకుంటున్నా. ఇన్‌స్వింగర్ నా ‘స్టాక్ బాల్’ కాగా...అవుట్ స్వింగర్లు, ఆఫ్ కట్టర్లను సమర్థంగా ప్రయోగించగలుగుతున్నా. ఎన్ఎస్ గణేశ్ వద్ద కోచింగ్ మొదలు పెట్టిన నాకు రైల్వేస్ టీమ్‌కు ఆడే సమయంలో మూర్తి సహకరిస్తున్నారు. ఇతర సమయంలో ఆల్ఫ్రెడ్ అబ్సలమ్ వద్ద ప్రాక్టీస్ కొనసాగిస్తున్నా. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టా. మిథాలీ రాజ్ ప్రభావం... నాకు క్రికెట్‌పై ఆసక్తి కలగడానికి, ఆటలో ఎదిగేందుకు కూడా ఆమెనే స్ఫూర్తి. ఆమె ఆటను బాగా దగ్గరినుంచి చూశాను. నేను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన సమయంలో జట్టులో మిథాలీ అక్క కూడా ఉంది. రైల్వేస్ జట్టు తరఫున ఆమె కెప్టెన్సీలో ఆడుతున్నా. సీనియర్ ప్లేయర్‌గా, మన హైదరాబాదీగా కూడా అన్ని సందర్భాల్లో మిథాలీ సహకారం నాకు లభించింది. నన్ను బాగా ప్రోత్సహిస్తూ తగిన విధంగా మార్గనిర్దేశం చేస్తోంది. కరోనా కాలంలో సుదీర్ఘ విరామంపై... ఎన్నో ఇతర క్రీడల్లాగే మహిళల క్రికెటర్లందరం కూడా గత ఏడాదంతా ఆటపరంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. టి20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు సంవత్సరం పాటు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేకపోయింది. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్ సౌకర్యాలు కూడా వాడుకునే పరిస్థితి లేకపోయింది. ఇక ప్రాక్టీస్ చేద్దామంటే అకాడమీలూ మూసేశారు. పైగా కరోనాతో భయం కూడా. దాంతో ఆ సమయంలో క్రికెట్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. చివరకు నేను ప్రాక్టీస్ కోసం వరంగల్‌కు వెళ్లిపోయాను. నా సహచర ప్లేయర్ ప్రణీషకు సొంత పిచ్, నెట్స్ ఉండటంతో అక్కడకు వెళ్లి సాధన చేసేదాన్ని. ఈ సారి జాగ్రత్తలూ తీసుకుంటూ ఆటపై దృష్టి పెట్టగలుగుతున్నాం. ‘పాఠాలు నేర్చుకుంటా’ ‘ఇటీవల లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి అనుభవంతో మున్ముందు తప్పులు సరిదిద్దుకుంటా. నేను గెలిపించాల్సిన మ్యాచ్‌లో విఫలమయ్యాను. చివరి ఓవర్లో సఫారీ జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా...తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాను. తర్వాతి 3 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే ఐదో బంతి ‘నోబాల్’గా వేశాను. అదనపు బంతితో వారికి మరో అవకాశం లభించి చివరి బంతికి విజయం సాధించగలిగారు. నేను ‘నోబాల్’ వేయకుంటే మా జట్టు గెలిచేదేమో’ -
గుర్రపుస్వారీ.. కత్తిసాము
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారు మనసులు దోచుకున్న పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకుంటున్నారు. ఇదంతా ఆమె లీడ్రోల్లో రూపొందనున్న ‘అరుంధతి 2’ సినిమా కోసం. శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై కోటి తూముల ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా కోటి తూముల మాట్లాడుతూ– ‘‘చారిత్రాత్మక, యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. పెద్ద బడ్జెట్‌తో, భారీ గ్రాఫికల్ చిత్రంగా రూపొందనుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ పనులు హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇందులో పాయల్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ తారలు నటిస్తారు. కథాంశంలో భాగంగా పాయల్ గుర్రపుస్వారీ, కత్తిసాము శిక్షణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద తీసుకుంటోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం’’ అన్నారు. -
ఉద్యోగ ధర్మం
అరుంధతీ రాజ్యానికి రాజు అమరసేనుడు. ఆ రాజ్యానికి వివేకుడు మంత్రి, ప్రమద్వరుడు కోశాధికారి. కోశాగారంలోని బంగారం, ధనం ప్రమద్వరుడి అధీనంలో ఉండేవి. ఒకసారి అకస్మాత్తుగా ప్రమద్వరుడి దగ్గరి బంధువు మరణించిన వార్త తెలిసింది. వెనువెంటనే రాజధాని నుంచి బయలుదేరి బంధువుల ఊరికి వెళ్ళిపోయాడు ప్రమధ్వరుడు. ఆ సమయంలో రాజ్య పరిపాలన కోసం ధనం పెద్దమొత్తంలో అవసరమై మంత్రి కోశాగారం దగ్గరకు వెళ్ళాడు. తాను వచ్చినపని కాపలాదారులకు చెప్పాడు. ప్రమద్వరుడి అనుమతి లేనిదే ఎవరినీ కోశాగారంలోనికి అనుమతించమన్నారు వాళ్ళు. ‘నేను ఈ రాజ్యానికి మంత్రినని తెలియదా? కోశాగారానికి సంబంధించిన ఒక జత తాళాలు నా దగ్గరున్నాయి. అంటే నాకూ లోనికివెళ్ళే అర్హత ఉందనేకదా! మీ కోశాధికారి ప్రమద్వరుడు నేను నియమించినవాడే’ అన్నాడు మంత్రి.అందుకు వాళ్ళు ఒప్పుకోక ‘అయ్యా! మమ్ములను నియమించుకున్నది కోశాధికారి ్రçపమద్వరుడు కదా! మేము వారికి జవాబుదారీగా వుండాలికదా! ఆయన మీకు తన బాధ్యతలను అప్పజెబుతూ స్వదస్తూరీ, సంతకంతో ఇచ్చిన లేఖ వుంటే ఇవ్వండి. అనుమతిస్తాము‘అన్నారు. ప్రమద్వరుడు ఏదైనా పనిమీద రాజధాని దాటి వెళ్తున్నప్పుడుమంత్రికి లేఖ ఇచ్చి వెళ్ళేవాడు. అందులో ఏం వ్రాశాడో చూసే అవసరం తనకు ఏరోజూ రాలేదు. ఈసారి హుటాహుటిన బయలుదేరటం వల్ల, లేఖ మరచి వెళ్ళిపోయాడు. ఆ లేఖ అవసరమని మంత్రి ఏ రోజూ అనుకోలేదు. ఆ విషయం వారికిచెప్పినా ఒప్పుకోలేదు. మంత్రి వెళ్ళి రాజుకు విషయం చెప్పి ‘నన్ను కూడా లెక్క చెయ్యని వాళ్ళు ఒక్కక్షణం కూడా ఉండటానికి వీల్లేదు. తొలగిస్తాను‘అన్నాడు ఆవేశంగా.రాజు నవ్వి ‘మంత్రివర్యా! మీ స్థానంలో ఎవరున్నా కోపం రావటం సహజమే.కానీ కొంచెం ఆవేశం తగ్గించుకుని ఆలోచించండి. వారి ఉద్యోగ ధర్మం వారు సక్రమంగా, నిజాయతీగా నిర్వహిస్తున్నారు. ప్రమధ్వరుడికి మీరు అధికారి కావచ్చు. వారికి మాత్రం ప్రమద్వరుడే అధికారి. అతనిఅనుమతి లేనిదే లోనికి వెళ్ళనివ్వని వారి కర్తవ్యనిర్వహణ ధర్మమైనదే కదా!.మన అవసరాన్ని ఒక్కరోజు వాయిదా వేసుకుంటే, ప్రమధ్వరుడు వస్తాడు కదా,!‘అన్నాడు.మంత్రి రాజు మాటలతో ఏకీభవించి వెళ్లిపోయాడు. మరునాడు ప్రమధ్వరుడు రాగానే ఎంతో నిజాయతీపరులు, ఉద్యోగ ధర్మం పట్ల అంకితభావం కలవారిని ఎన్నికచేసి, కాపలాదారులుగా నియమించినందుకు ప్రశంసించి సత్కరించాడు మంత్రి వివేకుడు. ∙డి.కె.చదువులబాబు -
టి20 ప్రపంచకప్‌కు అరుంధతి రెడ్డి
న్యూఢిల్లీ: మహిళల టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన మీడియం పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి చోటు దక్కించుకుంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో అరంగేట్రం చేసి మెరుగ్గా రాణించడంతో ఆమెకు ఈ అవకాశం లభించింది. వెస్టిండీస్ వేదికగా నవంబర్ 9 నుంచి 24 వరకు ఐసీసీ మహిళల టి20 వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆలిండియా మహిళల సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుండగా... ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇప్పటికే జట్టులో సీనియర్ హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్ ఉండగా... ఇప్పుడు తాజాగా మరో హైదరాబాదీ అరుంధతికి తొలిసారి వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కింది. 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. ఇదే గ్రూప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్ నవంబర్ 9న న్యూజిలాండ్‌తో, 11న పాక్‌తో, 15న ఐర్లాండ్‌తో, 17న ఆస్ట్రేలియాతో తలపడనుంది. మ్యాచ్‌లు గయానా స్టేడియంలో జరుగనున్నాయి. భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తానియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనూజ పాటిల్, ఏక్తా బిష్త్, హేమలత, మాన్సి, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి. -
టీ20లో 'జేజమ్మ'
భారత మహిళల క్రికెట్ జట్టులో నగరం నుంచి మరో అమ్మాయి స్థానందక్కించుకుంది. ఇప్పటికే మిథాలీరాజ్‌కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయగా... మరికొంత మంది ఇండియన్ ఉమెన్స్ టీమ్‌లో ఆడగా, ఇప్పుడు మరో అమ్మాయి జట్టులో చోటు సంపాదించుకోవడం విశేషం.నగరంలోని డిఫెన్స్ కాలనీకి చెందినఅరుంధతీరెడ్డి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికైంది.ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలు... సాక్షి, సిటీబ్యూరో :ఆధునిక యువతులు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. ఆకాశంలో,అవకాశాల్లో తమ ముద్రతో ప్రగతిపథాన సాగుతున్నారు. క్రీడల్లోనూ ఎదుగుతూ పురుషులకు తామేమీ తీసిపోమనినిరూపిస్తున్నారు. ఆ కోవకు చెందిన యువతే అరుంధతి. భారత మహిళల టీ–20 జట్టులోకి ఎంపికయ్యింది. 21 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టనుంది. నగరంలోని సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీకి చెందిన అరుంధతిరెడ్డి ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఈ క్రమంలోక్రికెట్ ప్రపంచంలో తన ప్రస్థానం. అంచలంచెలుగా ఎదిగిన విధానం. ఎదుర్కొన్న ఇబ్బందులుమహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన విశేషాలను, అనుభవాలను పంచుకుందిలా.. - చైతన్య వంపుగాని అన్న ఆడుతుంటే చూసేదాన్ని.. అన్న రోహిత్ మంచి క్రికెటర్. ప్రతిరోజూ ఉదయం ప్రాక్టీస్‌కి వెళ్లేవాడు. అన్నవాళ్లు ఆడుతుంటే బయట నిలబడి ఆటను చూస్తూ బాల్స్ అందించేదాన్ని. ప్రాక్టీస్ అనంతరం పిల్లలందరం కలిసి గల్లీలో క్రికెట్ ఆడేవాళ్లం. మళ్లీ ఉదయం ప్రాక్టీస్‌కి వెళ్లేవాళ్లం. దీంతో క్రికెట్‌పై ఆసక్తి బాగా పెరిగింది.అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాలనే ఆకాంక్ష ఎక్కువైంది. ప్రతిరోజూ జింఖానాగ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసేదాన్ని. మిథాలీ బ్యాటింగ్ స్టైల్‌కు ఫిదా ఇండియన్ టీం కెప్టెన్ మిథాలీరాజ్ ఆటను చూస్తూ పెరిగాను. ఆమెను నేను అక్కా అని పిలుస్తా. రెండేళ్ల క్రితం సౌత్ సెంట్రల్ రైల్వేస్‌కు సెలెక్ట్ అయినప్పుడు మిథాలీ అక్కతో నాకు మరింత అనుబంధం పెరిగింది. కోచ్ మూర్తి సర్ కూడా 3, 4 గంటల పాటు మిథాలీ బ్యాటింగ్ ఎలా చేస్తుందో గమనించు, నేర్చుకో అని చెప్పేవారు. మిథాలీ అక్క షాట్లకు ఫిదా అయ్యాను. అమ్మ ప్రోత్సాహం మరువలేను.. మా అమ్మ పేరు భాగ్య. ఆమె మంచి వాలీబాల్ ప్లేయర్. ఆర్థిక పరిస్థితుల కారణంగా తను ఆటను మధ్యలో వదిలేసింది. ప్రస్తుతం టీచర్‌గా చేస్తోంది. నా ప్రాక్టీస్ కోసం తెల్లవారుజామున 3గంటలకు నిద్రలేచే వాళ్లం. ప్రాక్టీస్ 9.30 గంటల దాకా చేసేదాన్ని. మళ్లీ సాయంత్రం 4 గంటలకు గ్రౌండ్‌కు వచ్చేవాళ్లం. రాత్రి 7.30గంటల వరకు అమ్మ కూడా నాతోనే ఉండేది. అమ్మ నా కోసం ఎంతో కష్టపడింది. నేను ఈ స్థాయికి ఎదగడానికి ఆమె శ్రమ, ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇండియా ‘గ్రీన్’తో అందరి దృష్టిలో పడ్డా.. ఇటీవల జరిగిన ఉమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో ‘ఇండియా గ్రీన్’ టీంలో ఆడాను. ‘ఇండియా బ్ల్యూ’ టీంలో మిథాలీ ఉన్నారు. ఓ మ్యాచ్‌లో నేను మిథాలీని బౌల్డ్ చేశాను. అన్ని మ్యాచ్‌ల్లో రాణించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాను. దీంతో భారత టీ20 జట్టులో అవకాశం దక్కింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లివే.. ఇప్పటి వరకు అండర్– 19, 23, సీనియర్స్, సీనియర్ జోనల్స్, ఛాలెంజర్స్, ఇండియా ‘ఎ’, సౌత్ సెంట్రల్ రైల్వేస్ మ్యాచ్‌లలో ఆడాను. వీటన్నింటిలో ఆల్‌రౌండర్ ప్రతిభను కనబరిచా. సెప్టెంబర్ 19 నుంచి శ్రీలంకలో టీ20 సిరీస్ ఉంది. వీటిలో సత్తా చాటి మున్ముందు వన్డేల్లోకి కూడా ఎంపికవుతాననే నమ్మకముంది. అనన్య మెసేజ్‌తో సర్ప్రైజ్ ఈ నెల 23న ఎప్పటిలాగానే క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్లి ప్రాక్టీస్ చేశా. సాయంత్రం 6.30గంటలకు ఇంటికి బయలుదేరుతూ.. టేబుల్లో ఉన్న ఫోన్ తీసి చెక్ చేస్తుంటే నా స్నేహితురాలు అనన్య ఉపేంద్ర నుంచి మెసేజ్ వచ్చింది. ‘కంగ్రాట్స్ డియర్.. యూ ఆర్ సెలక్టెడ్ ఇన్ ఇండియా టీ20 టీమ్’ అని ఉంది. ఒక్కసారిగా కళ్లు చెమర్చాయి. ఆ వెంట వెంటనే ఎనిమిది మంది నుంచే కంగ్రాట్స్ మెసేజెస్ వచ్చాయి. వెంటనే అమ్మకు ఫోన్ చేసి ‘అమ్మా.. నేను ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యానని చెప్పాను’. ఆ తర్వాత కెనడాలో ఉన్న అన్న రోహిత్‌కి ఫోన్ చేసి చెప్పాను. ఇంటికి వెళ్లేసరికి బంధువులు, స్నేహితులు ఫ్లవర్ బొకేస్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. మహిళా క్రికెట్‌కు ఆదరణ.. మహిళా క్రికెట్‌పై అందరిలోనూ ఆదరణ పెరుగుతోంది. చాలామంది అమ్మాయిలు క్రికెట్ వైపు చూస్తున్నారు. అరుంధతికి ఎన్నో సలహాలు ఇచ్చాను. ఆమె అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నా పేరు ఒక్కటే వినిపించేది. ఇప్పుడు నాతో పాటు అరుంధతి పేరు అంతర్జాతీయంగా వినిపించడం ఎంతో ఆనందంగా ఉంది. అరుంధతిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎంతో మంది ముందుకు రావాలి.– మిథాలీరాజ్, భారత మహిళల వన్డేజట్టు కెప్టెన్ నాకెంతో గర్వంగా ఉంది అరుంధతి అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికవ్వడం నాకెంతో గర్వంగా ఉంది. రెండేళ్ల పాటు సౌత్‌సెంట్రల్ రైల్వేస్ తరఫున ఆడిన సమయంలో తన పట్టుదలను పసిగట్టాను. కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్ ఎంపికవుతుందనే నమ్మకం వచ్చింది. మిథాలీ తర్వాత అరుంధతి ఇండియన్ జట్టులో చోటు సంపాదించడం సంతోషంగా ఉంది. – రాయప్రోలు మూర్తి, కోచ్ -
అమ్మోరు... అరుంధతి తరహాలో...
‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ చిత్రాలతో విజువల్ వండర్స్‌ని రూపొందించిన శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘నాగ భరణం’. జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారీ నిర్మించారు. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్న ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘దివంగత కన్నడ స్టార్ విష్ణువర్థన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ చిత్రంలో చూపించడం అద్భుతం. ‘బాహుబలి’కి విజువల్ ఎఫెక్ట్స్‌ని అందించిన మకుట సంస్థ ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించింది. అమ్మోరు, అరుంధతి చిత్రాలు మహిళల్ని ఎంతలా ఆకట్టుకున్నాయో ‘నాగభరణం’ కూడా అంతలా ఆకట్టుకుంటుంది. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరిగాయి. పాము నేపథ్యంలో సాగుతుందీ కథ. ఓవర్సీస్తో పాటు 500 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది’’ అని చెప్పారు. -
ప్రిక్వార్టర్స్‌లో సిరిల్ వర్మ
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మతోపాటు మహారాష్ట్ర అమ్మారుు అరుంధతి పంతవానె ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సిరిల్ 21-7, 21-11తో ఆండ్రీ జదనోవ్ (రష్యా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అరుంధతి 21-5, 21-9తో అనస్తాసియా షరపోవా (రష్యా)పై గెలిచింది. భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో అరుంధతితో రుత్విక శివాని; ఎకతెరీనా కుట్ (రష్యా)తో తన్వీ లాడ్; మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)తో సిరిల్ వర్మ తలపడతారు. రుత్విక, తన్వీలకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన-పూర్వీషా రామ్ జంట, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ గురువారం బరిలోకి దిగుతారుు. పోరాడి ఓడిన కృష్ణప్రియ మరోవైపు బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు శ్రీ కృష్ణప్రియ తొలి రౌండ్లో పోరాడి ఓడింది. క్వాలిఫరుుంగ్ ద్వారా మెరుున్ ‘డ్రా’లో అడుగుపెట్టిన శ్రీ కృష్ణప్రియ మొదటి రౌండ్లో 17-21, 21-16, 15-21తో సుసాంతో యులియా యోసెఫిన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. -
ఎస్బీఐ చీఫ్ అరుంధతి పదవీకాలం ఏడాది పొడిగింపు!
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్‌గా అరుంధతీ భట్టాచార్య పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. నిజానికి ఆమె మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగిసింది. భారతీయ మహిళా బ్యాంక్‌సహా 5 ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం 2017 మార్చితో ముగియాలన్న లక్ష్యం నేపథ్యంలో పదవీకాలం పొడిగింపు ఊహాగానాలు కొనసాగాయి. మాతృసంస్థలో విలీనం అవుతున్న ఐదు అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లు ఉన్నాయి. మరో రెండు అనుంబంధ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాల విలీనానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం విదితమే. -
అమ్మాళీ... ఎంత బొమ్మాళీ!!!! వదలా నిన్నొదలా...
ఉత్తమ విలన్ ‘అరుం.... అరుంధతా? అమ్మాళీ... ఎంత బొమ్మాళీ! పిందె పండైందే... అమ్మ బొమ్మాలే... నిన్ను చంపి ముక్కలు చేయాలని వచ్చానే. కానీ నిన్ను చంపా. ఏడు సంవత్సరాలు ఆడగాలి కరువైన ఈ పిశాచికి ఇంత అందాల బొమ్మ ఎదురుపడుతుందని నేను అనుకోలేదు’ ‘అరుంధతి’ సినిమాలో అఘోరా గొంతు నుంచి డైలాగులు వినిపిస్తున్నప్పుడు రోమాలు నొక్కబొడుచుకుంటాయి. అఘోర... ఎంత శక్తివంతమైన విలన్! ‘వాడి నాలుక మరణశాసనం. వాడి చేతులు యమపాశాలు. ఎంత బలవంతుడైనా వాడిని ఎదురించలేడు. ఏ ఆయుధమూ వాడిని సంహరించలేదు’ ‘అరుంధతి’ సినిమా కథ తయారవుతు న్నప్పుడే నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి దృష్టిలో తమిళ నటుడు పశుపతి ఉన్నాడు. కామెడీ అయినా, కర్కశత్వమైనా... పశుపతి రామస్వామి తాను చేస్తున్న పాత్రను అద్భుతంగా పండించ గలడు. అందుకే విలన్ పేరుకు ‘పశుపతి’ అని పేరు పెట్టుకున్నాడు. ‘అఘోర’ పాత్రలో పశుపతి జీవించడం ఖాయం! కానీ... ఒక పెద్ద డౌటు వచ్చింది. ‘అరుంధతి’లో విలన్ పశుపతిగా, అఘోరగా నటించాలి. అఘోరగా పశుపతి ఓకే. మరి ‘పశుపతి’ పాత్రలో పశుపతి? నాట్ ఓకే! ‘పశుపతి’ పాత్రలో రాచరికం ఉట్టి పడాలి. రాచరికంతో కూడిన క్రౌర్యం ఉట్టిపడాలి. ఎందుకో ఆ పాత్రకు పశుపతి సరియైన ఎంపిక కాదనిపించిది.విలన్‌గా పశుపతి పేరు కొట్టేశాడు. విలన్ పేరును మాత్రం కొట్టేయలేదు. విలన్ పేరు పశుపతే! ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమా చూశాడు శ్యాంప్రసాద్‌రెడ్డి. ఆ సినిమాలో ‘కేకే’గా సోనూ సూద్ విలనిజం రెడ్డిని ఆకట్టుకుంది. అలా తన ‘అరుంధతి’ సినిమాకు విలన్‌గా సోనూ సూద్‌ను అనుకున్నాడు. అయితే పశుపతి క్యారెక్టర్ స్కెచ్‌లు చూసిన సోనూ సూద్ ఆ పాత్రను పెద్దగా ఇష్టపడలేదు. అయితే నిర్మాత ఆసక్తి, ఉత్సాహం చూసి నటించడానికి ఒప్పుకున్నాడు. పశపతి పాత్రకుగానూ ఛాతి, పొట్టపై మంత్రాల టాటూలు వేసుకోవాల్సి వచ్చింది సోనూ సూద్. మేకప్‌కు రోజూ... మూడు గంటల సమయం పట్టేది. అఘోర మేకప్ ఒక ఎత్తయితే... సోనూ నటన మరొక ఎత్తు. ‘అరుంధతి’ విడుదైన తరువాత ఎక్కడ చూసినా ‘అమ్మాళీ... బొమ్మాళీ’ డైలాగే! ‘పశుపతి’ పాత్రలో రాచరికపు అహాన్ని, ‘అఘోరా’లోని భయానకాన్ని సమానస్థాయిలో ప్రదర్శించి ప్రేక్షకలోకంలో జేజేలు అందుకున్నాడు సోనూ. ‘బెస్ట్ విలన్’గా నంది అవార్డ్ కూడా అందుకున్నాడు. పంజాబ్‌లోని మోగ నగరం సోనూ సూద్ స్వస్థలం. చదువుల కోసం నాగపూర్‌కు వచ్చిన సోనూ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్‌లు చేసేవాడు. ఆ సమయంలోనే సినిమాల్లో నటించాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1999లో ‘కుళ్లళగర్’ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. 2000 సంవత్సరంలో శివనాగేశ్వర్రావు దర్శకత్వం వహించిన ‘హ్యాండ్సప్’ అనే సినిమాలో నటించాడు. బాలీవుడ్ సినిమాల్లో నటించాలని కలలు కన్న సోనూకు ఆ కల అంత తొందరగా నెరవేరలేదు. 2002లో మాత్రం ‘షాహీద్-ఏ-ఆజామ్’ అనే బాలీవుడ్ సినిమాలో భగత్‌సింగ్ పాత్ర పోషించే అవకాశం లభించింది. మణిరత్నం ‘యువ’ సినిమాలో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. ‘సూపర్’ సినిమాలో హైటెక్-రాబర్ సోనూ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సోనూ సూద్. తెలుగులో ‘అరుంధతి’ ఆయన విలనిజాన్ని తారస్థాయికి తీసుకెళితే, ‘దబాంగ్’లో చేడిసింగ్ పాత్రతో విలనిజంలో ఎంత భిన్నత్వాన్ని చూపవచ్చో నిరూపించాడు సోనూ సూద్. నట విద్యాలయంలో సోనూ సూద్ చదువుకుంది నెలరోజులు మాత్రమే... అయితే కెమెరా మాత్రం అతడికి సంవత్సరాలకు సరిపడేంత పాఠాలు నేర్పింది. అందుకే.. సోనూ సూద్ అనే పేరు వినబడగానే స్పందనగా ‘ఉత్తమ విలన్’ అనే మాట కూడా వినబడుతుంది. -
దెయ్యంగా అరుంధతీ
చెన్నై: తమిళ, కన్నడ చిత్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అరుంధతీ ఇక తెలుగులో అడుగుపెడుతోంది. ఆమె త్వరలో అల్లరి నరేశ్ నటించనున్న చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందట. ఇందులో దెయ్యం పాత్రలో అరుంధతీ భయపెట్టనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అల్లరి నరేశ్ హీరోగా హర్రర్, కామెడీ చిత్రం ’ఇంట్లో దెయ్యం నాకేంటి భయ్యం’ నిర్మాణం జరుగుతోంది. ’అరుంధతీని ఈ వారం మొదట్లో ఖరారు చేశాం. ఈ చిత్రంలో ఆమె సెకండ్ రోల్ పోషిస్తోంది. దెయ్యం పాత్రను పోషించనుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉండే పాత్ర’ అని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. -
మహాలక్ష్మి
ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందంటారు. అది మన సంస్కృతి... మన సంప్రదాయం. తల్లిదండ్రులకే కాదు... ఒక వ్యవస్థకే అరుంధతి వరమైంది. భారతీయ స్టేట్ బ్యాంకును ప్రాఫిట్ బాట పట్టించింది. భారతీయులనే ఆ మాట అక్షరాలా నిజమైంది. మహాలక్ష్మి స్వరూపం అరుంధతిలో ఉంది. ‘ఏడు’ అరుంధతికి కలిసి వస్తుందా? కలిసొస్తే గనుక ఆమె ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ అవుతారని అనుకోవచ్చు. ’77లో ఆమె ఎస్.బి.ఐ.లో చేరారు. మూడేళ్ల క్రితం 7వ తేదీన (అక్టోబర్) ఎస్.బి.ఐ. ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు! ఇప్పుడిక రాజన్ నిష్ర్కమణ తర్వాత ఆర్.బి.ఐ. గవర్నర్ పదవికి ఏడుగురిలో ఒకరిగా బరిలో ఉన్నారు. ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో 18వ అంతస్థులో ఉన్న తన ఆఫీస్‌కి ‘ఎలివేటర్స్’లో కాకుండా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ చేరుకున్న ఈ బ్యాంకింగ్ రంగ నిర్వహణా దక్షురాలు.. తను కూర్చున్న ఎత్తుకు మించి ఎస్.బి.ఐ.ని తీసుకెళ్లారు. అంతకుమించిన ఎత్తులో మహిళల శక్తి సామర్థ్యాలను.. ఒక దివిటీలా నిలబెట్టారు. 1977 టు 2016. దాదాపు 40 ఏళ్లు! ఒకే సంస్థలో ఉద్యోగం. ఒకే సంస్థలో అనేక హోదాలు. ఒకే సంస్థలో పోటీలు. ఒకే సంస్థలో దేశవిదేశాలకు బదిలీలు. కానీ.. 22 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎంత ఉత్సాహంగా ఉన్నారో... ఈ 60 ఏళ్ల వయసులో ఇవాళ్టికీ అంతే ఉత్సాహంగా ఉన్నారు అరుంధతీ భట్టాచార్య. క్షణం తీరికలేకుండా పనిలో పడిపోవడం ఆమె విజయ రహస్యం. ఆత్మవిశ్వాసం అందులోని అంతర్ రహస్యం. మొదటిదీ, చివరిదీ? కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ. డిగ్రీ ఫైనల్ ఇయర్. హాస్టల్లో ఉంటున్నారు అరుంధతి. ఒకరిద్దరు రూమ్మేట్స్. గుట్టలకొద్దీ కాంపిటీటివ్ బుక్స్. గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు. క్యాంపస్ సెలక్షన్స్‌లో జాబ్ కొట్టేశారు అరుంధతి! అదే ఆమె మొదటి ఉద్యోగం. బహుశా చివరిది కూడానేమో! ఎస్.బి.ఐ.లో పుట్టి, ఎస్.బి.ఐ.లో పెరిగి, ఎస్.బి.ఐ.లో పదవీ విరమణ దగ్గరకు వచ్చేశారు అరుంధతి. ఒకవేళ ఆర్.బి.ఐ. గవర్నర్‌గా ఆమెకు చాన్స్ వస్తే అది రెండో ఉద్యోగం అవుతుంది. ఛైర్‌పర్సన్‌గా తొలిరోజు ఎస్.బి.ఐ. ఛైర్‌పర్సన్‌గా అరుంధతి తొలిరోజు రెప్ప మూసి తెరిచేలోపు పూర్తయింది! 208 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక అతి పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుకు ఛైర్పర్సన్ అయిన ఉద్వేగభరిత భావనలోకి మునిగిపోకుండా, పనులన్నీ ఆమెను ముంచేశాయి. మర్నాడే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మీటింగ్. దానికి అటెండ్ అవ్వాలి. పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఇక నుంచీ జీవితం ఇలాగే ఉండబోతోందా అని అనుకోడానికైనా ఆ రోజు టైమ్ దొరకలేదు అరుంధతికి. 1977లో ఉద్యోగంలో చేరిన మొదటి రోజు కూడా అరుంధతికి ఇలాగే గడిచింది. చెక్కులను చెక్ చేసి, నోట్ చేసే పని అప్పగించారు ఆమెకు. అవి దుర్గాదేవి పండుగ రోజులు. మర్నాడు బ్యాంకు సెలవు కావడంతో డబ్బు తీసుకోడానికి వచ్చిన కస్టమర్లతో బ్యాంకు కిక్కిరిసిపోయింది. ఆ సీన్ చూసి అప్పుడే అనుకున్నారు అరుంధతి. ఏదైనా చేయాలని. ఏదైనా అంటే... కస్టమర్లకు సులువుగా ఉండేదీ, బ్యాంకు సిబ్బందికి స్ట్రెస్‌ను తగ్గించేది. జర్నలిస్టు అవాలనుకున్నారు! బ్యాంకులో వచ్చిందని చేరారు తప్ప, బ్యాంకులోనే చేరాలని చేరలేదు అరుంధతి. జర్నలిజం ఆమె ఫస్ట్ ఆప్షన్. ఎప్పటికైనా ఒక గొప్ప పుస్తకం రాయడం ఆమె కల. ఎం.ఎ.లో అరుంధతిది ఇంగ్లిష్ లిటరేచర్. లెక్క ప్రకారం అయితే ఆమె ఇంజినీర్ అవాలి. తండ్రి భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఇంజినీర్ కాబట్టి. ఆయన ‘‘నీ ఇష్టం’’అన్నారు. అరుంధతి లిటరేచర్లోకి వచ్చేశారు. అరుంధతి కలకత్తాలో, బొకారోలో చదువుకున్నారు. ఐదో తరగతి వరకు ఆమె మామూలు అమ్మాయి. బొకారోలోని సెయింట్ జేవియర్స్‌లో చేరాక తెలివైన అమ్మాయి అయింది. అందరూ కలిసి ఆఫీస్‌కి పంపారు! ఉద్యోగం చాలావాటిని మిస్ చేస్తుంది. ఫ్రెండ్స్ బర్త్ డే లని, పెళ్లిళ్లనీ, పర్సనల్ లైఫ్‌ని, ముఖ్యంగా అమ్మానాన్నల్ని. బ్యాంకర్ అయ్యాక వీటన్నిటినీ పోగొట్టుకున్నారు అరుంధతి. అయితే బాధతో పోగొట్టుకోలేదు. బాధ్యతల వల్ల పోగొట్టుకున్నారు. సుకృతి పుట్టాక (ఇప్పుడామె వయసు 21) ప్రితిమోయ్ భట్టాచార్య రంగంలోకి దిగారు. అరుంధతి భర్త ఆయన. ఖరగ్‌పూర్ ఐ.ఐ.టి.లో ప్రొఫెసర్. అతడు ఆమెకు సపోర్ట్‌గా ఉన్నారు. కూతురితో పాటు అరుంధతి కూడా చకచకా ఎదుగుతోంది. ఆ సమయంలో తల్లికి, కూతురికి మధ్య ఉద్యోగం; తల్లికి, ఉద్యోగానికి మధ్య కూతురు ఒక నిర్బంధ బంధమై అడ్డుపడకుండా అరుంధతి కుటుంబ సభ్యులంతా తలా ఒక చెయ్యి వేసి ఉయ్యాల ఊపారు. తలా ఒక పని అందుకుని ఆమెను ఆఫీసుకు పంపారు. భర్త-కూతురు-తల్లిదండ్రులు... ఈ ముగ్గురి మధ్య ఉన్న అవగాహన.. అరుంధతి దేన్నైనా సాధించగల శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చింది. పాపను వదిలి న్యూయార్క్‌లో! బ్రాంచి ఫెర్ఫార్మెన్స్ ఇన్చార్జిగా అరుంధతి న్యూయార్క్ వెళ్లినప్పుడు సుకృతి రెండేళ్ల పిల్ల. పాపను చూసుకోడానికని అరుంధతి పిన్నిగారు కూడా ఆమె వెంట న్యూయార్క్ వెళ్లారు. కొన్నాళ్లు అక్కడ ఉన్నారు. అయితే వీసా పొడిగింపు రాకపోవడంతో ఆ పిన్నిగారు వెనక్కి రావలసి వచ్చింది. కూతుర్ని ఆమెకు ఇచ్చి కలకత్తా పంపడం తప్ప వేరే దారి లేకపోయింది అరుంధతికి. కలకత్తాలో పాపను ఆపడం కష్టమైంది. ఆ విషయం తెలిస్తే అరుంధతి ఎక్కడ తల్లడిల్లిపోతుందోనని పిన్నిగారు పాపను బొకారోకి తీసుకెళ్లారు. అక్కడ అరుంధతి తల్లి, సోదరితో పాటు పిన్నిగారు పాప ఆలనపాలన చూసుకున్నారు. ‘‘మా పిన్ని రుణం తీర్చుకోలేను’’ అని ఇప్పటికీ అంటుంటారు అరుంధతి. తనేమిటో చూపించారు 2009. బ్యాంకింగ్ రంగంలో అరుంధతి తన తడాఖా చూపించిన సంవత్సరం. ఆ ఏడాది ఆమె ఎస్.బి.ఐ. చీఫ్ జనరల్ మేనేజర్ అయ్యారు. కొత్తగా జనరల్ ఇన్సూరెన్స్, మొబైల్ బ్యాంకింగ్ ఆప్షన్లను తీసుకొచ్చారు. మొబైల్ బ్యాంకింగ్ ఎంతగా హిట్ అయిందంటే.. ఎస్.బి.ఐ. లాభాలను అది విపరీతంగా పెంచేసింది! ఆ తర్వాత ‘ఇన్-టచ్’ టెక్నాలజీ, ‘క్యాష్‌లెస్ బ్రాంచి’ వంటివాటిని అరుంధతి ప్రవేశపెట్టారు. ఖాతా తెరవడానికి బ్యాంకు వరకు రాకుండా ‘కియోస్క్’లు ఏర్పాటు చేశారు. ఫొటో, ఫింగర్ ప్రింట్స్, డాక్యుమెంట్స్.. వీటిని స్కాన్ చేస్తే చాలు... డిజిటల్ సిగ్నేచర్‌తో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. యూత్ అప్పటికే డిజిటల్ వరల్డ్‌లో జీవిస్తోంది. బ్యాంకుకు వెళ్లడం, క్యూలలో గంటలు గంటలు నిలుచోవడం.. వాళ్లకు ఇష్టం ఉండదు. అందుకని అరుంధతే వాళ్ల డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిపోయారు. హాయిగా, తీరిగ్గా నాలుగు కీబోర్డ్ బటన్లేవో నొక్కితే చాలు పని అయిపోయేలా ఎస్.బి.ఐ.ని టెక్నాలజీతో అప్డేట్ చేశారు. ఆధునికతకు, ప్రాచీనతకు పొంతన ఉండదు. కానీ చిత్రంగా ఇవి రెండూ అరుంధతి దగ్గర చక్కటి సమన్వయంతో ఒద్దికగా ఉంటాయి. ప్రొఫెషన్లో అరుంధతి మోడ్రన్. వ్యక్తిగతంగా ఆమె ఇష్టపడేది ప్రాచీనత. అరుంధతికి మ్యూజియంలు అంటే ఆసక్తి. పురావస్తువులను, పాతకాలం నాటి కళాకృతులను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వాటికి సంబంధించిన పుస్తకాలను కూడా ఇష్టంగా చదువుతుంటారు. మహిళకు గుర్తింపు.. మరీ అంత తేలిక కాదు! అరుంధతి వారానికి ఏడు రోజులు పనిచేయాల్సిందే. బాధ్యతలు అలాంటివి. సెలవులు ఉన్నా, తీసుకోడానికి ఉండదు. ఆమె వృత్తి నిబద్ధత అలాంటిది. మరి పని ఒత్తిడి నుంచి ఆమె ఎలా రిలాక్స్ అవుతారు? పుస్తకాలు. సంగీతం. చిన్న చిన్న విరామాల్లో ఒకేసారి ఆమె రెండు మూడు పుస్తకాలు చదివేస్తారు. మొదట్లో ఫిక్షన్ చదివేవారు. ఇప్పుడు నాన్ఫిక్షన్ను ఇష్టపడుతున్నారు. తరచు కొత్త కొత్త రెస్టారెంట్లకు వెళుతుంటారు. ఆమె పరిపూర్ణమైన భోజన ప్రియురాలు. ఇష్టం లేనివి, ఇష్టం ఉన్నవి అంటూ ఏవీ లేవ ని ఆమే చెబుతుంటారు. ఇక ఈ నాలుగు దశాబ్దాల కెరీర్లో అనుభవం మీద అరుంధతి తెలుసుకున్నది ఏమిటంటే.. ప్రతిభ మాత్రమే గుర్తింపు తెస్తుందనీ, మహిళలైతే ఎంత ప్రతిభ ఉన్నా గుర్తింపు కోసం మరింతగా కష్టపడవలసి ఉంటుందనీ! మరికొన్ని విశేషాలు ⇒ఫోర్బ్స్ ‘100 మోస్ట్ పవర్ఫుల్ ఉమన్’ జాబితాలో అరుంధ తీ భట్టాచార్య ఈ ఏడాది 25వ స్థానంలో ఉన్నారు. నిరుడు 30 వ స్థానంలో ఉన్నారు. ⇒ గత మూడేళ్ల ఎస్.బి.ఐ. లాభాలు కేవలం అరుంధతి ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల సాధ్యమైనవే. ⇒అరుంధతికి ఇంగ్లిష్‌లో చక్కటి ప్రావీణ్యం ఉంది. ⇒ఎస్.బి.ఐ. 208 ఏళ్ల చరిత్రలో ఛైర్పర్సన్ అయిన తొలి మహిళ అరుంధతి. ముగ్గురు పురుష సమఉజ్జీలను దాటుకుని ఆమె ఈ అత్యున్నత హోదాను సాధించారు. ⇒మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయకుండానే, బ్యాంకింగ్ రంగాన్ని వ్యాపార దక్షతతో నడుపుతున్నారు అరుంధతి. ⇒ఎస్.బి.ఐ.లోని తన 39 ఏళ్ల కెరియర్లో అరుంధతి.. ఫారిన్ ఎక్స్ఛేంజి, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్... ఇలా మొత్తం 11 బాధ్యతలను ఏక కాలంలో 11 ఉద్యోగాల్లా విజయవంతంగా నిర్వహించారు. ⇒అతికొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే.. 2006లో ఒకసారి ఉద్యోగం వదిలేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు అరుంధతి! అందుకు కారణం.. వాళ్ల అమ్మాయిని చదివించడానికి మంచి స్కూలు దొరక్కపోవడమే. అప్పుడామె లక్నోలో జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. ఆమె బాస్ ఎం.ఎస్.వర్మ కల్పించుకుని ‘అది మంచి ఆలోచన కాదేమో’ అనడంతో ఆమె ఆ ఉద్యోగంలో కొనసాగారు. అరుంధతీ భట్టాచార్య (60), ఎస్.బి.ఐ. ఛైర్పర్సన్ జన్మస్థలం : కోల్‌కతా జన్మదినం : 18 మార్చి 1956 చదువు : ఇంగ్లిష్ లిటరేచర్ కొలువు : ఎస్.బి.ఐ. తల్లిదండ్రులు : {పద్యుత్ కుమార్ ముఖర్జీ (భిలాయ్ స్టీల్ ప్లాంట్ పూర్వపు ఉద్యోగి) కల్యాణి ముఖర్జీ (హోమియోపతి కన్సల్టెంట్) తోబుట్టువు : అదితి బసు (అక్క) భర్త : {పితిమోయ్ భట్టాచార్య (ఐఐటి, ఖరగ్‌పూర్ మాజీ ప్రొఫెసర్) కూతురు : సుకృతి -
పోలీస్ అధికారిణిగా సిమ్రాన్
నట నారీమణులు పోలీస్ అధికారిణులుగా నటించడం సినిమాకు కొత్తేమీ కాదు.కర్తవ్యం(తమిళంలో వైజయంతి ఐపీఎస్) విజయశాంతి న్యాయం, ధర్మం కోసం వీరోచిత పోరాటం చేసి విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. అలాగే నటి టబు, గౌతమి, స్నేహ లాంటి కథానాయికలు పోలీస్ అధికారిణి పాత్రలు పోషించిన వారే. కాగా తాజాగా నటి అరుంధతి వారి బాటలో నడుస్తున్నారు. నేట్రు ఇండ్రు చిత్రంలో అందాలను విచ్చల విడిగా ఆర బోసిన అరుంధతి ఆ మధ్య నాయిగళ్ జాగ్రత్తైచిత్రంలో నాయికగా మెరిసింది. ఇప్పుడు అర్ధనారి అనే చిత్రంలో అండర్ కవర్ పోలీస్ అధికారిణిగా ఒక పవర్ఫుల్ పాత్రలో తెరపైకి రానుంది. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్ర హీత బాలా శిష్యుడు సుందర ఇలంగోవన్ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో ఒక ఎసైన్మెంట్లో భాగంగా అరుంధతి పోలీస్ అధికారిణిగా చాలా సాహసాలు చేసిందట. ఈ పాత్ర కోసం కొందరు నిజమైన పోలీస్ అధికారుల వద్ద శిక్షణ కూడా తీసుకున్నారట. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించినట్లు చిత్ర దర్శకుడు తెలిపారు. -
మాకూ అవకాశం ఇవ్వండి
మా గురించి కాస్త ఆలోచించండి అంటున్నారు నటి అనుష్క. మనకున్న అతి కొద్ది మంది నటనా సత్తా ఉన్న నటీమణుల్లో అనుష్క ఒకరని నొక్కివ క్కాణించవచ్చు. ఆదిలో ఆట బొమ్మగా కొన్ని చిత్రాల్లో కనిపించినా, ఆ తరువాత తనలోని ప్రతిభను వెలికి తీసే పాత్రల్లో దుమ్మురేపారు. ఉదాహరణకు ఒక్క అరుంధతి చాలు నటిగా అనుష్క సత్తా ఏమిటో చెప్పడానికి. త్వరలో రుద్రమదేవిగా వెండితెరపై విజృంభించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో పలు సాహసాలు చేసిన అనుష్క గుర్రపు స్వారీలు, కత్తిసాములు చేశారు. ఆమె వీరోచిత దృశ్యాలు త్వరలో సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నాం. అలాగే ద్విభాషా చిత్రం ఇంజిఇడుప్పళగి (తెలుగులో సైజ్ జీరో) చిత్రంలోని పాత్ర కోసం వంద కిలోల బరువు పెంచుకుని నటిస్తున్న నటి అనుష్క. అలాంటి నటి కొంచెం మాగురించి కూడా ఆలోచించండి అంటూ దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి చేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? దాని వెనుక ఆమె కళాతృష్ణ ఉందని భావించాలి. లేక కొన్ని పాత్రలు నిరాశ పరచి ఉండవచ్చు. ఏది ఏమైనా ఆమె అభ్యర్థనలో అర్థం ఉంది. తమిళ,తెలుగు చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువేనన్నది అంగీకరించి తీరాల్సిందే. ఎప్పుడో ఒకసారి నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తుంటాయి. మలయాళంలో అలా కాదు. అక్కడ కథానాయకులతోపాటు కథానాయికీలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంతకు ముందు నటి విజయశాంతి హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకున్నారు. అలా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ, యాక్షన్ కథా చిత్రాల్లోనూ నటించడానికి తనలాంటి వారు సిద్ధంగా ఉన్నారు. మా గురించి కాస్త ఆలోచించండి అంటూ అనుష్క దర్శక నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారట. -
డబ్బులున్నా... ఇలాంటి ఆర్టిస్ట్‌లు లేకపోతే కొన్ని సినిమాలు తీయలేం!
- దర్శక, నిర్మాత గుణశేఖర్ అనుష్కతో నా పరిచయం - సినిమాల ద్వారానే! ఆమె సినిమాలు చూసినప్పుడు మంచి నటి అనుకున్నా. కానీ, కె. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మించిన ‘అరుంధతి’ చూశాక దిగ్భ్రమకు లోనయ్యా. నటిగా ఆ అమ్మాయిలో ఉన్న శక్తిసామర్థ్యాలనూ, లోలోపల దాగిన అపారమైన ప్రతిభనూ బయటపెట్టిన పాత్ర అది. రాణీ రుద్రమదేవి కథతో సినిమా తీయాలని 2002 నుంచి నాలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అయితే, ఆ పాత్రకు ఎవరు బాగుంటారన్నది ఒక పట్టాన తెగలేదు. కొత్తవాళ్ళను తీసుకొని, ఫోటోషూట్స్ చేశా. అప్పటికి అనుష్క గురించి నాకు ఆలోచన లేదు. ‘అరుంధతి’ చూశాక నా రుద్రమదేవి దొరికిందనిపించింది. ‘రుద్రమదేవి’కి సిద్ధమయ్యా. చిత్ర సమయంలో నాకు అర్థమైంది ఒకటే - అనుష్క దర్శకుల నటి, నిర్మాతల నటి. ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక ఆ పాత్రను పండించడం కోసం తన సమస్త శక్తియుక్తులూ ధారపోసే నటి. యూనిట్‌కు అంత సహకరించే నటిని మరొకరిని ఈ రోజుల్లో చూడలేం! ‘రుద్రమదేవి’ని తపస్సులా చేస్తున్నానని ఆమె గుర్తించారు. పాత్రను సవాలుగా తీసుకొని కత్తిసాము, గుర్రపుస్వారీ లాంటి కఠోర శిక్షణలన్నీ తీసుకున్నారు. పాత్రను నరనరాల్లో జీర్ణించుకొని, నటించారు. అది చూసి మంత్రముగ్ధుణ్ణయ్యా. ఏ ఆర్టిస్టుకైనా రూపురేఖలు చాలా ముఖ్యం. చేస్తున్న పాత్రకు తగ్గట్లుగా వాటిని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకోవడం ఆ ఆర్టిస్టు అంకితభావానికి ప్రతీక. యుద్ధం చేసే రాణీ రుద్రమదేవి పాత్రలో కనిపించడం కోసం ఆమె తన ఫిజిక్‌ను పెంచుకొన్నారు. అయిదు నెలల పాటు ఆ షూటింగ్ అయిపోగానే, కొద్దిగా విరామం తరువాత అందాల యువరాణి సన్నివేశాలను చిత్రీకరించాలి. అంతే! మూడే మూడు నెలల్లో మళ్ళీ అనుష్క చాలా అందంగా, నాజూగ్గా ఆ సన్నివేశాలకు తగ్గట్లు శరీరాన్ని తగ్గించుకున్నారు. అందుకు ఆమె పడిన శ్రమ మాటల్లో చెప్పలేనిది. నిజం చెప్పాలంటే, షెడ్యూల్ షెడ్యూల్‌కీ ఆమె నాలో స్ఫూర్తి నింపింది. షూటింగ్ కొంత అయ్యాక... నిజంగా అనుష్క లేకపోతే ఈ పాత్రను ఎవరు చేసేవాళ్ళు, సినిమా ఎలా చేసేవాణ్ణి అనిపించింది. సినిమాలకయ్యే బడ్జెట్, పెట్టే ఖర్చు, అయ్యే శ్రమ గురించి కాసేపు పక్కనపెడదాం. డబ్బులున్నప్పటికీ, ఇలాంటి ఆర్టిస్టు లేకపోతే ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ లాంటి కొన్ని సినిమాలు తీయలేం! అప్పట్లో ‘అరుంధతి’ చిత్రం కోసం దాదాపు మూడేళ్ళ పాటు అనుష్క పడిన కష్టం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘రుద్రమదేవి’గా యుద్ధ సన్నివేశాల్లో ఒక యాక్షన్ హీరోలా రకరకాల ఫీట్లు చేశారు. 150 అడుగుల ఎత్తున క్రేన్ మీద వేలాడుతూ ఉండేవారు. అలాగే, క్లైమాక్స్‌లో భాగంగా ఏడు కోటల ముట్టడి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు 40 రోజులు ఆమె కత్తియుద్ధాలు చేయాల్సొచ్చింది. కత్తి పట్టి తిప్పుతూ ఉండేసరికి, ముంజేతి దగ్గర గాయమైంది. డాక్టర్లు కత్తి తిప్పవద్దన్నా అనుష్క మాత్రం డూప్‌ని పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. ముంజేతికి ప్లాస్టర్ మీద ప్లాస్టర్ చుట్టుకొని, తానే స్వయంగా నటించారు. అంతటి అంకితభావం చాలా కొద్దిమందిలోనే మనం చూస్తాం! నిజం చెప్పాలంటే, మన దగ్గర చాలామంది హీరోయిన్లకు మంచి పాత్రలు చేయాలనే కోరికా ఉంది. చేసే సత్తా ఉంది. అలాంటి పాత్రలు వస్తే, చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారనడానికి అనుష్క ఒక మంచి ఉదాహరణ. ఆకలిగొన్న పులిలా ‘అరుంధతి’, ‘రుద్రమ దేవి’ పాత్రల్ని ఆమె పండించారు. అందుకే, నన్నడిగితే మిగతా హీరోయిన్లకు కూడా ఆమె స్ఫూర్తి ఆదర్శప్రాయం. వ్యక్తిగా కూడా ఆమెలో ఎన్నో సుగుణాలున్నాయి. సెట్స్‌లో అందరితో కలిసిపోతూ, అందరినీ కలుపుకొంటూ పోతుంటారు. ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తారు. స్టార్డమ్ వచ్చినా, అంత సాదాసీదాగా వ్యవహరించడం ఆమెలోని ప్రత్యేకత. ఆమె ఎప్పుడూ తోటి హీరోయిన్ల గురించో, ఇతరుల సినిమాల గురించో వ్యాఖ్యానించరు. అసూయపడరు. పోటీతత్త్వం ప్రదర్శిస్తూనే, అసూయ లేకపోవడమనే ఆ అరుదైన లక్షణం ఎవరైనా నేర్చుకోవాల్సిన అంశం. అనుష్క మంచి నటే కాదు మంచి మనిషి కూడా అనేది అందుకే. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు. - సంభాషణ : రెంటాల జయదేవ -
మేకింగ్ ఆఫ్ 'అరుంధతి'
-
అనుష్క అరుంధతి-2 కు అంతా సిద్ధం
-
వారి కోసమే ఈ చిత్రం
యూ సర్టిఫికేట్ చిత్రాలు చూసి బోర్ ఫీలయిన వారి కోసం తెరకెక్కించిన ఏ సర్టిఫికేట్ చిత్రం నేట్రు - ఇండ్రు చిత్రం అని దర్శకుడు పద్మమగన్ తెలిపారు. అమ్మువాగియనాన్ వంటి చక్కని చిత్రాన్ని రూపొందించిన ఈ దర్శకుడి తాజా చిత్రం నేట్రు - ఇండ్రు. విమల్, ప్రసన్న, రిచర్డ్, అరుంధతి, నందకి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం నిర్మాణంలో తానెదుర్కొన్న సమస్యల గురించి దర్శకుడు తెలుపుతూ అడవుల్లో రహస్యంగా తలదాచుకున్న ఒక వ్యక్తి కోసం ఒక బృందం బయలుదేరుతుందన్నారు. అక్కడ జరిగే సంఘటనల సమాహారమే చిత్ర కథ అని చెప్పారు. ఈ చిత్రానికి ముందు కూత్తు అనే టైటిల్‌ను నిర్ణయించామన్నారు. అయితే ఆ పేరు వేరొకరికి చెంది ఉండడంతో ఆయన టైటిల్ ఇవ్వడానికి చాలా మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారన్నారు. దీంతో నేట్రు ఇండ్రు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు. చిత్రంలో రెండు ఏనుగులను నటింపజేశానని వాటికి ఐదు లక్షలు డిమాండ్ చేయగా అంత మొత్తం చెల్లించానన్నారు. అయితే చిత్రీకరణనంతరం ఒక్క ఏనుగు సన్నివేశాలకు లెసైన్స్ ఇచ్చారని తెలిపారు. అలాగే ఒక బెల్లిడాన్స్ కోసం హైదరాబాద్ నుంచి అందమైన డ్యాన్సర్లను తీసుకొచ్చి చిత్రీకరించానని అయితే ఆ పాటను సెన్సార్ తొలగించిందని దర్శకుడు వెల్లడించారు. -
పాత్రకు తగిన నాయకి ముఖ్యం
కథాపాత్రలకు తగిన నాయకా నాయకిలు ముఖ్యం అంటున్నారు దర్శకుడు కేబుల్ శంకర్. ఈయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం తొట్టాల్ తొడరుం. తమన్, అరుంధతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యాక్షన్ సన్నివేశాలతో కూడిన ప్రేమకథా చిత్రం అని తెలిపారు. వినోదంపాళ్లు ఎక్కువగానే ఉంటుందన్నారు. చిత్రంలో కీలకంగాఉన్న హీరోయిన్ పాత్ర నటి అరుంధతిని ఎంపిక చేయాలని భావించిన ప్పుడు ఆమెతో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయాలని నిర్ణయించామన్నారు. దాన్ని బట్టి ఆ పాత్రకు ఆ హీరోయిన్ కరెక్టా కదా అని నిర్ణయిస్తామని చెప్పారు. అలా అన్ని విధాలుగా తొట్టాల్ తొడరుం చిత్రంలోని హీరోయిన్ పాత్రకు సరిగ్గా సరిపోతుందని నిర్ణరుుంచుకున్న తరువాతనే ఆమెను ఎంపిక చేశామని తెలిపారు. చిత్రంలో చాలా కాలం తరువాత విన్సెంట్ అశోకన్ విలన్‌గా ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. ఇది మీడియం బడ్జెట్ చిత్రం అయినా నిర్మాత తువర్ చంద్రశేఖర్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదన్నారు. భారీ చిత్రాలకు ఉపయోగించే హెలికామ్ కెమెరా అవసరం అవడంతో విదేశాల నుంచి రప్పించారని, ఈ కెమెరాలో చిత్రంలోని పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు దర్శకుడు వెల్లడించారు.