
పోలీస్ అధికారిణిగా సిమ్రాన్
నట నారీమణులు పోలీస్ అధికారిణులుగా నటించడం సినిమాకు కొత్తేమీ కాదు.కర్తవ్యం(తమిళంలో వైజయంతి ఐపీఎస్) విజయశాంతి న్యాయం, ధర్మం కోసం వీరోచిత పోరాటం చేసి విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. అలాగే నటి టబు, గౌతమి, స్నేహ లాంటి కథానాయికలు పోలీస్ అధికారిణి పాత్రలు పోషించిన వారే. కాగా తాజాగా నటి అరుంధతి వారి బాటలో నడుస్తున్నారు. నేట్రు ఇండ్రు చిత్రంలో అందాలను విచ్చల విడిగా ఆర బోసిన అరుంధతి ఆ మధ్య నాయిగళ్ జాగ్రత్తైచిత్రంలో నాయికగా మెరిసింది.
ఇప్పుడు అర్ధనారి అనే చిత్రంలో అండర్ కవర్ పోలీస్ అధికారిణిగా ఒక పవర్‌ఫుల్ పాత్రలో తెరపైకి రానుంది. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్ర హీత బాలా శిష్యుడు సుందర ఇలంగోవన్ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో ఒక ఎసైన్‌మెంట్‌లో భాగంగా అరుంధతి పోలీస్ అధికారిణిగా చాలా సాహసాలు చేసిందట. ఈ పాత్ర కోసం కొందరు నిజమైన పోలీస్ అధికారుల వద్ద శిక్షణ కూడా తీసుకున్నారట. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించినట్లు చిత్ర దర్శకుడు తెలిపారు.