
దెయ్యంగా అరుంధతీ
చెన్నై: తమిళ, కన్నడ చిత్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అరుంధతీ ఇక తెలుగులో అడుగుపెడుతోంది. ఆమె త్వరలో అల్లరి నరేశ్ నటించనున్న చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందట. ఇందులో దెయ్యం పాత్రలో అరుంధతీ భయపెట్టనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
అల్లరి నరేశ్ హీరోగా హర్రర్, కామెడీ చిత్రం ’ఇంట్లో దెయ్యం నాకేంటి భయ్యం’ నిర్మాణం జరుగుతోంది. ’అరుంధతీని ఈ వారం మొదట్లో ఖరారు చేశాం. ఈ చిత్రంలో ఆమె సెకండ్ రోల్ పోషిస్తోంది. దెయ్యం పాత్రను పోషించనుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉండే పాత్ర’ అని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.