
వారి కోసమే ఈ చిత్రం
యూ సర్టిఫికేట్ చిత్రాలు చూసి బోర్ ఫీలయిన వారి కోసం తెరకెక్కించిన ఏ సర్టిఫికేట్ చిత్రం నేట్రు - ఇండ్రు చిత్రం అని దర్శకుడు పద్మమగన్ తెలిపారు. అమ్మువాగియనాన్ వంటి చక్కని చిత్రాన్ని రూపొందించిన ఈ దర్శకుడి తాజా చిత్రం నేట్రు - ఇండ్రు. విమల్, ప్రసన్న, రిచర్డ్, అరుంధతి, నందకి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం నిర్మాణంలో తానెదుర్కొన్న సమస్యల గురించి దర్శకుడు తెలుపుతూ అడవుల్లో రహస్యంగా తలదాచుకున్న ఒక వ్యక్తి కోసం ఒక బృందం బయలుదేరుతుందన్నారు.
అక్కడ జరిగే సంఘటనల సమాహారమే చిత్ర కథ అని చెప్పారు. ఈ చిత్రానికి ముందు కూత్తు అనే టైటిల్‌ను నిర్ణయించామన్నారు. అయితే ఆ పేరు వేరొకరికి చెంది ఉండడంతో ఆయన టైటిల్ ఇవ్వడానికి చాలా మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారన్నారు. దీంతో నేట్రు ఇండ్రు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు. చిత్రంలో రెండు ఏనుగులను నటింపజేశానని వాటికి ఐదు లక్షలు డిమాండ్ చేయగా అంత మొత్తం చెల్లించానన్నారు. అయితే చిత్రీకరణనంతరం ఒక్క ఏనుగు సన్నివేశాలకు లెసైన్స్ ఇచ్చారని తెలిపారు. అలాగే ఒక బెల్లిడాన్స్ కోసం హైదరాబాద్ నుంచి అందమైన డ్యాన్సర్లను తీసుకొచ్చి చిత్రీకరించానని అయితే ఆ పాటను సెన్సార్ తొలగించిందని దర్శకుడు వెల్లడించారు.