
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అరుంధతి రెడ్డి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. సోమవారం యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్ బ్యాటర్ పూనమ్ వికెట్ తీసిన సంబరంలో అరంధతి అతిగా స్పందించింది.
ఆ బ్యాటర్‌ను గేలి చేసేలా అనుచితంగా ప్రవర్తించింది. దీనిపై సమీక్షించిన మ్యాచ్ రిఫరీ వర్ష నాగ్రే డబ్ల్యూపీఎల్ నియమావళి ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాగా విధించింది. ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి లీగ్‌లో బోణీ కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment