
ప్రిక్వార్టర్స్‌లో సిరిల్ వర్మ
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మతోపాటు మహారాష్ట్ర అమ్మారుు అరుంధతి పంతవానె ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సిరిల్ 21-7, 21-11తో ఆండ్రీ జదనోవ్ (రష్యా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో అరుంధతి 21-5, 21-9తో అనస్తాసియా షరపోవా (రష్యా)పై గెలిచింది. భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో అరుంధతితో రుత్విక శివాని; ఎకతెరీనా కుట్ (రష్యా)తో తన్వీ లాడ్; మిషా జిల్‌బెర్మన్ (ఇజ్రాయెల్)తో సిరిల్ వర్మ తలపడతారు. రుత్విక, తన్వీలకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో మేఘన-పూర్వీషా రామ్ జంట, మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ గురువారం బరిలోకి దిగుతారుు.
పోరాడి ఓడిన కృష్ణప్రియ
మరోవైపు బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మారుు శ్రీ కృష్ణప్రియ తొలి రౌండ్‌లో పోరాడి ఓడింది. క్వాలిఫరుుంగ్ ద్వారా మెరుున్ ‘డ్రా’లో అడుగుపెట్టిన శ్రీ కృష్ణప్రియ మొదటి రౌండ్‌లో 17-21, 21-16, 15-21తో సుసాంతో యులియా యోసెఫిన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది.