
అమ్మోరు... అరుంధతి తరహాలో...
‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ చిత్రాలతో విజువల్ వండర్స్‌ని రూపొందించిన శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘నాగ భరణం’. జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారీ నిర్మించారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్న ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘దివంగత కన్నడ స్టార్ విష్ణువర్థన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ చిత్రంలో చూపించడం అద్భుతం.
‘బాహుబలి’కి విజువల్ ఎఫెక్ట్స్‌ని అందించిన మకుట సంస్థ ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించింది. అమ్మోరు, అరుంధతి చిత్రాలు మహిళల్ని ఎంతలా ఆకట్టుకున్నాయో ‘నాగభరణం’ కూడా అంతలా ఆకట్టుకుంటుంది. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరిగాయి. పాము నేపథ్యంలో సాగుతుందీ కథ. ఓవర్సీస్‌తో పాటు 500 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది’’ అని చెప్పారు.