Nagabharanam
-
అమ్మోరు... అరుంధతి తరహాలో...
‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ చిత్రాలతో విజువల్ వండర్స్‌ని రూపొందించిన శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘నాగ భరణం’. జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారీ నిర్మించారు. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్న ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘దివంగత కన్నడ స్టార్ విష్ణువర్థన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ చిత్రంలో చూపించడం అద్భుతం. ‘బాహుబలి’కి విజువల్ ఎఫెక్ట్స్‌ని అందించిన మకుట సంస్థ ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించింది. అమ్మోరు, అరుంధతి చిత్రాలు మహిళల్ని ఎంతలా ఆకట్టుకున్నాయో ‘నాగభరణం’ కూడా అంతలా ఆకట్టుకుంటుంది. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరిగాయి. పాము నేపథ్యంలో సాగుతుందీ కథ. ఓవర్సీస్తో పాటు 500 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది’’ అని చెప్పారు. -
అప్పుడది దేవుడు లేని గుడితో సమానం!
‘‘ఏ సినిమానైనా గ్రాఫిక్స్ లేకుండా తీయొచ్చు. కానీ, ఒకప్పుడు కన్నీళ్లున్న సినిమాలు చూసిన జనం ఇప్పుడు ‘అవతార్’, ‘టైటానిక్’లు చూస్తున్నారు. ప్రపంచ స్థాయి సినిమా చూస్తున్న ప్రేక్షకుడు మంచి కథతో పాటు అదనపు హంగులు (గ్రాఫిక్స్) కోరుకుంటున్నాడు. అందుకే టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పు డు అప్డేట్ అవుతుంటాను’’ అని కోడి రామకృష్ణ అన్నారు. ‘అమ్మోరు’, ‘అంజి’, ‘అరుంధతి’ సినిమాలతో గ్రాఫిక్స్ పరంగా టాలీవుడ్ స్థాయిని పెంచిన దర్శకుడీయన. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘నాగభరణం’ ఈ నెల 14న విడుదల కానుంది. సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించిన ఈ సినిమాలో రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ - ‘‘ఓ పాము కథ ఇది. గత జన్మలో తీరని కోరికలను ఈ జన్మలో ఎలా తీర్చుకుందనేది సినిమా. తన ఆశయాన్ని సాధించలేని స్థితిలో ఆమె ఆరాధ్య దైవం శివుడు ఓ శక్తిని సృష్టించి పంపిస్తాడు. ఆ శక్తి విష్ణువర్ధన్ పాత్ర రూపంలో వస్తుంది. ఆ ఐడియా నిర్మాత సాజీద్దే. గ్రాఫిక్స్ లేకుండా ఈ సినిమా తీయాలనుకున్నా. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో సాజీద్ ఖర్చుకు వెనుకాడలేదు. గ్రాఫిక్స్ పేరుతో ఎంత ఖర్చుపెట్టినా నిర్మాతకు నష్టం కలగకుండా దర్శకుడు మినిమమ్ గ్యారెంటీ చూసుకోవాలి. మనం ఏం తీస్తున్నామనేది కూడా దర్శక-నిర్మాతలకు అవగాహన ఉండాలి. నిర్మాత సెట్లో లేకపోతే అది దేవుడి లేని గుడితో సమానం. నా విజయాలకు కారణం నిర్మాతలే. ఇప్పటివరకూ నా సినిమాలన్నీ మిగతా భాషల్లో అనువాదమయ్యాయి. కన్నడలో తీసిన ఈ సినిమా తెలుగులో అనువాదమైంది. మల్కాపురం శివకుమార్ 600 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అన్నారు. త్వరలో మా అమ్మాయి దీపు దర్శకురాలిగా పరిచయం కానుందని చెప్పారాయన. -
క్రియేటివిటీ కంటే కథే ముఖ్యం - దర్శకుడు కోడి రామకృష్ణ
‘‘ ఒక సినిమా తీయాలంటే దర్శకుడి క్రియేటివిటీ ఒక్కటే సరిపోదు. ఒక మంచి కథ ఉండాలి. ఆ కథను ఇష్టపడే, సినిమా అంటే ప్యాషన్ ఉండే నిర్మాత కావాలి. అప్పుడే ఆ సినిమా బాగా వస్తుంది’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. ‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన ఆయన తాజాగా కన్నడంలో తెరకెక్కించిన చిత్రం ‘నాగభరణం’. జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారీ నిర్మించారు. గురుకిరణ్ పాటలు స్వరపరిచారు. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటుడు సాయికుమార్, బిగ్ సీడీని తెలంగాణ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పాటల సీడీని దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేశారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ- ‘‘కన్నడ స్టార్ విష్ణువర్ధన్‌గారు నాకు మంచి ఫ్రెండ్. మీతో ఓ సినిమా చేస్తానని ఆయనకు కథ వినిపించా. ‘బాగుంది. రెండు నెలల్లో డేట్స్ ఇస్తా’ అన్నారు. నేను స్క్రిప్ట్ వర్క్ కోసం బ్యాంకాక్ వె ళ్లి వచ్చేలోగా ఆయన చనిపోయారు. అది నా దురదృష్టం. ఈ చిత్రం క్లయిమాక్స్‌లో గ్రాఫిక్స్‌లో విష్ణువర్ధన్‌గారిని చూపిద్దామని సాజిద్ నాకు చెప్పారు. దీంతో మకుట సంస్థ విజువల్ ఎఫెక్ట్స్‌లో ఆయన్ను తెరపై చూపించాం’’ అని చెప్పారు. ‘‘నాగదేవత ముఖ్య పాత్రలో ఇటీవల సినిమాలు రాలేదు. ‘నాగభరణం’ ఆ తరహా చిత్రం. ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఈ చిత్రం హక్కులు కొన్నా. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ నెల 14న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని మల్కాపురం శివకుమార్ అన్నారు. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గిరిధర్, సురేశ్ కొండేటి, బీఏ రాజు, చిత్ర సహనిర్మాత సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
జన్మజన్మల నాగబంధం
పూర్వజన్మలో కోల్పోయిన అనుబంధాలు, ఆప్యాయతలను ఓ యువతి మరు జన్మలో ఏవిధంగా సొంతం చేసుకోగలిగింది? నాగభరణంతో ఆమెకున్న సంబంధం ఏమిటి? అనే కథాంశంతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాగభరణం’. రమ్య ప్రధాన పాత్రధారి. జయంతి లాల్ గాడా సమర్పణలో సాజిద్ ఖురేషి, దవల్ గాడా, సోహైల్ అన్సారీ నిర్మించారు. తెలంగాణ, ఏపీ పంపిణీ హక్కులను దక్కించుకున్న మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ‘‘ఓ కీలక పాత్ర కోసం స్వర్గీయ కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా సృష్టించడం జరిగింది. ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలకు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అందించిన మకుట సంస్థ ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సృష్టిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నా యి.’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సలావుద్దీన్ యూసఫ్, షబ్బీర్ హుస్సేన్. -
నాగభరణం ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
-
నాగభరణం ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో గ్రాఫికల్ వండర్స్ తెరకెక్కించాలంటే దర్శకుడిగా రాజమౌళి పేరునే సూచిస్తారు. అయితే రాజమౌళి కన్నా ముందే తెలుగు సినిమాకు అద్భుతమైన గ్రాఫిక్స్‌ను పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. అమ్మోరు సినిమాతో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ చూపించిన కోడి, అంజి సినిమా గ్రాఫిక్స్‌కు జాతీయ అవార్డ్‌ను కూడా సాధించాడు. తాజాగా మరో గ్రాఫికల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఏడేళ్ల క్రితం మరణించిన కన్నడ స్టార్ హీరో విష్ణు వర్ధన్ హీరోగా ఓ సినిమాను రూపొందించాడు కోడి రామకృష్ణ. చనిపోయిన విష్ణువర్దన్ తెర మీద చూపించేందుకు. 450 మంది గ్రాఫిక్ ఆర్టిస్ట్‌లు రెండేళ్ల పాటు శ్రమించారు. సాండల్‌వుడ్ గ్లామర్ బ్యూటి రమ్య, సాయికుమార్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో గ్రాఫిక్స్, సాహస సింహ విష్ణువర్దన్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. -
పూర్వజన్మ కథ!
‘‘కోడి రామకృష్ణగారితో నా అనుబంధం 30ఏళ్లు. మేమిద్దరం కలిసి చాలా చిత్రాలు చేశాం. ఆయనతో ఇప్పటికీ సినిమాలు చేయాలనుకుంటున్నా. సోషియో ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాలు నాకు బాగా ఇష్టం. ఇటువంటి చిత్రాలే సాధారణ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. మకుట కంపెనీ వారు ఈ చిత్రం కోసం గ్రాఫిక్స్ చేస్తుండటం గర్వకారణం. టీజర్ చూస్తుంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలుస్తోంది’’ అని నిర్మాత శ్యాం ప్రసాద్‌రెడ్డి అన్నారు. దిగంత్, రమ్య జంటగా కన్నడ స్టార్ విష్ణువర్థన్ (విజువల్ ఎఫెక్ట్స్ రూపంలో) ప్రత్యేక పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారీ నిర్మించిన చిత్రం ‘నాగభరణం’. ఈ చిత్రం టీజర్‌ను శ్యాం ప్రసాద్‌రెడ్డి విడుదల చేశారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ- ‘‘పూర్వజన్మకు సంబంధించిన కథ ఇది. ఓ అమ్మాయి పూర్వజన్మలో కోల్పోయిన ఎమోషన్స్‌ని ఈ జన్మలో పాము రూపంలో ఎలా తీర్చుకుంది? అన్నదే కథ’’ అన్నారు. ‘‘కోడి రామకృష్ణ నిర్మాతల దర్శకుడు. ఈ చిత్రం సాజిద్ ఖురేషికి మంచి పేరు, డబ్బు తీసుకు రావాలి. టీజర్ బాగుంది’’ అని నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ అన్నారు. మకట గ్రాఫిక్స్ దొరబాబు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలావుద్దీన్ యూసఫ్.