ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి పదవీకాలం ఏడాది పొడిగింపు!
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్‌గా అరుంధతీ భట్టాచార్య పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. నిజానికి ఆమె మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగిసింది. భారతీయ మహిళా బ్యాంక్‌సహా 5 ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం 2017 మార్చితో ముగియాలన్న లక్ష్యం నేపథ్యంలో పదవీకాలం పొడిగింపు ఊహాగానాలు కొనసాగాయి.
మాతృసంస్థలో విలీనం అవుతున్న ఐదు అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లు ఉన్నాయి. మరో రెండు అనుంబంధ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాల విలీనానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం విదితమే.