
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కత్తిసాము, కర్రసాముతో పాటు గుర్రపు స్వారీలో ఎంతటి నిష్ణాతుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీలు చిక్కినప్పుడల్లా ఈ విద్యలను ప్రదర్శిస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ సర్‌కు ఆనందం కలిగితే మైదానంలో బ్యాట్‌తోనే కత్తిసాము చేస్తుండటం ఇదివరకు ఎన్నో సార్లుచూశాం. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జడ్డూ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టిపెడుతూనే ఈ మూడింటిపై ఓ లుక్కేస్తున్నాడు. (కరోనా భయం లేదు: స్టేడియానికి 30,000 మంది)
ఇప్పటికే ఇంట్లో కత్తిసాము చేసిన వీడియోలను, తన ఫామ్ హౌస్‌లో గుర్రపు స్వారీ చేసిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను జడేజా ఇన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతడు తీసుకున్న కొత్త గుర్రాన్ని మచ్చిక చేసుకుంటూ స్వారీకి సిద్దం చేస్తున్నాడు. ఈ సందర్భంగా గుర్రపు స్వారీకి సిద్దం అన్నట్లు ఓ కామెంట్ జతచేశాడు. ఇక గుర్రపు స్వారీ చేయడం తన ఆల్‌టైమ్ ఫేవరేట్ అంటూ గతంలో రవీంద్ర జడేజా పేర్కొన్న విషయం తెలిసిందే. (కరోనా నుంచి కోలుకున్న మాజీ క్రికెటర్)
Comments
Please login to add a commentAdd a comment