
సాక్షి, చెన్నై: శృంగార తారల్లో నటి సన్నీలియోన్ ప్రత్యేకం అని చెప్పకతప్పదు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ నటనతో తన సత్తా చాటుకుంటోంది. ఈ శృంగార తార ఒక చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తోంది. దీనికి వీరమదేవి అని పేరును ఖరారు చేశారు. హీరో భరత్ నటించిన పొట్టు చిత్రాన్ని తెరకెక్కించిన వీసి.వడివుడయాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ సినిమా తమిళంలో తెరకెక్కడం.
సన్నీలియోన్ వీరనారిగా నటిస్తున్న ఈ చిత్రం ఆదివారం చెన్నైలో ప్రారంభమైంది. సన్నీ కత్తి పట్టి గుర్రంపై స్వారీ చేసే సన్నివేశాన్ని దర్శకుడు తొలి షాట్‌గా చిత్రీకరించారు. ఆమె గుర్రంపై స్వారీ చేస్తుంటే ఆమె వెనుక పాతిక మంది గుర్రాలపై వెంటపడే సన్నివేశాలను సూట్ చేశారు. ఆమె చారిత్రక కథా చిత్రంలో నటించడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
చిత్ర యూనిట్ మాత్రం వాటిని లెక్క చేయకుండా వీరమదేవి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. మరి చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత విడుదల సమయంలో ఎలాంటి సమస్యలను ఈ వీరమదేవి ఎదుర్కొనవలసి వస్తుందో వేచి చూడాలి. పైగా వీరమదేవి చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment