చారిత్రాత్మక సినిమాలో సన్నీలియోన్‌.! | Sunny Leone To Make Her Tollywood Debut Through A War Period Drama | Sakshi
Sakshi News home page

చారిత్రాత్మక తెలుగు సినిమాలో సన్నీలియోన్‌.!

Dec 3 2017 7:59 PM | Updated on Aug 28 2018 4:32 PM

 Sunny Leone To Make Her Tollywood Debut Through A War Period Drama - Sakshi

బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ డైరెక్ట్‌ హీరోయిన్‌గా త్వరలోనే టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనుంది. ఇటీవల గరుడవేగ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో అలరించిన సన్నీ చారిత్రత్మక కథతో తెరకెక్కనున్న మరో తెలుగు చిత్రంలో నటించాడానికి ఒప్పుకుంది. యుద్ద సన్నివేశాలతో తీయనున్న ఈ చిత్రంలో సన్నీలియోన్‌ లీడ్‌ రోల్‌ చేయనుంది. దీని కోసం కసరత్తు కూడా మోదలు పెట్టింది ఈ అమ్మడు. ముంబైలో ప్రముఖ ట్రైనర్ వద్ద కత్తి సాము, గుర్రపు స్వారీతోపాటు యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుంది.

 భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం సన్నీలియోన్ 150 రోజుల కాల్‌షీట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది.  తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ మూవీకి బాహుబలి, 2.0 సినిమాలకు గ్రాఫిక్స్‌ వర్క్‌ చేసిన సంస్థలు పనిచేయనున్నాయి. ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు. వీసీ వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాపై సన్నీలియోన్ స్పందిస్తూ ఇలాంటి ఒక అద్భుతమైన కథ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు నాకున్న ఇమేజ్ ను పూర్తిస్థాయిలో మార్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. చాలా రోజుల నుంచి ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనుకొంటున్నా. దర్శకుడు వి.సి.వడివుడయన్ కథ చెప్పిన మరుక్షణం నుండే ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాను. యాక్షన్ సన్నివేశాల్లో నటించాలన్నది నా కల. అది ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement