న్యూ ఇయర్‌ సందడికి సన్నిలియోన్‌ సిద్ధం | Sunny Leone in Tamil Nadu in New Year Celebrations | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ సందడికి సన్నిలియోన్‌ సిద్ధం

Published Wed, Dec 26 2018 11:53 AM | Last Updated on Wed, Dec 26 2018 12:49 PM

Sunny Leone in Tamil Nadu in New Year Celebrations  - Sakshi

నూతన సంవత్సరం వస్తుందంటేనే నగరాల్లోని ఫామ్‌ హౌస్‌లు, పబ్‌ల్లో, నక్షత్ర హోటళ్లలో పార్టీలతో సరదాల సందడి మొదలవుతుంది. ఈ సరదాల వేడుకలకు స్టార్‌ హీరోయిన్ల ఆటపాట ప్రముఖలను ఖుషీ చేస్తుంది. అలా ఈ ఏడాది డిసెంబర్‌ 31 రాత్రి వేడుకల్లో బాలీవుడ్‌ శృంగార తార సన్నిలియోన్‌ చెన్నైలో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. తన ఒంపు సొంపుల వయ్యారాలతో సరదారాయుళ్లను మైమరపించనుంది.

బెంగళూర్‌కు చెందిన గ్లిట్టర్స్‌ అనే ఏజెన్సీ సంస్థ ఈ న్యూఇయర్‌ పార్టీలను చెన్నైలో నిర్వహించనుంది. చెన్నైలోని రీసార్ట్స్, కన్వెన్షన్‌ సెంటర్, షేర్టాన్, మహాబలిపురం  ప్రాంతాల్లో ఈ పార్టీలను నిర్వహించనుంది. సన్నిలియోన్‌ ఆటపాటలతో పాటు ప్రముఖ సంగీత దర్శకుల సంగీత కచేరీలు పలు ఎంటర్‌టెయినర్‌ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పార్టీలో పాల్గొనాలనుకునే వారుwww.highape.com ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చునని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement