బ్రిటన్: అసలే మనదేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిపోతున్నాయి. మొన్నమెన్నటి వరకూ కరోనా మహమ్మారి కారణంగా చాలామంది జీవనోపాధి లేక, వ్యాపాలరాలు సజావుగా సాగక ప్రజలు అల్లాడిపోతుంటే ఈ పెరుగతున్న ధరలు ప్రజల పాలిట శాపంలా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారయ్యింది. మనం పెట్రోల్ కొనడానికి భయపడుతుంటే అందుకు విరుధంగా బ్రిటన్‌లో ఉంది. అక్కడ పెట్రోల్ దొరకడమే కష్టంగా ఉంది.
(చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు షాక్.. ఆ కంటెంట్ ఉంటే నిషేధమే..!)
అంతేకాదు అక్కడి ప్రజలు పెట్రోల్ సంక్షోభంతో అల్లాడిపోతున్నారు. ఈ మేరకు పెట్రోల్ బంక్‌ల వద్ద జనం పెద్ద ఎత్తున్న బారుల తీరి ఉంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవలసిన అవసరం లేదు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం పై నిరసనలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది నిరసన కారులు నీళ్ల బాటిళ్లతో పెట్రోల్ బంక్‌లను నింపడం, దాడి కచేయడం వంటి పలురకాల పనులతో తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో గస్ లీ డాల్ఫిన్ అనే వ్యక్తి గుర్రంపై స్వారీ చేసుకుంటూ పెట్రోట్ బంక్ దగ్గరకు వచ్చి అటూ ఇటూ వచ్చి పచార్లు చేశాడు. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఒకింత ఆశ్చర్యంతో మాకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదు అన్నట్టుగా అతని వంక విస్మయంతో చూస్తున్నారు.
మన పూర్వీకులు ఏవిధంగా అయితే ప్రయాణం చేయటానికీ గుర్రాలు, ఎద్దులు, ఒంటెలు ఉపయోగించేవారో ఆ విధంగా సదరు వ్యక్తి గుర్రపు స్వారితో పెట్రోల్ సంక్షోభానికీ ఒక చక్కని పరిష్కార మార్గాన్ని చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పలు నెటిజన్‌లు నీ గర్రం హార్స్ పవర్ ఎంత అంటూ చమత్కారంగా ట్వీట్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి మిలియన్స్‌లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టేనా!)
Comments
Please login to add a commentAdd a comment