
ఫ్రమ్ సిల్వర్ స్క్రీన్ టు స్మాల్ స్క్రీన్‌కి వెళ్లినంత మాత్రాన తారలు తక్కువైపోరు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఇవాళ టీవీ లేని ఇల్లు ఉందా? చెప్పండి. బిగ్ బి నుంచి మన చిన్న ఎన్టీఆర్ వరకూ ఫామ్‌లో ఉన్న స్టార్స్ అందరూ టీవీ షోస్ చేస్తున్నారు. ఇప్పుడు కన్నడ బ్యూటీ సంజన స్మాల్ స్క్రీన్‌కు అరంగేట్రం చేయనున్నారు. బుజ్జిగాడు మేడిన్ చెన్నై, సత్యమేవ జయతే, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ‘స్వర్ణ ఖడ్గం’ అనే సీరియల్‌లో నటించనున్నారు.
‘‘ఇండియన్ ఎపిక్ ‘బాహుబలి’ని నిర్మించిన ‘ఆర్కా మీడియా’ సంస్థ ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ సీరియల్‌ను నిర్మించనున్నారు. టెలివిజన్ టాప్ డైరెక్టర్ యాతా సత్యనారాయణగారు దర్శకుడు. ‘బాహుబలి’కి పని చేసిన వీఎఫ్‌ఎక్స్ మరియు సీజీ టీమ్ ఈ సీరియల్‌కు పని చేస్తున్నారు. ‘‘ఇది పీరియాడిక్ సీరియల్ కాబట్టి గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. హీరోయిన్ సెంట్రిక్ సీరియల్. 100కు పైగా ఎపిసోడ్లు ఉన్న ఈ మెగా సీరియల్‌లో నేను నా డ్రీమ్ రోల్ చేస్తున్నా’’ అని ‘సాక్షి’తో సంజన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment