
న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టోక్యో ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) ఈవెంట్‌లో భారత హార్స్ రైడర్ ఫౌద్ మీర్జా అర్హత సాధించాడు. ఈక్వె్రస్టియన్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఫౌద్ మీర్జా టోక్యో ఒలింపిక్స్‌కు అధికారికంగా బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ కోసం 2019 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య కాలంలో కనబరిచిన ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారు. ఫౌద్ మీర్జాకంటే ముందు భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఒలింపిక్స్ ఈక్వె్రస్టియన్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఇంతియాజ్ అనీస్... 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో ఐజే లాంబా భారత్ తరఫున ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో బరిలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment