లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కొలంబో వేదికగా గాలె టైటాన్స్, దంబుల్లా ఆరా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఓ అనుకోని అతిథి వచ్చింది. దంబుల్లా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాము మైదానంలోకి ప్రవేశించింది. క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరా ఉన్నారు. ఇంతలోనే పాము మైదానంలోకి వచ్చినట్లు స్క్రీన్‌పై చూపించారు. ఒక్క సారిగా ఆటగాళ్లు పామును చూసి ఉలిక్కిపడ్డారు.
అంపైర్‌లు వెంటనే స్టేడియం భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. పామును పట్టుకుని వెళ్లారు. ఈ క్రమంలో 10 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్ ఓవర్‌లో దంబుల్లాపై గాలే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గాలె టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
గాలే బ్యాటర్లలో భానుక రాజపక్స (48), కెప్టెన్ దాసున్ షనక (42 నాటౌట్) రాణించారు. అనంతరం లో దంబుల్లా కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులే చేసింది. దీంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన గాలె టైటాన్స్ కేవలం రెండు బంతుల్లోనే 11 పరుగులు చేసి విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో గాలె ఓపెనర్ రాజపాక్స వరుసగా సిక్స్ ఫోర్ బాది తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
చదవండి: ENG vs AUS: ఆఖరి మజిలీలో ఇంగ్లండ్‌దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు
Hello, stranger. Where is your accreditation card? 🐍
— LPL - Lanka Premier League (@LPLT20) July 31, 2023
Even the Sri Lankan wildlife can't resist the action at the LPL! 🏏#LPL2023 #LiveTheAction pic.twitter.com/R9Fa5k1D3p
Comments
Please login to add a commentAdd a comment