వైరల్‌: నీళ్లలో పాముల సయ్యాట.. ఒళ్లు జలదరించాల్సిందే | Snakes Twirl Around Each Other in Water, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Naag Naagin Dance: నీళ్లలో పాముల సయ్యాట.. ఒళ్లు జలదరించాల్సిందే

Published Sat, Oct 23 2021 6:07 PM | Last Updated on Sat, Oct 23 2021 7:22 PM

Snakes Twirl Around Each Other in Water, Video Goes Viral - Sakshi

ఒక పామును చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది రెండు పాములు ఒక్కచోట చేరి సయ్యాటలాడుతూ కనిపిస్తే? వామ్మో..ఇంకేమైనా ఉందా.. గుండె జారుతుంది కదూ. తాజాగా హెలికాప్టర్‌ యాట్రా అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఈ వీడియో చూస్తే కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఈ వీడియోలో.. పచ్చని చెట్ల మధ్యలోని నీటిలో ఎనిమిదడుగల పొడవున్న రెండు పాములు ఒకదానికొకటి చుట్టుకొని డ్యాన్స్‌ చేస్తూ కనిపించాయి.
చదవండి: వైరల్‌: తండ్రి లైవ్‌ ఇంటర్వ్యూలో కొడుకు చిలిపి చేష్టలు..

పాములు ఒక్క క్షణం అలా ఆగి మళ్లీ దూకుడుగా మెలి తిరుగుతూ ఆవేశంగా నీటిని చిమ్ముతున్నాయి. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే దీనిని చూసిన నెటిజన్లు పాములు అసలు సయ్యాటలు ఆడుతున్నాయా లేక పోట్లాడుకుంటున్నాయా? అని ఆశ్చర్యపోతున్నారు. చాలామంది నాగ్‌, నాగినిల మధ్య అందమైన డ్యాన్స్‌ అని అంటుంటే.. మరి కొంతమంది రెండు మగ పాముల కుస్తీ పోటీ అని చెబుతున్నారు. ఏదైతే ఏంటి.. వీడియో మాత్రం బాగుంది కదా.. చూసేయండి మరి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement