Watch: Jomel Warrican Cleans Up Rohit Sharma With A Magical Delivery, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND Vs WI 2nd Test: అయ్యో రోహిత్‌.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్‌

Published Fri, Jul 21 2023 5:44 PM | Last Updated on Fri, Jul 21 2023 8:32 PM

Jomel Warrican Cleans Up Rohit Sharma By an Absolute Peach - Sakshi

వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చెలరేగిన హిట్‌మ్యాన్‌.. ఇప్పుడు రెండో టెస్టులో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 143 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు  139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇక ఇది ఇలా ఉండగా..  తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ను విండీస్‌ స్పిన్నర్‌ వారికన్ ఓ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. భారత ఇన్నింగ్స్‌ 39 ఓవర్‌ వేసిన వారికిన్‌ బౌలింగ్‌లో ఐదో బంతిని రోహిత్‌ ఢిపెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మిడిల్‌స్టంప్‌ దిశగా పడిన బంతి అనూహ్యంగా టర్న్‌ అయ్యి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన రోహిత్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.

మరో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోవడంతో రోహిత్‌ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండో టెస్టు మెదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(87 నాటౌట్‌) సెంచరీకి చేరువలో ఉన్నాడు.  కోహ్లితో పాటు క్రీజులో రవీంద్ర జడేజా 36(నాటౌట్) ఉన్నాడు.
చదవండి: WTC Points Table: అగ్రస్థానంలో రోహిత్‌ సేన.. పాకిస్తాన్‌ కూడా మనవెంటే! చాంపియన్‌ ఎక్కడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement