West Indies vs India, 2nd Test: ‘‘డబ్ల్యూటీసీ తాజా సైకిల్‌లో పటిష్ట జట్లతో సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అందులో కొన్ని విదేశాల్లో ఆడాలి. కాబట్టి ప్రస్తుతం ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం టీమిండియాకు తీరని నష్టంగానే భావించాలి’’ అని భారత మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా అన్నాడు. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో టీమిండియా తమ తొలి సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడింది.
2-0తో క్లీన్‌స్వీప్ చేద్దామనుకుంటే..
కరేబియన్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ గెలుపొంది 2-0తో క్లీన్‌స్వీప్ చేయాలని భావించింది. అయితే, వర్షం కారణంగా విండీస్- టీమిండియా మధ్య రెండో టెస్టు ఐదో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసిపోయింది.
ఒకవేళ వర్షం తెరిపినిస్తే ఫామ్‌లో ఉన్న భారత బౌలర్లు విండీస్ బ్యాటర్ల పనిపట్టేవారే. ఎనిమిది వికెట్లను పడగొట్టడం అంత కష్టమయ్యేది కాదు. అయితే, అనూహ్యంగా వరణుడి కారణంగా ఆట వీలుకాకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది.
టీమిండియాకు భారీ నష్టం
ఈ నేపథ్యంలో 12 పాయింట్లు రావాల్సిన చోట టీమిండియాకు 4 పాయింట్లే వచ్చాయి. ఆతిథ్య విండీస్ ఖాతాలో సైతం 4 పాయింట్లు చేరాయి. ఈ క్రమంలో దీప్‌దాస్ గుప్తా మాట్లాడుతూ.. ట్రినిడాడ్ మ్యాచ్ డ్రా అయిన కారణంగా భారత జట్టు భారీగా నష్టపోయిందని పేర్కొన్నాడు.
‘‘డబ్ల్యూటీసీ తాజా సైకిల్‌లో ఆరంభంలోనే ఇలా జరిగింది. వెస్టిండీస్ సిరీస్ అనగానే రెండు మ్యాచ్‌లు గెలిచి టీమిండియా 2-0తో ముగిస్తుందని అనుకున్నారంతా! కానీ అలా జరుగలేదు. మున్ముందు పటిష్ట జట్లతో ఆడాల్సి ఉంది. అలాంటపుడు 8 పాయింట్ల మేర నష్టపోవడం అంటే మామూలు విషయం కాదు’’ అని దీప్‌దాస్ గుప్తా చెప్పుకొచ్చాడు.
అందుకే వాళ్లు అభాసుపాలవుతున్నారు
ఇక వెస్టిండీస్ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువ లేదన్న ఈ మాజీ బ్యాటర్.. నిలకడలేమి ఆట వల్లే అభాసుపాలవుతున్నారని అభిప్రాయపడ్డాడు. కాగా డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ట్రినిడాడ్‌లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానం కోల్పోగా.. పాకిస్తాన్ టాప్‌లో కొనసాగుతోంది.
చదవండి: వరల్డ్‌కప్‌నకు ముందు ఆసీస్‌తో టీమిండియా వన్డే సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే: బీసీసీఐ
ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ మనదే.. అయితే ఆ విషయంలో మాత్రం: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment